కానిస్టేబుల్ మూవీ రివ్యూ & రేటింగ్ !!!
నటీనటులు : వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, భవ్యశ్రీ, నిత్యశ్రీ, దువ్వాసి మోహన్
దర్శకుడు : ఆర్యన్ సుభాన్ ఎస్ కే
నిర్మాత : బలగం జగదీష్
సంగీత దర్శకుడు : సుభాష్ ఆనంద్, గ్యాని
సినిమాటోగ్రాఫర్ : షైక్ హజారా
ఎడిటర్ : శ్రీవర
ఈ వారం థియేటర్స్ లోకి పలు సినిమాలు వస్తే వాటిలో నటుడు వరుణ్ సందేశ్ నటించిన చిత్రం “కానిస్టేబుల్” కూడా ఒకటి. ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
మోకిలా మండలం, శంకరపల్లి అనే చిన్న గ్రామంలో ఆకస్మికంగా కొన్ని హత్యలు వరుసగా అతి దారుణంగా జరుగుతూ ఉంటాయి. ఆడ మగ అని తేడా లేకుండా జరుగుతున్న ఈ హత్యలు పోలీసులకి కూడా పెద్ద సవాలుగా మారుతాయి. అయితే ఈ ఊరి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబులే కాశీ (వరుణ్ సందేశ్). అయితే ఈ హత్యలు తన మేనకోడలు కీర్తి (నిత్యశ్రీ) వరకు కూడా వస్తాయి. ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన కాశీ ఎవరిని అయితే నిందితులు అనుకుంటారో వాళ్ళు కూడా చంపబడతారు. మరి అసలు ఈ హత్యలు చేస్తుంది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? అందుకు గల కారణం ఏంటి? చివరికి కాశీ వారిని పట్టుకున్నాడా లేదా అనేది ఇందులోని అసలు కథ.
విశ్లేషణ:
ఈ చిత్రంలో ఉన్న మెయిన్ పాయింట్ కొత్తగా ఉంది..ఈ మధ్య కాలంలో వస్తున్న రొటీన్ మర్డర్ క్రైమ్ థ్రిల్లర్స్ కి కొంచెం భిన్నంగా ట్రై చేశారు. దానికి అనుగుణంగా సాగే కొన్ని సన్నివేశాలు బాగున్నాయి కొత్తగా అనిపిస్తాయి. మర్డర్స్ మిస్టరీ మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్ బాగుంది. అలాగే కొన్ని ట్విస్ట్ లు బాగా పేలాయి
ఇక హీరో వరుణ్ సందేశ్ చాలా కాలం తర్వాత ఓకే రేంజ్ పెర్ఫామెన్స్ ని అందించాడు.. వరుణ్ సందేశ్ అనగానే లవ్ స్టోరీస్ సే గుర్తుకువస్తాయి కానీ.. ఏ క్యారెక్టర్ అయినా చేయగలను అని నిరూపించాడు..యాక్షన్ సీన్స్ లో కూడా నాచురల్ గా చేశాడు...ఇక తనతో పాటుగా హీరోయిన్ మధులిక సినిమాలో బాగుంది...వీరితో పాటుగా సెకండాఫ్ లో యువ నటి భవ్యశ్రీ సాలిడ్ పెర్ఫామెన్స్ ని చూపించింది. తన రోల్ ని షేడ్స్ అన్నిటినీ ఆమె చక్కగా ఎస్టాబ్లిష్ చేసి తన రోల్ కి ప్రాణం పోసింది. ఇక తన తండ్రిగా దువ్వాసి మోహన్ కూడా తన రోల్ తో మెప్పిస్తారు.. దువ్వాసి కనపడటం కొత్తగా అనిపించింది
ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి, నిర్మాత బలగం జగదీష్ ఎక్కడా రాజీ పడకుండా ఖర్చుకి వెనకాడకుండా క్వాలిటీ సినిమాని రిచ్ గా తెరకెక్కించారు. సంగీతం సినిమాకు మరో అదనపు ఆకర్షణ, సాంగ్స్ మరియు నేపధ్య సంగీతం రెండు బాగున్నాయి, కెమెరా వర్క్ బాగుంది, ఏడిటింగ్ నీట్ గా ఉంది.
ఇక దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్ కే విషయానికి వస్తే.. తన వర్క్ పూర్తి స్థాయిలో ఆడియన్స్ ను మెప్పించిందని చెప్పాలి, తను తీసుకున్న కథ కథనాలు ప్రేక్షకులను అలరిస్తాయి, ఫస్ట్ హాఫ్ లో కొన్ని మర్డర్ సీన్స్ బాగా రాసుకున్నాడు.. సెకండ్ ఆఫ్ ప్రీ క్లైమాక్స్ ఊహించలేము ..మంచి సందేశంతో కూడిన లైన్ తో కానిస్టేబుల్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘కానిస్టేబుల్’ చిత్రంలో మెప్పించే అంశాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. రివెంజ్ పాయింట్ అందులోని ఎమోషన్ అర్ధవంతగానే అనిపిస్తుంది దాని చుట్టూ అల్లుకున్న కథనం ఇంప్రెసివ్ గా ఉంది. దీనితో ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ సినిమా కానిస్టేబుల్.
రేటింగ్: 3/5
Comments
Post a Comment