Posts

Showing posts from January, 2026

*మెగాస్టార్ చిరంజీవి గారితో నటించడం నా అదృష్టం : నటుడు కరాటే కార్తి !!!*

Image
*మెగాస్టార్ చిరంజీవి గారితో నటించడం నా అదృష్టం : నటుడు కరాటే కార్తి  !!!* నటన అంటే ఎంతో ఇష్టం కావడంతో సీఆర్‌పీఎఫ్‌ ఉద్యోగాన్ని వదిలి సినిమా రంగంలోకి అడుగుపెట్టి.. కమల్‌ హాసన్‌ నటించిన ‘దశావతారం’ చిత్రంలో జూనియర్‌ ఆర్టిస్టుగా తొలిసారి నటనకు శ్రీకారం చుట్టారు కరాటే కార్తి. ‘సింగం-3’, ‘దబాంగ్‌-3’, ‘బిగిల్‌’, ‘పేట’, ‘ఖైదీ’ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.  సినీ రంగంలో తన 14 యేళ్ళ పోరాటానికి తగిన గుర్తింపు, విజయం ‘డాక్టర్‌’ చిత్రం ద్వారా దక్కిందని నటుడు కరాటే కార్తి అంటున్నారు. ఈ క్రమంలో హీరో శివ కార్తికేయన్‌ నటించిన ‘డాక్టర్‌’తో మంచి గుర్తింపుతో పాటు విజయం కూడా వరించిందని కార్తి పేర్కొన్నారు.  తాజాగా కరాటే కార్తి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవితో నటించడం అదృష్టమని అతని దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నానని, అసలు మెగాస్టార్ చాలా సాధారణ మనిషిలా ఉంటాడని అలా ఉండడం అతని గొప్పదనమని అలాగే అనిల్ రావిపూడి తో వర్క్ చేయడం చాలా ఎనర్జీ ఇచ్చిందని అతను చెప్పినట్లు చేస్తే చాలు ఎవరైనా మంచి ఆర్టిస్ట్ అవ్వొచ్చని ఆయన...

సెన్సార్ పూర్తి చేసుకొని జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘జమాన’

Image
సెన్సార్ పూర్తి చేసుకొని జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్  ‘జమాన’  సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమాన’. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప నిర్మాత గా వ్యవహరించారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఇటీవల గ్రాండ్ గా జరిగింది, తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి, యు/ఏ సట్టిఫికెట్ పొందిన ఈ మూవీ జనవరి 30న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. జమాన సినిమా డిఫరెంట్ గా ఉంటుంది, మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ తో ఈ సినిమాను తీయడం జరిగింది. సినిమా ఆద్యంతం వినోదంతో పాటు ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి. ఈ సినిమాను దర్శకుడు భాస్కర్ చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించారు. సినిమా తప్పకుండా అందరిని అలరిస్తుందని చిత్ర యూనిట్  సభ్యులు తెలిపారు. ఎమ్. జి మూవీస్ అచ్చిబాబు ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ ఎడిటర్ ఎం అర్ వర్మ ఎడిటింగ్ చేశారు,  అతని వర్క్ సినిమాకు అదనపు ఆకర్షన కానుంది.  ‘నేటి యువతరం ఆలోచనలకు అద్దం పట్టే చిత్రమిది. హైదరాబాద్‌ పాతబస్తీ నేపథ్యంలో ఈ చిత్...

గ్రాండ్ గా ‘రామ్ భజరంగ్’ గ్లిమ్స్ విడుదల కార్యక్రమం !!!

Image
సన్ రైజ్ ఎంటర్‌టైన్‌మెంట్, రవి ఆర్ట్స్ బయ్యర్ల పై నిర్మాతలు స్వాతిసుధీర్, డాక్టర్ రవి బాల నిర్మిస్తున్న సినిమా ‘రామ్ భజరంగ్’. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న ‘రామ్ భజరంగ్’ సినిమాకు సి.హెచ్. సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ‘గదర్ 2’ హీరోయిన్ సిమ్రత్ కౌర్, ‘బిచ్చగాడు’ ఫేమ్ సట్న టీటస్, ఛాయా దేవి, మనసా రాధాకృష్ణన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, రవి శంకర్, కమల్, షఫీ, శివరామరాజు వెంకట్, ధనరాజ్, రచ్చ రవి, రాకేశ్, ఐశ్వర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 1980 బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ అద్భుతంగా ఉంటాయని, 2026లో ఐదు భాషల్లో (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ) ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, ఈ చిత్ర గ్లిమ్స్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది, ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కెమెరామేన్ అజయన్ విన్‌సెంట్ మాట్లాడుతూ... రామ్ భజరం...

క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ “కటాలన్” టీజర్ రిలీజ్, మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మూవీ రిలీజ్

Image
క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ 'కట్టాలన్' సెకండ్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఫస్ట్ లుక్ తర్వాత, రెండవ లుక్‌ మరింతగా ఆశ్చర్యపరిచేలా రూపొందించారు. ఏనుగుల వేట నుండి ప్రేరణ పొందిన ఉత్కంఠభరితమైన మాస్ యాక్షన్‌ను సూచిస్తూ, ఈ పోస్టర్ మలయాళ సినిమా చరిత్రలో మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో ఆంటోనీ వర్గీస్‌ను పరిచయం చేస్తుంది. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే, ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌లోనూ, తాజాగా విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది.  మలయాళ సినిమా చరిత్రలోనే  బిగ్గెస్ట్ రిలీజ్ గా నిలవనున్న 'కటాలన్', మే 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు. షరీఫ్ మహమ్మద్ నిర్మించిన పాన్-ఇండియన్ బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ 'మార్కో' తర్వాత క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నుండి వస్తున్న  మూవీ. మాస్ అప్పీల్ ,  యాక్షన్ పరంగా ఈ సినిమా 'మార్కో'ను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుందని పోస్టర్లు  సూచిస్తున్నాయి. ఈ చ...

Sindhuri telugu Movie launched, Shooting started !!!

Image
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సింధూరి చిత్రం !!! ఈరోజు సింధూరీ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది, ఈశ్వర్ హీరోగా ఐశ్వర్య హీరోయిన్ గా కిషోర్ బాబు నిర్మాతగా లీలారెడ్ది, రావు నిర్మాణంలో తెరకేక్కుతున్న ఈ సినిమాను కెకె దర్శకత్వం వాహిస్తున్నారు, నరాల నాగేశ్వరరావు రచనా సహకారం అందిస్తున్న ఈ సినిమాకు జయబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఈరోజు నుండి 90 రోజులు నాన్ స్టాప్ గా హైదరాబాద్  పరిసర ప్రాంతాల్లో జరుపుకోనుంది.  ఇది ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమ కథ. అబ్బాయి గోవిందు, అమ్మాయి పేరు సింధూరి. చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కారణంగా ఆ అబ్బాయికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అన్నదే ఈ కధ. తననే ప్రాణంగా ప్రేమించిన ఆ అబ్బాయికి తనలాగే వున్న మరో అమ్మాయిని చూపి పెళ్ళి చెయ్యాలి అనుకునే ఒక అమ్మాయి కథ. వీళ్ళిద్దరూ అనుకున్నది జరిగిందా లేదా? చివరికి ఏమయింది అన్నదే ఈ కధ.

Sahakutumbaanaam telugu movie review and rating

Image
స:కుటుంబానాం మూవీ రివ్యూ & రేటింగ్ !!! హెచ్.ఎన్. జి సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై నిర్మితమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా స:కుటుంబానాం. హీరోగా రామ్ కిరణ్, హీరోయిన్‌గా మేఘ ఆకాష్ నటించారు. రాజేంద్ర ప్రసాద్ , బ్రహ్మానందం , శుభలేఖ సుధాకర్, సత్య , భద్రం , రచ్చ రవి , తాగుబోతు రమేష్ , నిత్య శ్రీ ముఖ్య పాత్రల్లో నటించారు.. ఉదయ్ శర్మ స్టోరీ స్క్రీన్ ప్లే దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 1న థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఈ చిత్రం హెచ్. మహదేవ్ గౌడ్ , హెచ్ నాగరత్న నిర్మాతలు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రోహిత్ కుమార్ పద్మనాభ లైన్ ప్రొడ్యూసర్ ఎస్.అంకిత్ కనై తెరకెక్కింది. సంగీతం మణిశర్మ అందించారు. స:కుటుంబానాం సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం. కథ:  కళ్యాణ్ (రామ్ కిరణ్ ) సాప్ట్ వేర్ జాబ్, ఫ్యామిలీ కే తన ఫస్ట్ ఛాయిస్.. ఆఫీస్ అండ్ ఫ్యామిలీ తప్ప తనకి వేరే లోకం లేదు.. తన ఫ్యామిలీ ఒక్క మాట ఎవరైనా అంటే తట్టుకోలేడు... అలాంటి కళ్యాణ్ లైఫ్ లోకి సిరి ( మేఘ ఆకాష్ ) కళ్యాణ్ ఆఫీస్ లో జాయిన్ అవుతుంది.. ఎప్పుడు ఫ్యామిలీ అనే కళ్యాణ్, సిరి తో ప్రేమలో పడతాడు.. తర్వాత ఏం జరిగింది అనేది కథ  విశ్లేషణ...