కానిస్టేబుల్ మూవీ రివ్యూ & రేటింగ్ !!!
నటీనటులు : వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, భవ్యశ్రీ, నిత్యశ్రీ, దువ్వాసి మోహన్ దర్శకుడు : ఆర్యన్ సుభాన్ ఎస్ కే నిర్మాత : బలగం జగదీష్ సంగీత దర్శకుడు : సుభాష్ ఆనంద్, గ్యాని సినిమాటోగ్రాఫర్ : షైక్ హజారా ఎడిటర్ : శ్రీవర ఈ వారం థియేటర్స్ లోకి పలు సినిమాలు వస్తే వాటిలో నటుడు వరుణ్ సందేశ్ నటించిన చిత్రం “కానిస్టేబుల్” కూడా ఒకటి. ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. కథ: మోకిలా మండలం, శంకరపల్లి అనే చిన్న గ్రామంలో ఆకస్మికంగా కొన్ని హత్యలు వరుసగా అతి దారుణంగా జరుగుతూ ఉంటాయి. ఆడ మగ అని తేడా లేకుండా జరుగుతున్న ఈ హత్యలు పోలీసులకి కూడా పెద్ద సవాలుగా మారుతాయి. అయితే ఈ ఊరి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబులే కాశీ (వరుణ్ సందేశ్). అయితే ఈ హత్యలు తన మేనకోడలు కీర్తి (నిత్యశ్రీ) వరకు కూడా వస్తాయి. ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన కాశీ ఎవరిని అయితే నిందితులు అనుకుంటారో వాళ్ళు కూడా చంపబడతారు. మరి అసలు ఈ హత్యలు చేస్తుంది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? అందుకు గల కారణం ఏంటి? చివరికి కాశీ వారిని పట్టుకున్నాడా లేదా అనేది ఇందులోని అసలు కథ. విశ్లేషణ: ఈ చిత్రంలో...