మ్యూజికల్ లవ్ స్టొరీ ''ఆవారా" నవంబర్ 22న థియేటర్స్ లో రీ రిలీజ్ !!!
ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోలతో పాటు.. చిన్న హీరోల సినిమాలు కూడా థియేటర్స్‌లో రీరిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంటున్నాయి. అలాగే కొన్ని సినిమాలు రిలీజ్ సమయంలో కంటే.. రీరిలీజ్‌లో ఎక్కువ వసూళ్లు రాబట్టి అదరహో అనిపిస్తున్నాయి. ఇలా రీరిలీజ్ సినిమాలు ఎంజాయ్ చేస్తున్నా సిని లవర్స్‌కు ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అందింది. మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ‘ఆవారా’ చిత్రం రీరిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. కార్తీ, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి ఎన్. లింగుస్వామి దర్శకత్వం వహించారు. 2010లో వచ్చిన ఈ మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అయ్యింది, సాంగ్స్ యూత్‌ను కట్టిపడేసింది. ఇప్పటికీ ఈ సాంగ్స్ వినపడుతూనే ఉంటాయి. బాక్సాఫీస్ వద్ద మ్యూజికల్ హిట్‌గా నిలిచింది ఆవారా. ఈ చిత్రం ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘ది ఎవర్ రిఫ్రెషింగ్ లవ్ స్టోరీ ఆవారా నవంబర్ 22న తిరిగి విడుదలవుతోంది.. మ్యూజికల్ హిట్‌ను మరోసారి ఎంజాయ్ చేయండి’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.