జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘జమాన’
సూర్య శ్రీనివాస్, సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమాన’. భాస్కర్ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్, శివకాంత్, శశికాంత్ నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు భాస్కర్ జక్కుల మాట్లాడుతూ... జమాన సినిమా డిఫరెంట్ గా ఉంటుంది, మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ తో ఈ సినిమాను తీయడం జరిగింది. సినిమా ఆద్యంతం వినోదంతో పాటు ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి. నిర్మాత శివకాంత్ మాట్లాడుతూ... జమాన సినిమాను దర్శకుడు భాస్కర్ చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించారు. సినిమా తప్పకుండా అందరిని అలరిస్తుందని నమ్ముతున్నను. మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి కృతఙ్ఞతలు అన్నారు. హీరో సూర్య శ్రీనివాస్ మరియు సంజీవ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ... కష్టపడి చేసిన జమాన సినిమా జనవరి 30న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాము అన్నారు. ‘నేటి యువతరం ఆలోచనలకు అద్దం పట్టే చిత్రమిది. హైదరాబాద్ పాతబస్తీ నేపథ్యంలో ఈ చిత్ర...