నవంబర్ 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ "సంతాన ప్రాప్తిరస్తు"
టీజర్, లిరికల్ సాంగ్స్ వంటి ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో కావాల్సినంత బజ్ క్రియేట్ చేస్తున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ "సంతాన ప్రాప్తిరస్తు" రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను నవంబర్ 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ఈ రోజు మేకర్స్ ప్రకటించారు. నేటి సమాజంలో యూత్ కపుల్స్ ఎదుర్కొంటున్న ఓ సమస్య నేపథ్యంగా కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్, ఛాట్ బస్టర్ మ్యూజిక్ తో రూపొందిన "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
"సంతాన ప్రాప్తిరస్తు" చిత్రంలో విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్ డాక్టర్ భ్రమరం క్యారెక్టర్ లో నవ్వించబోతున్నారు. మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న "సంతాన ప్రాప్తిరస్తు" చిత్రాన్ని దర్శకుడు సంజీవ్ రెడ్డి రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు.
నటీనటులు - విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనీల్ గీల, సద్దాం తదితరులు
టెక్నికల్ టీమ్
డైరెక్టర్ - సంజీవ్ రెడ్డి
ప్రొడ్యూసర్స్ - మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే - సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్ జి
మ్యూజిక్ డైరెక్టర్ - సునీల్ కశ్యప్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ - అజయ్ అరసాడ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎ మధుసూదన్ రెడ్డి
సినిమాటోగ్రఫీ -మహి రెడ్డి పండుగుల
డైలాగ్స్ - కల్యాణ్ రాఘవ్
కొరియోగ్రాఫర్ - లక్ష్మణ్ కాళహస్తి
కాస్ట్యూమ్ డిజైనర్స్ - అశ్వత్ భైరి, కె ప్రతిభ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ - శివకుమార్ మచ్చ
డిజిటల్ - హౌస్ ఫుల్ డిజిటల్
మార్కెటింగ్, ప్రమోషన్స్ కన్సల్టెంట్ - విష్ణు కోమల్ల
లిరికల్ కంపోజిషన్ - రైట్ క్లిక్ స్టూడియో
పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
Comments
Post a Comment