"గం..గం..గణేశా" పర్పెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే రెస్పాన్స్ వస్తోంది - సక్సెస్ మీట్ లో మూవీ టీమ్
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "గం..గం..గణేశా". ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చిన "గం..గం..గణేశా" సినిమా అన్ని ఏరియాల నుంచి సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని మాట్లాడుతూ - మా "గం..గం..గణేశా" సినిమాను ప్రేక్షకుల మధ్యలో కూర్చుని చూశాము. మంచి రెస్పాన్స్ వస్తోంది. కామెడీ సీన్స్ కు ఊగిపోతూ నవ్వుతున్నారు. ఫ్యామిలీస్ తో మీడియా మిత్రులు వచ్చి సినిమా చూశారు. మా దర్శకుడు ఉదయ్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే సినిమా రూపొందించారు. అన్ని మేజర్ క్యారెక్టర్స్ కు ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు. మా మూవీతో పాటు రిలీజైన మరో రెండు సినిమాలకు కూడా పాజిటివ్ టాక్ రావడం సంతోషకరం. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి మరోసారి "గం..గం..గణేశా" చూసేందుకు వెళ్తున