Posts

కానిస్టేబుల్ మూవీ రివ్యూ & రేటింగ్ !!!

Image
నటీనటులు : వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, భవ్యశ్రీ, నిత్యశ్రీ, దువ్వాసి మోహన్ దర్శకుడు : ఆర్యన్ సుభాన్ ఎస్ కే నిర్మాత : బలగం జగదీష్ సంగీత దర్శకుడు : సుభాష్ ఆనంద్, గ్యాని సినిమాటోగ్రాఫర్ : షైక్ హజారా ఎడిటర్ : శ్రీవర ఈ వారం థియేటర్స్ లోకి పలు సినిమాలు వస్తే వాటిలో నటుడు వరుణ్ సందేశ్ నటించిన చిత్రం “కానిస్టేబుల్” కూడా ఒకటి. ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. కథ: మోకిలా మండలం, శంకరపల్లి అనే చిన్న గ్రామంలో ఆకస్మికంగా కొన్ని హత్యలు వరుసగా అతి దారుణంగా జరుగుతూ ఉంటాయి. ఆడ మగ అని తేడా లేకుండా జరుగుతున్న ఈ హత్యలు పోలీసులకి కూడా పెద్ద సవాలుగా మారుతాయి. అయితే ఈ ఊరి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబులే కాశీ (వరుణ్ సందేశ్). అయితే ఈ హత్యలు తన మేనకోడలు కీర్తి (నిత్యశ్రీ) వరకు కూడా వస్తాయి. ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన కాశీ ఎవరిని అయితే నిందితులు అనుకుంటారో వాళ్ళు కూడా చంపబడతారు. మరి అసలు ఈ హత్యలు చేస్తుంది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? అందుకు గల కారణం ఏంటి? చివరికి కాశీ వారిని పట్టుకున్నాడా లేదా అనేది ఇందులోని అసలు కథ. విశ్లేషణ: ఈ చిత్రంలో...

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన స్టార్ హీరో విజయ్ దేవరకొండ, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్, టాలెంటెడ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా కాంబినేషన్ క్రేజీ మూవీ

Image
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న కొత్త సినిమా ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రాజా వారు రాణి గారు సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ సినిమా ఇది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు హను రాఘవపూడి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల 16వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ఈ ప్రెస్టీజియస్ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నటీనటులు - విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్, తదితరులు టెక్నికల్ టీమ్  బ్యానర్ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాస్ట్యూమ్ డిజైనర్ - ప్రవీణ్ రాజా ప్రొడక్షన్ ...

‘మిత్ర మండలి’ చిత్రం సెన్సార్ పూర్తి.. యు/ఎ సర్టిఫికెట్

Image
ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా విజయేందర్ దర్శకత్వంలో బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్తాస్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో సెన్సార్ కార్యక్రమాల్ని కూడా చిత్రయూనిట్ పూర్తి చేసుకుంది. ‘మిత్ర మండలి’ ఆద్యంతం వినోదభరితంగా ఉందని, సమాజంలోని వ్యవస్థల  మీద సున్నితంగా విమర్శనాస్త్రాల్ని సంధించారని కొనియాడారు. ‘మిత్ర మండలి’ని బడ్డీ కామెడీ యాంగిల్‌లో చూపిస్తూనే మంచి సెటైరికల్ మూవీగా తెరకెక్కించారని అభినందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన చిత్రమని ‘యు/ఎ’ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఆద్యంతం అందరినీ ఆకట్టుకునేలా ‘మిత్ర మండలి’ని తెరకెక్కించారు.   ‘మిత్ర మండలి’ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ట్రాక్.. విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా కామెడీ హైలెట్ కానుందని అర్థం అవుతోంది. ఇక స్పెషల్ అట్రాక్షన్‌గా వెన్నె...

ఇద్దరమ్మాయిలతో లవ్‌లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? గమ్మత్తుగా ‘లవ్‌ ఓటిపి’ ట్రైలర్‌

Image
సూపర్‌ ఇంట్రెస్టింగ్‌ పేస్‌తో 2 నిమిషాల 27 సెకన్ల ట్రైలర్‌ను విడుదల చేసిన లవ్‌ ఓటిపి టీమ్‌. ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా ఇద్దరమ్మాయిలను ఒకేసారి ప్రేమించి ఇబ్బందిపడే అబ్బాయిల కథలా ఉంది ‘లవ్‌ ఓటిపి’ ట్రైలర్‌.  ప్రేమంటే అస్సలు పడని నాన్న పాత్రలో బెంగుళూరులో ఉండే పోలీసాఫీసర్‌గా రాజీవ్‌ కనకాల నటించారు.   భవప్రీతా ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ యం రెడ్డి నిర్మాతగా అనీష్, జాన్విక, స్వరూపిణిలు హీరో హీరోయిన్లుగా నటించిన  ‘లవ్‌ ఓటిపి’ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ట్రైలర్‌ను శనివారం విడుదల చేసింది చిత్ర యూనిట్‌.  ఈ సందర్భంగా నిర్మాత విజయ్‌ యం రెడ్డి మాట్లాడుతూ–‘‘ ఫ్రెష్‌ కంటెంట్‌తో వచ్చిన ఏ సినిమాకైనా ఫుల్‌ డిమాండ్‌ ఉంటుంది అని అందరికి తెలుసు. మా ‘లవ్‌ ఓటిపి’ సినిమాతో ఎవరూ ఊహించని ఎంటర్‌టైన్‌మెంట్‌ని మీ ముందుకు తీసుకువస్తున్నాం. హీరో హీరోయిన్లతో పాటు ఈ కొత్త రకం తండ్రి కొడుకులను చూసి ప్రేక్షకులు ముచ్చటపడతారు. మా హీరో అనిషే ఈ సినిమా దర్శకుడు కూడా కాబట్టి ఈ సినిమా తర్వాత చాలా పెద్ద హీరోగా, మంచి దర్శకునిగా పేరు సంపాదించుకుంటాడని నేను గ...

నవంబర్ 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ "సంతాన ప్రాప్తిరస్తు"

Image
టీజర్, లిరికల్ సాంగ్స్ వంటి ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో కావాల్సినంత బజ్ క్రియేట్ చేస్తున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ "సంతాన ప్రాప్తిరస్తు" రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను నవంబర్ 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ఈ రోజు మేకర్స్ ప్రకటించారు. నేటి సమాజంలో యూత్ కపుల్స్ ఎదుర్కొంటున్న ఓ సమస్య నేపథ్యంగా కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్, ఛాట్ బస్టర్ మ్యూజిక్ తో రూపొందిన "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. "సంతాన ప్రాప్తిరస్తు" చిత్రంలో విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్ డాక్టర్ భ్రమరం క్యారెక్టర్ లో నవ్వించబోతున్నారు. మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న "సంతాన ప్రాప్తిరస్తు" చిత్రాన్ని దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. నటీనటులు - విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్,  తరుణ్ భాస్కర్, అభినవ...

హీరో సత్య దేవ్ చేతుల మీదుగా మాస్టర్ మహేంద్రన్ నటించిన ‘వసుదేవసుతం’ టీజర్ విడుదల

Image
బేబీ చైత్ర శ్రీ బాదర్ల, మాస్టర్ యువ్వాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో ధనలక్ష్మి బాదర్ల నిర్మిస్తున్న చిత్రం ‘వసుదేవసుతం’. మాస్టర్ మహేంద్రన్ హీరోగా వైకుంఠ్ బోను దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.  రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను తాజాగా ప్రముఖ హీరో సత్య దేవ్ రిలీజ్ చేశారు.  ఈ ట్రైలర్‌.. ‘ఈ కథ ధర్మానికి అడ్డొస్తే.. మేనమామ అయినా, లక్షల బంధుగణమైనా, ఎదురుగా కోట్ల సాయుధులే ఉన్నా.. ధర్మ హింస తథైవచ అన్న శ్రీ కృష్ణుడిదే కాదు. ధర్మాన్ని కాపాడేందుకు ఎంతటి మారణహోమానికైనా ఎదురెళ్లే ఓ యువకుడిది’ అంటూ ఎంతో పవర్ ఫుల్‌గా సాగిన డైలాగ్‌తో టీజర్‌ను అద్భుతంగా ప్రారంభించారు. హీరో ఎంట్రీ.. గుడి, గుప్త నిధిని చూపించినట్టుగా వేసిన షాట్స్, హీరో హీరోయిన్ల ట్రాక్.. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో టీజర్‌ను గూస్ బంప్స్ వచ్చేలా కట్ చేశారు. మరీ ముఖ్యంగా టీజర్ చివర్లో కత్తితో నరికే సీన్ మాత్రం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. ఇక ఈ టీజర్ మణిశర్మ ఇచ్చిన ఆర్ఆర్ మాత్రం నెక్ట్స్ లెవెల్లో ఉంది. ఇక పార్కిం...

ఎనర్జిటిక్ క్యారెక్టర్ లో, కంప్లీట్ ఎంటర్ టైనర్ లో నన్ను చూడాలనుకునే అభిమానుల కోసమే "K-ర్యాంప్" మూవీ చేశాను - ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం

Image
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్  బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేశ్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. "K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైలాగ్ రైటర్ రవి మాట్లాడుతూ - "K-ర్యాంప్" సినిమా కథ విన్నప్పుడు చాలా ఎంటర్ టైనింగ్ గా అనిపించింది. ఈ కథను ఎంతో మెచ్యూర్డ్ గా తెరకెక్కించారు మా డైరెక్టర్ నాని. ప్రొడ్యూసర్ రాజేశ్ గారికి ప్రతి డైలాగ్ గుర్తుంటుంది. హీరో కిరణ్ అబ్బవరం ఎనర్జిటిక్ గా పర్ ఫార్మ్ చేశారు. మీరు ట్రైలర్ లో చూసింది కొంతే. సినిమా కంప్లీట్ గా ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ సినిమా చేస్తున్న టైమ్ లోనే తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం కలిగింది. అన్నారు. డీవోపీ సతీష్ రెడ్డి మాట్లాడుతూ - "K-ర్యాంప్" సినిమా ఒక్క నిమిషం కూడా బోర్ ...