ఏప్రిల్ 25న "శివ శంభో" చిత్రం విడుదల
▪ ఘనంగా "శివ శంభో" ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్: తెలుగు వెండితెరపై మరో భక్తిరస చిత్రం కనువిందు చేయబోతోంది. అనంత ఆర్ట్స్ బ్యానర్‌పై కృష్ణ ఇస్లావత్, సాయి చక్రవర్తి, కేశవర్థిని బేబీ రిషిత ప్రధాన పాత్రల్లో, నర్సింగ్ రావు దర్శకత్వంలో బొజ్జ రాజ గోపాల్, దోరవేటి సుగుణ నిర్మించిన చిత్రం "శివ శంభో". తనికెళ్ళ భరణి, సుమన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఈనెల (ఏప్రిల్) 25న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డా. గోరటి వెంకన్న, బీజేపీ నేత, జంతు ప్రేమికుడు చీకోటి ప్రవీణ్, ప్రముఖ నటుడు, రచయిత డా. తనికెళ్ల భరణి, బర్దీపుర పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వర గిరి స్వామీజీ, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, తదితరులు పాల్గొని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. చిత్రయూనిట్ సభ్యులందరికి పేరుపేరున శుభాకాంక్షలు, అభినందన...