ఘనంగా “ఓహ్!” మూవీ అత్యధిక థియేటర్లలోడిసెంబర్ 19న విడుదల

జీవిత బడుగు సమర్పణలో ఏకారి ఫిలిమ్స్ పతాకంపై రఘు రామ్ హీరోగా, శృతి శెట్టి, నైనా పాఠక్ హీరోయిన్స్ గా ఇదివరకే పలు చిత్రాలకి దర్శకత్వం వహించిన సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “ఓహ్!”. కాశ్మీర్, కులుమునాలి, ఆగ్రా, ఢిల్లీ, గోవా, హైదరాబాద్ వరంగల్ వంటి అందమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుకొని . అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 19న విడుదలకు సిద్దమైనది.              

ఈ సందర్బంగా 
చిత్ర సమర్పకురాలు బి ఆర్ ఆర్ గ్రూప్స్ అధినేత్రి శ్రీమతి జీవిత బడుగు మాట్లాడుతూ : మేము మా బిజినెస్ లో కస్టమర్స్ కు అద్భుతమైన క్వాలిటీ అందిస్తున్నాము అలాగే ఇప్పుడు ఓహ్ మూవీని కూడా అంతే క్వాలిటీ తో ప్రేక్షకులకు అందిస్తున్నాము అని అన్నారు.

దర్శక నిర్మాత సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ :
“ఐదు చిత్రాలను నిర్మించిన అనుభవంతో ఒక కొత్త జోనర్ లో, క్రోమో ఫోబియా ని పాయింట్ గా తీసుకొని ఈ చిత్రం రూపొందించాం. కాశ్మీర్ ప్రాంతంలో పూర్తి షూట్ చేసాం. ఈ నెల 19న రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు.

హీరో రఘురామ్ : మాట్లాడుతూ : “ఓహ్” మూవీతో మీ అందరి ముందుకు వస్తున్నాను. సిల్వర్ స్క్రీన్ మీద ఇంతవరకు రానటువంటి అందమైన ప్రేమ కావ్యంతో ఈ చిత్రం వస్తుంది. నా మొదటి చిత్రం కథ కోసం ఎంతో రీసెర్చ్ చేసి నేను అద్భుతమైన కథ కథనం మాటలు రాశాను. మీ అందరిచే ఓహ్ ఓహ్ అనిపిస్తాను. సాక్షాత్ ఆ పరమశివుడు కొలువై ఉన్న హిమాలయాలు అంతా స్వచ్ఛమైన చిత్రమిది అని అన్నారు.

హీరోయిన్ శృతి శెట్టి మాట్లాడుతూ : టైటిల్ తో పాటు సినిమా
చాలా బాగుంటుంది. కాశ్మీర్ మంచు కొండలలో ముఖ్యంగా కెమెరా వర్క్, స్టోరీ చాలా బాగుంది. సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది” అన్నారు.

హీరోయిన్ నైనా పాఠక్ మాట్లాడుతూ : యూత్ కి కావలిసిన అన్ని హంగులు, రొమాన్స్ కూడా ఇందులో ఉన్నాయి. మీరు తప్పకుండ ఎంజాయ్ చేస్తారు అని అన్నారు.

ముఖ్య తారాగణం :
హీరో: రఘు రామ్ హీరోయిన్లు: శృతి శెట్టి, నైనా పాఠక్ సహాయ నటులు : కల్పగురి బిక్షపతి, మనోజ్,కరణ్,తదితరులు

సాంకేతిక నిపుణులు
దర్శక, నిర్మాత : సత్యనారాయణ ఏకారి,
కథ, కథనం, మాటలు: రఘు రామ్
సంగీతం :నవనీత్ చారి,
పాటలు : భాష్య శ్రీ
సినిమాటోగ్రఫీ : లక్కీ ఏకారి
కో- ప్రొడ్యూసర్స్: పి శ్రీకాంత్ రెడ్డి, వి రాఘవ్ రెడ్డి
కొరియోగ్రాఫర్ : రాజు మాస్టర్ (యస్. డి. సి )
పి.ఆర్. ఓ : ఆర్. కె చౌదరి

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

లేత గులాబీ టైటిల్ లాంచ్