"ప్రేమిస్తున్నా" చిత్రం ఇప్పుడు ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ !!!
వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు.
ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదలై మంచి మౌత్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వచ్ఛమైన ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు. దర్శకుడు భాను ప్రేమిస్తున్నా సినిమాను న్యూ ఏజెడ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కు చూపించారు.
"అన్ కండీషనల్ లవ్ తో తెరకెక్కిన సినిమా ప్రేమిస్తున్నా. ఇప్పటివరకు తెలుగులో అంత అన్ కండీషనల్ లవ్ తో ఏ సినిమా రాలేదు, అద్భుతమైన పాటలు, పర్ఫార్మెన్స్ తో ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల అయ్యింది. చాలా కాలం తరువాత వచ్చిన బ్యూటిఫుల్ లవ్ స్టొరీ ఈ సినిమా. థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ ఈ సినిమాను ఆహా ఓటిటి లో చూడవచ్చు.
ఇదొక మ్యూజికల్ లవ్ స్టొరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పేరు సంపాదించుకుంది, భాస్కర్ శ్యామల ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు, అనిల్ కుమార్ అచ్చు గట్ల ఈ సినిమాకు సంభాషణలు రాయడం జరిగింది, ఈ సినిమాకు నిర్వహణ మర్రి రవికుమార్, ఎడిటర్ శిరీష్ ప్రసాద్.
Comments
Post a Comment