పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన స్టార్ హీరో విజయ్ దేవరకొండ, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్, టాలెంటెడ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా కాంబినేషన్ క్రేజీ మూవీ


స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న కొత్త సినిమా ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రాజా వారు రాణి గారు సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ సినిమా ఇది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ నాయికగా నటిస్తోంది.

ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు హను రాఘవపూడి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల 16వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ఈ ప్రెస్టీజియస్ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


నటీనటులు - విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్, తదితరులు

టెక్నికల్ టీమ్ 

బ్యానర్ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
కాస్ట్యూమ్ డిజైనర్ - ప్రవీణ్ రాజా
ప్రొడక్షన్ డిజైనర్ - డినో శంకర్
డీవోపీ - అనంద్ సి.చంద్రన్
నిర్మాతలు - దిల్ రాజు, శిరీష్
రచన దర్శకత్వం -  రవికిరణ్ కోలా

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

లేత గులాబీ టైటిల్ లాంచ్