మే 10న "బ్రహ్మచారి" మూవీ విడుదల
‘బ్రహ్మచారి’లో టైమింగ్ బాగుంది.. కచ్చితంగా సక్సెస్ అవుతుంది.. విడుదలకు ముందే నంది అవార్డుకు ఎంపికవడం గొప్ప విషయం : ‘బ్రహ్మచారి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అతిథులు అద్వితీయ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై రాంభూపాల్ రెడ్డి నిర్మాతగా ఎన్నో చిన్న చిత్రాలకు పని చేసిన నర్సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బ్రహ్మచారి’. ఏఎన్నార్, కమల్ హాసన్ లాంటి మహామహులు నటించిన ‘బ్రహ్మచారి’ టైటిల్‌తో వచ్చిన సినిమాలు బాగా సక్సెస్ ఐనట్లే తెలంగాణ యాసలో వస్తున్న పర్‌ఫెక్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసే మల్లేశం హీరోగా నటించిన ఈ చిత్రం మే 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. సోమవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర్ శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర యూనిట్‌కు విషెస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, సీనియర్ డైరెక్టర్ చంద్ర మహేశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక అ