నటుడిగా గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న రమణా రెడ్డి !!!
పురెల్లి రమణా రెడ్డి ఇప్పటివరకు దాదాపు 150 చిత్రాల్లో నటించారు, అందులో ముఖ్యంగా అఖండ, ఖైదీ నెంబర్ 150, గబ్బర్ సింగ్, క్రాక్, రూలర్, సైర నరసింహ రెడ్డి, గద్దలకొండ గణేష్, ది వారియర్, సీత, గరుడవేగా, ధ్రువ, కిక్ 2, నేనేరాజు నేనే మంత్రి, వీరసింహ రెడ్డి ఇంకా మరెన్నో చిత్రాలలో నటించారు.
నాటకాలు గడి, మదర్ థెరిసా చేశారు అలాగే టీవీ షోస్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ చేశారు. ఆమెజాన్ లో గ్యాంగ్ స్టార్స్, జీ 5 లో లుజర్ , ఏటీఎం వెబ్ సీరీస్ లో నటించారు. 2015 - 16 నంది నాటకోత్సవాల్లో గడి నాటగానికి గాను బెస్ట్ నంది అవార్డ్ రావడం విశేషం.
ప్రస్తుతం ఆంధ్ర కింగ్ తాలుకా సినిమాలో అలాగే రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలో మంచి రోల్స్ లో రమణా రెడ్డి నటించి మెప్పించారు. బాలయ్య అఖండ 2 తో పాటు తరుణ్ భాస్కర్ నూతన చిత్రంలో అలాగే పూరి సేతుపతి, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించారు త్వరలో ఈ మూవీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
Comments
Post a Comment