Posts

Showing posts from August, 2025

"ఉఫ్ఫ్ యే సియాపా" చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 5న థియేటర్స్ లో విడుదల !!!

Image
దశాబ్దాల తరువాత మరో సంభాషణ రహిత చిత్రం "ఉఫ్ఫ్ యే సియాపా" సెప్టెంబర్ 5న థియేటర్స్ లో విడుదల !!! ఉఫ్ఫ్ యే సియాపా: బాలీవుడ్ కథా కథనాన్ని ఒక కొత్త పంథా తో చెప్పబోతున్న బోల్డ్ సైలెంట్ కామెడీ. 40 సంవత్సరాల తర్వాత తిరిగి కమల్ హాసన్ నటించిన పుష్పక విమానం వలె, డైలాగులేని, నిజం చెప్పాలంటే డైలాగ్ అవసరపడని సినిమా. నాలుగైదు జనరేషన్స్ మిస్సయిన ఒక అద్భుతం. భారతీయ సినిమా ప్రయోగాలకు కొత్తేమీ కాదు, కానీ ప్రధాన స్రవంతి సినిమా కు, సంభాషణలకు ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందే. అలాంటి సినిమా నుండి సంభాషణలు లేకుండా  ధైర్యం చేయడం చాలా అరుదు. జి. అశోక్ దర్శకత్వం వహించి లవ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై లవ్ రంజన్ మరియు అంకుర్ గార్గ్ నిర్మించిన ఉఫ్ఫ్ యే సియాపా నియమాలను తిరిగి రాస్తోంది. సెప్టెంబర్ 5, 2025న విడుదల కానున్న ఈ డార్క్ కామెడీ-థ్రిల్లర్  డైలాగ్‌ లేకుండా ఒక కథని చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. పూర్తిగా  హావభావాలతో, పర్ఫామెన్స్ ని ఆధారంగా తీసుకొని హాస్యంతో కూడుకున్న దృశ్య మాలికకు ఇండియా గర్వకారణమైన ఆస్కార్ విన్నర్ ఎ. ఆర్. రెహమాన్ యొక్క ఉత్తేజకరమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడం ఇంకా విశే...

దుల్కర్ సల్మాన్ 'వేఫేరర్ ఫిలిమ్స్' సాహసోపేతమైన అడుగు.. భారతీయ సినిమాలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన 'కొత్త లోక'

Image
ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన 'కొత్త లోక 1: చంద్ర' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. వేఫేరర్ పతాకంపై నిర్మించిన ఏడవ చిత్రం ఇది. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడిన ఈ మలయాళ చిత్రం కేరళ సరిహద్దులను దాటి విస్తృత ప్రశంసలు అందుకుంటోంది. చిత్రానికి మాత్రమే కాకుండా దుల్కర్ సల్మాన్ మరియు వేఫేరర్ ఫిలిమ్స్ వారి దార్శనికతకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. మలయాళ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా అత్యంత భారీస్థాయిలో, భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రాన్ని, ఇంత సాంకేతిక పరిపూర్ణతతో నిర్మించడం ద్వారా దుల్కర్ సల్మాన్ అసాధారణమైన అడుగు ముందుకు వేశారు. దీనిని ఓ మలయాళ నిర్మాత తీసుకున్న అత్యంత సాహసోపేతమైన మరియు దూరదృష్టితో కూడిన నిర్ణయాలలో ఒకటిగా వర్ణించవచ్చు. దీనితో ఒక కొత్త సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ ప్రారంభమైంది. మలయాళ సినిమా స్థాయిని పెంచడానికి, సరిహద్దులను దాటి విస్తరించేందుకు వేఫేరర్ ఫిలిమ్స్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. గతంలో మలయాళ ప్రేక్షకులకు అద్భుతమైన చిత్రాలను అంద...

ప్రముఖ నటుడు పృద్వి రాజ్ చేతుల మీదుగా క్రైమ్ థ్రిల్లర్ "బ్లడ్ రోజస్" మూవీ మోషన్ పోస్టర్ విడుదల !!!

Image
టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో కె,నాగన్న మరియు కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను ప్రముఖ నటుడు పృద్వి రాజ్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "బ్లడ్ రోజస్ సినిమా లో ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి చక్కగా నటించారు, శ్రీలు, క్రాంతి కిల్లి ఇపాటెన్స్ రోల్స్ లో కలిపించబోతున్నారు. మోషన్ పోస్టర్ చాలా బాగుంది, ఈ సినిమా విజయం సాధించి డైరెక్టర్ ఎంజిఆర్ గారికి అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్ గారికి, కో ప్రొడ్యూసర్ ఎల్లప్ప గారికి నిర్మాత హరీష్ కె గారికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను" అన్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో శ్రీలు, క్రాంతి కిల్లి నటించగా,సుమన్, ఘర్షణ శ్రీనివాస్, టార్జన్, రాజేంద్ర, జూనియర్ రేలంగీ, జగదీశ్వరి, మణి కుమార్ , ధ్రువ, అనిల్, నరేంద్ర , ప్రగ్యా, న...

‘గ్రాండ్ పేరెంట్స్ డే’ని ముందుగానే సెలెబ్రేట్ చేసేందుకు గ్రాండ్ పేరెంట్స్‌‌కి చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్న ‘త్రిబాణధారి బార్బరిక్’ టీం

Image
కొత్త కాన్సెప్ట్, కంటెంటె బేస్డ్ చిత్రాలు వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. చిన్న సినిమానా? పెద్ద సినిమా? స్టార్ హీరోలు ఉన్నారా?అన్నది కాకుండా కంటెంట్ ఉందా? అని చూస్తున్న తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ రోజు ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం వచ్చింది. గత కొన్ని రోజులుగా పెయిడ్ ప్రీమియర్లతో జనాల్లోకి వెళ్లిన ఈ మూవీ ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ సినిమాకు మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ మౌత్ టాక్‌ వచ్చేసింది.  స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల ఈ మూవీని నిర్మించారు. మోహన్ శ్రీ వత్స ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో సత్య రాజ్, ఉదయభాను, వశిష్ట సింహా, క్రాంతి కిరణ్, సత్యం రాజేష్, సాంచీ రాయ్, మేఘన, కార్తికేయ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రంలో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎమోషన్స్ ఉన్నా కూడా ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతోంది. ఆడపిల్ల ఉండే ప్రతీ ఫ్యామిలీ చూడదగ్గ చిత్రమే ‘త్రిబాణధారి బార్బరిక్’.  ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రానికి ఎక్కువగా మహిళా ప్రేక్షకులు, ఫ్యామిలీ ...

కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా విశాల్, సాయి ధన్సికల నిశ్చితార్థo

Image
విశాల్, సాయి ధన్సిక నిశ్చితార్థం ఆగస్ట్ 29న ఘనంగా జరిగింది. విశాల్, ధన్సిక ప్రేమ, పెళ్లి గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. విశాల్, ధన్సిక ఇద్దరూ కూడా స్టేజ్ మీదే తమ ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాల్ని ప్రకటించారు. ముందు చెప్పినట్టుగానే ఆగస్ట్ 29న ఈ ఇద్దరి పెళ్లికి అడుగులు పడ్డాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో విశాల్, సాయి ధన్సికల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ మేరకు ఎంగేజ్మెంట్ ఫోటోల్ని విశాల్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో నేడు మా ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.. అందరి ఆశీర్వాదం మాకు కావాలి అంటూ సోషల్ మీడియాలో విశాల్ తాజాగా వేసిన ట్వీట్, షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. విశాల్ ప్రస్తుతం ‘మకుటం’ అనే మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. విశాల్ కెరీర్‌లో 35వ చిత్రంగా రానున్న ఈ మూవీని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి నిర్మిస్తున్నారు. ‘మకుటం’ మూవీకి రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. సీ బ్యాక్ డ్రాప్, మాఫియా కథతో విశాల్ సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘మకుటం’ రూపొందుతోందని సమాచారం. ఇక త్వరలోనే పెళ్లికి సంబంధించిన ఇతర వివరాల్ని వ...

విశాల్ ‘మకుటం’ నుంచి అదిరిపోయే పోస్టర్ విడుదల

Image
వెర్సటైల్ హీరో విశాల్ ప్రస్తుతం ‘మకుటం’ అంటూ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. విశాల్ 35వ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ ‘మకుటం’ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. చూస్తుంటే ఈ మూవీని సముద్రం బ్యాక్ డ్రాప్ మాఫియా కథ అని అర్థం అవుతోంది. ఇక ఈ మూవీలో విశాల్‌ సరసన అంజలి, దుషార విజయన్ నటిస్తున్నారు. తాజాగా ‘మకుటం’ నుంచి అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే విశాల్ ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ లుక్స్, షేడ్స్‌లో కనిపించబోతోన్నారని అర్థం అవుతోంది. విశాల్ యంగ్ లుక్, మిడిల్ ఏజ్ లుక్, ఓల్డేజ్ లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నారు.  ‘మకుటం’ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.  ప్రస్తుతం ఈ మూవీ షూటి...

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా డిసెంబర్ 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న "తొలి కిరణం" మూవీ

Image
పీడీ రాజు, అభినయ, సాయి కిరణ్, భానుచందర్, సుమన్,సురేఖా వాణి  కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "తొలి కిరణం". ఈ చిత్రాన్ని ఏవీఎం ఆర్ట్స్ బ్యానర్ పై మేరీ విజయ సమర్పణలో జె. జాన్ బాబు నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. హార్ట్ టచింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో, హై క్వాలిటీ టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కిన  "తొలి కిరణం" మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని  డిసెంబర్ 14న కిస్మస్ పర్వదినం సందర్భంగా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. "తొలి కిరణం" సినిమా ప్రేక్షకులకు ది బెస్ట్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వనుందని రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత జె. జాన్ బాబు తెలిపారు. *దర్శక, నిర్మాత జె. జాన్ బాబు మాట్లాడుతూ -* మా "తొలి కిరణం" సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాను క్రిస్మస్ పర్వదినం సందర్భంగా డిసెంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో అన్ని దేశాల్లో విడుదల చేయబోతున్నాం. హై క్వాలిటీ టెక్నికల్ వ్యాల్యూస్ తో ఈ రోజు వరల్డ్ సినిమాతో పోటీ పడే విధంగా "తొలి కిరణం" చ...

‘త్రిబాణధారి బార్బరిక్’ సెన్సార్ పూర్తి.. ఆగస్ట్ 29న గ్రాండ్ రిలీజ్

Image
సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన ఈ ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఆగస్ట్ 29న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అందరిలోనూ అంచనాలు పెంచేశాయి.  ఇప్పటికే ‘త్రిబాణధారి బార్బరిక్’ ప్రివ్యూల్ని వరంగల్, విజయవాడ వంటి చోట ప్రదర్శించగా మంచి స్పందన వచ్చింది. ఈ స్పెషల్ షో తరువాత చిత్రంపై మరింత హైప్ ఏర్పడింది. ఈ మూవీ రిలీజ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు తాజాగా జరిగాయి. ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. కంటెంట్‌తో పాటుగా, మంచి సందేశాన్ని ఇచ్చేలా ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీని తెరకెక్కించారని టీంపై ప్రశంసలు కురిపించారు. డిఫరెంట్ ప్రమోషన్స్‌ చేస్తూ ఇప్పటికే ఆడియెన్స్‌లో బజ్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే....

కర్మణ్యే వాధికారస్తే చిత్రం సెప్టెంబర్ 19 న విడుదల

Image
ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై బ్రహ్మాజీ, శత్రు, 'మాస్టర్' మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కర్మణ్యే వాధికారస్తే. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, మరియు శ్రీ సుధా ముఖ్య పాత్రల్లో నటించారు. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఇటీవలే మధుర ఆడియో ద్వారా విడుదల అయినా చిత్ర ట్రైలర్ సోషల్ మీడియా లో ట్రేండింగ్ అయింది. ఇప్పుడు ఈ చిత్రం  సెప్టెంబర్ 19 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ "'కర్మణ్యే వాధికారస్తే' అనేది భగవద్గీత లోని ఒక పదం. దాని అర్థం "పని చేసే హక్కు నీకుంది, ఫలితాల మీద కాదు". టైటిల్ కి అనుగుణంగా కథ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. కథ కి సరి సాటిగా బ్రహ్మాజీ, శత్రు మరియు  'మాస్టర్' మహేంద్రన్ వారి నటన తో చిత్రానికి మరింత ప్రాణం పోశారు.  ఇది ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్,  స్టూడెంట్ హత్యలు, మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ ఇలా మనం ప్రతిరోజూ టీవిలో పేపర్స్ లో చూసే సంఘటనల ఆధారంగా నిర్మించాం. ఇటీవలే ట్రైలర్ విడుదలై సోషల్ మీడియా లో ట్...

వినాయక చవితి సందర్భంగా విశాల్ ‘మకుటం’ నుంచి అదిరిపోయే పోస్టర్ విడుదల

Image
వెర్సటైల్ హీరో విశాల్ ప్రస్తుతం ‘మకుటం’ అంటూ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. విశాల్ 35వ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ ‘మకుటం’ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. చూస్తుంటే ఈ మూవీని సముద్రం బ్యాక్ డ్రాప్ మాఫియా కథ అని అర్థం అవుతోంది. ఇక ఈ మూవీలో విశాల్‌ సరసన అంజలి, దుషార విజయన్ నటిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ‘మకుటం’ నుంచి అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే విశాల్ ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ లుక్స్, షేడ్స్‌లో కనిపించబోతోన్నారని అర్థం అవుతోంది. విశాల్ యంగ్ లుక్, మిడిల్ ఏజ్ లుక్, ఓల్డేజ్ లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నారు.  ‘మకుటం’ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.  ప్రస్...

వినాయక చవితి సందర్భంగా ‘సుమతీ శతకం’ నుంచి స్పెషల్ పోస్టర్

Image
అమర్ దీప్ చౌదరి, సయాలీ జంటగా విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘సుమతీ శతకం’. ఈ మూవీకి ఎం. ఎం. నాయుడు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్ ప్రత్యేక పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్‌తో ‘సుమతీ శతకం’ ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. హీరో హీరోయిన్ కారెక్టర్స్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వినాయక చవితి సందర్భంగా మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో హీరో హీరోయిన్లను చూస్తుంటే ఏదో ఫన్నీ, క్యూట్, ఫ్యామిలీ, లవ్ స్టోరీగా ఈ చిత్రం రాబోతోందని అర్థం అవుతోంది. ‘సుమతీ శతకం’ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నారు. నహిద్ ముహమ్మద్ ఎడిటర్‌గా, హాలేష్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి కథను బండారు నాయుడు అందించారు.

సూరి హీరోగా న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మామ‌న్‌’.. ఆగ‌స్ట్ 27 నుంచి జీ5 తెలుగు, క‌న్న‌డ‌ల్లో స్ట్రీమింగ్‌

Image
- ఆగ‌స్ట్ 8న త‌మిళంలో స్ట్రీమింగ్.. 27 నుంచి తెలుగు, క‌న్న‌డ‌ల్లో స్ట్రీమింగ్ భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT ప్లాట్‌ఫారమ్ అయిన ZEE 5 2025లో మరో సూపర్‌హిట్ ప్రీమియర్‌తో ఆడియెన్స్‌ని ఎప్ప‌టిక‌ప్పుడు అల‌రిస్తూనే ఉంది. తాజాగా మ‌రో విజ‌య‌వంత‌మైన చిత్రం ‘మామ‌న్‌’ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తోంది. ఆగ‌స్ట్ 8న త‌మిళంలో ZEE 5 ప్రేక్ష‌కుల‌కు అందిస్తోంది. ఇప్పుడీ చిత్రం తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఆగ‌స్ట్ 27 నుంచి ZEE 5లో స్ట్రీమింగ్ కానుంది. భావోద్వేగాలు క‌ల‌గ‌లిసిన కుటుంబ క‌థా చిత్రంగా ప్రేక్ష‌కులను అల‌రించిన ఈ చిత్రం ఇప్పుడు ZEE 5లో స్ట్రీమింగ్ కానుండ‌టంతో మ‌రింత మంది ప్రేక్ష‌కుల‌కు రీచ్ అవుతుంది.  ▶️https://zee5.onelink.me/RlQq/57z8ki1i ఇన్‌బా(సూరి) చెల్లెలు గిరిజ (శ్వాసిక‌)క‌కు పెళ్లై ప‌దేళ్లైనా పిల్ల‌లు పుట్టారు. గిరిజ మొక్క‌ని దేవుడు లేడు. చివ‌ర‌కు ఆమె ఓ బాబుకి జ‌న్మ‌నిస్తుంది. లేక లేక పుట్టిన మేన‌ల్లుడు నిల‌న్ (ప్ర‌గీత్ శివ‌న్‌) అంటే ఇన్‌బాకు అమిత‌మైన ప్రేమ‌. త‌న‌ను ప్రేమ‌గా ల‌డ్డు అని పిలుచుకుంటుంటాడు. ఇన్‌బా, రేఖ‌ను పెళ్లి చేసుకుంటాడు. ల‌డ్డుకి మామ అంటే ఉండే ప్రేమ‌తో అత‌నితోన...

Blood - Valour - History: Here’s The Roaring First Look Poster of Tamil-Telugu Historical Action Drama, “Draupathi 2”

Image
Following the super success of the 2020 Tamil film *“Draupathi”*, popular actor Richard Rishi is returning with the sequel, *“Draupathi 2”*. This much-anticipated historical action drama is currently in production, mounted on a grand scale by Netaji Productions, in association with Chola Chakravarthy, and produced by G. M Film Corporation. The film is directed by Mohan G., known for films such as Pazhaya Vannarapettai, Draupathi, Rudra Thandavam, and Bagasuran. On the auspicious occasion of Sri Vinayaka Chavithi, the makers have unveiled the first look poster today, raising expectations for the film’s grand theatrical release later this year in both Tamil and Telugu. Set in the 14th century, the film explores the blood-stained history of Hoysala emperor Veera Vallalar III, who ruled South India with Thiruvannamalai as his capital, along with the bravery of the Kadavarayas of Sendhamangalam. The story unfolds against the backdrop of the Mughal invasion of Tamil Nadu. Around ...

వినాయక చవితి శుభపర్వదినం సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తిస్తున్న “ధర్మవరం” సినిమా పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి గారు ఘనంగా ఆవిష్కరించారు.

Image
ఈ చిత్రంలో రాజ్ వేంకటాచ్ఛ హీరోగా నటించడంతో పాటు కథ, చిత్రకథ, దర్శకత్వం వహించి, ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కథానాయకుడిగా తన అద్భుతమైన నటనతో పాటు దర్శకుడిగా తన ప్రత్యేకమైన ముద్రను వేసేందుకు రాజ్ వేంకటాచ్ఛ ప్రయత్నిస్తున్నారు. ప్రధాన పాత్రల్లో అజయ్, నవీన్ రెడ్డి, సంయోగీత, ఏశాన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. గ్రామీణ సాంప్రదాయాలు, సాంస్కృతిక విలువలు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో నిండిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను అలరించనుందనే నమ్మకాన్ని యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ వేంకటాచ్ఛ మాట్లాడుతూ – “ధర్మవరం సినిమా నాకు ఎంతో ప్రాణమైన ప్రాజెక్ట్‌. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకునేలా ఉండేలా కష్టపడ్డాం. వినాయక చవితి పర్వదినం సందర్భంగా పోస్టర్ విడుదల కావడం మాకు ఒక శుభసూచకం. ప్రేక్షకుల ఆశీర్వాదాలు మాకుంటే ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది” అని తెలిపారు. అనిల్ రావిపూడి గారు మాట్లాడుతూ – “ధర్మవరం పోస్టర్ చాలా బాగుంది. కొత్త ప్రయత్నం కనబడుతోంది. రాజ్ వేంకటాచ్ఛ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని న...

"బ్రహ్మాండ" చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్...మొట్ట మొదటిసారి గా ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన సినిమా

Image
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆధ్యత్మిక కథలకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఒకవైపు పెద్ద సినిమాలు ఎలా అయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తున్నాయో, మరోవైపు చిన్న సినిమాలు చాలామంది హృదయాలను తాకుతున్నాయి. ఇక ప్రస్తుతం రాబోతున్న సినిమాలలో బ్రహ్మాండ సినిమా ఒకటి. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతుంది.  ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సినిమాలో నటి ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నటి ఆమని మాట్లాడుతూ.. బ్రహ్మాండ మూవీ తెలుగు ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతి అనుభూతిని ఇస్తుంది అని తెలిపారు. అలానే ఈ సినిమా గురించి మరిన్ని విషయాలను చెప్పారు నటి ఆమని. ఇంత మంచి సినిమా సినిమా డైరెక్ట్ చేసిన రాంబాబు గారు మన మధ్య లేకపోవడం బాధకారం. హీరో బన్నీ రాజు మాట్లాడుతూ..  ఈ సినిమాలో నాది అద్భుతమైన పాత్ర. సినిమా నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది. ఈ సినిమాను శుక్రవారం రిలీజ్ చేయబోతున్నాం. అందరూ చూసి ఆదరించండి. ముఖ్యంగా క్లైమాక్స్ ని మిస్ చేయకండి. అద్భుతమైన అనుభూతిని పొందుతారు.     నిర్మాత దాసరి సురేష్ మాట్లాడుతూ... నిర్మాత దాసరి సురేష్ మాట్లాడుతూ స్క్రిప్ట్ ...

ఘనంగా "మిస్టర్ రాము" మూవీ ఆడియో రిలీజ్ ఈవెంట్

Image
బొంత రాము హీరోగా నటిస్తున్న సినిమా "మిస్టర్ రాము". ఈ చిత్రంలో అజయ్ ఘోష్ విలన్ గా నటిస్తున్నారు. జబర్దస్త్ అప్పారావు మరో కీ రోల్ పోషించారు. ఈ చిత్రాన్ని రేణుక దేవి ఫిలింస్ బ్యానర్ పై బొంత రాము నిర్మించారు. అజయ్ కౌండిన్య దర్శకత్వం వహించారు. త్వరలో "మిస్టర్ రాము" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ - మిస్టర్ రాము సినిమా ఆడియో ఫంక్షన్ కు వచ్చిన మీ అందరికీ థాంక్స్. ఆడియో రిలీజ్ ఈవెంట్ కి ఇంతమంది వచ్చారంటే మీరంతా సినిమాను తప్పకుండా సక్సెస్ చేస్తారని తెలుస్తోంది. డైరెక్టర్ అజయ్ కౌండిన్య నాకు బాగా పరిచయం. ఈ చిత్రంలో మంచి రోల్ చేసే అవకాశం ఇచ్చారు. మిస్టర్ రాము చిత్రంలో అజయ్ ఘోష్ గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించారు. ఈ సినిమాకు హృదయ్ ముగ్దల్ సూపర్ హిట్ మ్యూజిక్ అందించారు. చరణ్ కెమెరా పనితనం కూడా హైలైట్ అవుతుంది. మిస్టర్ రాము చిత్రాన్ని మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు. ప్రొడ్యూసర్, హీరో బొంత రాము మాట్లాడుతూ - నాకు ...

‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను.. ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

Image
రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్‌నెస్ ది రియ‌ల్ క్రైమ్‌’ ట్యాగ్ లైన్‌. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మాతలుగా రానున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను సీనియ‌ర్ నిర్మాత కె.ఎస్‌.రామారావు ఇటీవలె విడుదల చేయడం, సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఇక మంగళవారం నాడు (ఆగస్ట్ 26) ‘మటన్ సూప్’ నుంచి ‘హర హర శంకర’ సాంగ్‌ను ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి గారు విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ..  *ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ* .. ‘ఆ విఘ్నేశ్వరుడి దయతో ఏ విఘ్నాలు లేకుండా ‘మటన్ సూప్’చిత్రం పెద్ద విజయం సాధించాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలోకి కొత్త రక్తం వస్తోంది. నలభై ఏళ్లుగా ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. ఓ సినిమా తీయాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుందో నాకు తెలుసు. ఈ మూవీ తీసిన వారి, చూసిన వారి జీవితాలు మారిపోవాలి. ‘హర హర శంకర’ పా...

ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆరోగ్య డైట్ ఫౌండర్ పూడి మహాలక్ష్మయ్య (లక్ష్మణ్ )

Image
ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆరోగ్య డైట్ ఫౌండర్ పూడి డి మహాలక్ష్మయ్య (లక్ష్మణ్). కరోనా టైమ్ లో ఈ వైరస్ వ్యాప్తి, జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా పాటలు రాసి కంపోజ్ చేసి మంచి గుర్తింపు పొందారు. మహాలక్ష్మయ్య. తాజాగా ఆయన ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. ఈ సంస్థ భారత ప్రతినిధి బింగి నరేందర్ గౌడ్ ప్రెస్ మీట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య డైట్ ఫౌండర్ మహాలక్ష్మయ్య, డాక్టర్ వెంకటకృష్ణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా ప్రతినిధి బింగి నరేందర్ గౌడ్ మాట్లాడుతూ - ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 170 దేశాల్లో  ఏటా జనవరిలో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తుంటుంది. 2010లో స్థాపించిన ఈ సంస్థ ద్వారా మన దేశంలో ఎంతోమంది ప్రముఖులకు అవార్డ్స్ అందించాం. మాకు ఇండియాలో 64 బ్రాంచెస్ ఉన్నాయి. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, ఎస్పీ బాలు, దాసరి నారాయణరావు...ఇలా ఎంతోమంది ప్రముఖులకు మా సంస్థ అవార్డ్స్ ఇచ్చాం. ఇప్పుడీ ఘనత మన తెలుగు...

Actress Malavika Mohanan Wins Shakti Award at We Women Want Conclave

Image
Beautiful and talented actress Malavika Mohanan has added another feather to her cap. She received the prestigious Shakti Award at the We Women Want Conclave 2025 held in New Delhi. Malavika bagged the award in the category of Excellence in Style. She was felicitated with the honor by Congress leader Shashi Tharoor. Sharing her happiness on social media, Malavika expressed that receiving the Shakti Award is truly an honor for her. On the work front, Malavika Mohanan is currently acting alongside Prabhas in the film Raja Saab. With this project, she is making a grand entry into Tollywood. The recently released teaser of Raja Saab showcased Malavika in stunning looks, leaving audiences impressed. This film is expected to bring her closer to Telugu audiences.

The hype Is Real..Unparalleled Response! HariHaraVeeraMallu - Trending No. 1 on Amazon Prime

Image
  Prime Video, India’s most-loved entertainment destination, today announced the exclusive worldwide streaming premiere of the much-anticipated Telugu period adventure film, ‘Hari Hara Veera Mallu: Part 1 – Sword vs Spirit’, starting today.   The film, directed by Jyothi Krishna, features a stirring score by Academy Award-winning composer ‘M.M. Keeravaani’. ‘Pawan Kalyan’ stars in a powerful lead role, marking his much-awaited return to the big screen. The movie also includes a stellar cast of actors like, Bobby Deol, Nidhhi Agerwal, Sathyaraj, Nassar, Sunil, Subbaraju, Ayyappa Sharma, Raghu Babu and Dalip Tahil in key roles. It is creating a wave in the other languages, including Hindi and Tamil with mass penetration on Amazon prime.   Set in a fictionalized Mughal-era India, the film follows the brave journey of ‘Veera Mallu’, a rebel who is tasked with a dangerous mission: to steal the legendary Koh-i-Noor diamond from Emperor Aurangzeb’s fort. The story is...

బ్రిలియంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ "నేను రెడీ" నుంచి రిలీజ్ చేసిన హీరోయిన్ కావ్య థాపర్ బర్త్ డే పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్

Image
నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్, సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా, మజాక వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథరావు కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ "నేను రెడీ". ఈ చిత్రాన్ని హార్నిక్స్ ఇండియా ఎల్ ఎల్ పి బ్యానర్ పై  నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది.  బ్రిలియంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న "నేను రెడీ" మూవీ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన హీరోయిన్ కావ్య థాపర్ బర్త్ డే పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో ఆమె క్యారెక్టర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. "నేను రెడీ" మూవీ తన కెరీర్ లో ది బెస్ట్ గా నిలుస్తుందని ఆశిస్తోంది కావ్య థాపర్. ప్రస్తుతం "నేను రెడీ" సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీకి మంచి ఔట్ పుట్ వస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన "నేను రెడీ" టైటిల్ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో మరింత కాన్ఫిడెంట్ గా చిత్రీకరణ జరుపుతున్నారు మూవీ టీమ్.  నటీనటు...

(IMY )ఐఎంవై తెలుగు టైటిల్ ఛాలెంజ్: టైటిల్ చెప్పండి, లక్ష పట్టుకెళ్లండి..!

Image
 సినిమా ప్రమోషన్లలో కొత్త ట్రెండ్ మొదలైంది. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న 'ఐఎంవై' (IMY) చిత్రం తమ టైటిల్ కోసం ప్రేక్షకులకు ఓ భారీ ఛాలెంజ్ విసిరింది. 'ఐఎంవై' (IMY) అంటే ఏంటో తెలుగులో టైటిల్ చెప్పగలిగితే, ఏకంగా లక్ష రూపాయల బహుమతి గెలుచుకోవచ్చని ప్రకటించింది. ఆర్‌.పి. పట్నాయక్ రీ-ఎంట్రీతో జోష్..    చాలా కాలంగా సంగీతానికి దూరంగా ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌.పి. పట్నాయక్ ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇవ్వడం విశేషం. దర్శకుడు త్రినాథ్ కఠారి చెప్పిన కథ నచ్చడంతోనే ఆయన ఈ చిత్రానికి సంగీతం అందించడానికి అంగీకరించారు. ఇప్పటికే విడుదలైన 'గం గణపతయే నమహా' పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాట విన్న చాలామంది ఆర్‌.పి. పట్నాయక్ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చారని ప్రశంసిస్తున్నారు. ఆర్‌.పి. పట్నాయక్ మరియు అనురాగ్ కులకర్ణి కలసి ఒక సూపర్ హిట్ సాంగ్ చేయాలని  ఎప్పడి నుండో అనుకున్నారు గానీ ఎందుకో కుదరలేదు... ఆ కల ఈ పాట రూపంలో నెరవేరడంతోపాటు హిట్ కొట్టడం ఖాయం అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.    ఛాలెంజ్ ఏమిటంటే..?    'ఐఎంవై'( IMY) అనే అక్షరాలకు సరిపోయే తెలుగు టైటిల్‌...

ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ నిర్మిస్తున్న "హైవాన్" మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Image
అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ హైవాన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సరికొత్త థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు కోచిలో ప్రారంభమైంది. ఊటీ, ముంబైలలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోనుంది.  హైవాన్ మూవీతో అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ 17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో నటించడం ఎగ్జైటింగ్ గా ఉందని సోషల్ మీడియా ద్వారా అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ తెలిపారు. హైవాన్ చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు నిర్మాతలు వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్. *నటీనటులు* - అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్, తదితరులు *టెక్నికల్ టీమ్* --------------------------------- పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్) బ్యానర్స్ - కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ నిర్మాతలు - వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్ రచన, దర్శకత్వం - ప్రియదర్శన్

ప‌వ‌న్ కేస‌రి, కావ్యా క‌ళ్యాణ్ రామ్ జంటగా టి.డి.ఆర్ సినిమాస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్.1 గా తలారి దినకరణ్ రెడ్డి నిర్మిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

Image
టి.డి.ఆర్ సినిమాస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్.1 గా కుంచం శంకర్ దర్శకత్వంలో తలారి దినకరణ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు గురువారం (ఆగస్ట్ 21) నాడు ఘనంగా జరిగాయి. ముహుర్త‌పు స‌న్నివేశానికి రామ్ అబ్బ‌రాజు క్లాప్ నివ్వ‌గా, ప్ర‌శాంత్ కుమార్ దిమ్మెల కెమెరా స్విచాన్ చేసి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రామ్ అబ్బ‌రాజు, ప్ర‌శాంత్ దిమ్మెల‌, అడిదాల విజ‌య్‌పాల్ రెడ్డి స్క్రిప్ట్ అందించారు. ప‌వ‌న్ కేస‌రి, కావ్యా క‌ళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించనుండగా..  కెమెరామెన్‌గా సాయి పని చేయనున్నారు. ఇక ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా...  * హీరో పవన్ కేసరి మాట్లాడుతూ* .. ‘నా బాల్య స్నేహితుడు సన్నీ స్థాపించిన ఈ బ్యానర్ మీద సినిమాను చేస్తుండటం ఆనందంగా ఉంది. కావ్య ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. విజయ్ అన్న మంచి సంగీతాన్ని ఇవ్వబోతోన్నారు. డీఓపీ సాయితో మంచి బాండింగ్ ఏర్పడింది.  * హీరోయిన్ కావ్యా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ* .. ‘టి.డి.ఆర్ సినిమాస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్.1 చిత్రంలో నేను హీరోయిన్‌గా నటిస్తున్నాను...

సినిమా రైట్స్ దోపిడీ.. నిర్మాతల ఆవేదన

Image
▪️ *“ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు” సినిమాపై ₹2 కోట్ల పెట్టుబడి* ▪️ *విశ్వాస ఘాతుకం చేసిన రామకృష్ణ తోటపై కేసులు: నిర్మాతలు* ▪️ *న్యాయం జరిగే వరకు పోరాడుతాం: నిర్మాతలు* హైదరాబాద్: "ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు" సినిమా నిర్మాణంలో నిర్మాతలు కే. మురళి (శరత్ వర్మ), బి. ఆనందబాబు త‌మ‌పై పెద్ద మోసం జరిగిందని మీడియా ముందుకు వచ్చారు. "సినిమా కోసం మేము రూ.2 కోట్లు పెట్టుబడిగా పెట్టాం. మొత్తం ఖర్చు మేమే భరించాం. తిరిగి ఇవ్వలేకపోవడంతో సంబంధిత వ్యక్తి 2024 సెప్టెంబర్ 12న మా పేర్లపైకి సినిమా రైట్స్, కాపీరైట్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అన్నీ ఇష్ట‌పూర్వ‌కంగా ఇచ్చాడు. ప్రస్తుతం సినిమా రిలీజ్ పనులు కొనసాగుతున్నాయి. కానీ సహకరించాల్సిన రామకృష్ణ తోట మాపై విశ్వాస ఘాతుకం చేశాడు. సినిమా తనదేనని ప్రకటించి, అనుమతి లేకుండా టైటిల్, పోస్టర్లను పత్రికల్లో ప్రచురించాడు. ఇది మా హక్కులపై దాడి, మోసం. ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా ప్రతిష్ట కూడా దెబ్బతిన్నది" అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. "రామకృష్ణ తోటపై IPC 406, 420 (మోసం, విశ్వాస ఘాతుకం) సెక్షన్ల కింద, అలాగే కాపీరైట్ చట్టం 1957 ప్రకార...

ఆగస్టు 22 న రిలీజ్ అవుతున్న ఆర్ నారాయణ మూర్తి యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమాలో అద్భుతమైన ఎమోషన్స్ వున్నాయి…ప్రముఖ హాస్య నటులు పద్మశ్రీ బ్రహ్మానందం

Image
హాయిగా తలరా స్నానంచేసి  నేత చీర కట్టుకున్న  స్రీ లా ఉన్న సినిమా యూనివర్సిటీ పేపర్ లీకేజ్…  అందరు చూడాల్సిన సినిమా…ప్రముఖ హాస్య నటులు పద్మశ్రీ బ్రహ్మానందం- ప్రముఖ హాస్యనటులు పద్మశ్రీ బ్రహ్మానందం గారు మాట్లాడుతూ: యూనివర్శిటీ అంటే ఏమిటి యూనివర్స్ అంటే విశ్వం . అంటే అన్ని గోళాల తోటి ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి  భూమి లాంటి గ్రహమే కాకుండా విశ్వాంతరాళాలలోని గ్రహాలన్నింటికీ సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్పేటటువంటిది ఆలయం. అదే విశ్వవిద్యాలయం అదే యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీ ఇపుడు ఎటువంటి విశ్వవిద్యాలయాలు అయ్యాయి అని చెప్పడానికి ఎంతో ఎంతో కృషి చేసి అందులో  రీసెర్చ్ చేసి అందులో జరుగుతున్నటివంటి అవనీతిని… అప్పట్లో విశ్వవిద్యాలయాలు అంటే కాశీ విద్యాలయం అని పెద్ద పేరు బెనారస్ యూనివర్సిటీ. ఎక్కడెక్కడి నుంచో అన్ని దేశాల నుంచి మనదేశం వచ్చి చదువుకొనివెళ్లిపోయేవారు. అంటే అంత జ్ఞాన సంపద ఉన్న దేశం మనది. ఈవాళ మన దేశం మన ఎడ్యుకేషనల్ స్థితి ఎలా వుంది విద్య వ్యవస్థలు ఎలా మరిపోతున్నాయి అని వాటి మీద అధ్యయనం చేసిన తమ్ముడు నారాయణమూర్తి అవన్నీ తట్టుకోలేక అంటే బ్రీత్ తీ...

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ఫ్రెండ్లీ ఘోస్ట్ ఫస్ట్ లుక్ విడుదల !!!

Image
సుచిన్ సినిమాస్ లిమిటెడ్ బ్యానర్ పై మాస్టర్ జియాన్స్ సమర్పణలో సత్యం రాజేష్ , రియా సచ్యదేవ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం ఫ్రెండ్లీ ఘోస్ట్. సస్పెన్స్ తో పాటు కామిడికి పెద్ద పీట వేస్తూ దర్శకుడు జి.మధు సూధన్ రెడ్డి ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో మంచు మనోజ్ విడుదల చేశారు, ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ... "మంచి కాన్సెప్ట్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఫ్రెండ్లి ఘోస్ట్ సినిమా త్వరలో థియేటర్స్ లో రాబోతోంది. ఈ సినిమా విజయం సాధించి హీరో రాజేష్ కు నిర్మాత విశ్వనాథ్ గారికి, డైరెక్టర్ జి.మధు సూధన్ రెడ్డి గారికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా" అన్నారు భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, వెన్నెల కిషోర్, మధు నందన్, చమ్మక్ చంద్ర, 30 ఇయర్స్ పృథ్వి తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి సాంగ్స్, టీజర్, ట్రైలర్ త్వరలో రాబోతున్నాయి. ఆడియన్స్ కు తప్పకుండా ఫ్రెండ్లీ ఘోస్ట్ సినిమాను ఆదరిస్తారని నమ్మకం ఉందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. నటీనటులు: సత్యం రాజ...

లేత గులాబీ టైటిల్ లాంచ్

Image
 79 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శతాధిక చిత్రాల హీరో సుమన్ గారు మరియు శతాధిక చిత్రాల దర్శకులు శ్రీ ఓం సాయి ప్రకాష్ గారు లేత గులాబీ టైటిల్ పోస్టర్ను లాంచ్ చేసి దర్శకుడు మరియు నిర్మాతలను ఆశీర్వదించారు.  వారాహి మీడియా హౌస్ సమర్ప ణ లో మీనాక్షి  క్రియేషన్స్ బ్యానర్ పై సుందర్ దర్శకత్వంలో  శ్రీనివాస్  మరియు ప్రసాద్ నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం లేత గులాబి.  విభిన్న ప్రేమ కథ తో పాటు సమాజ హిత సందేశాత్మక ఈ చిత్రానికి వెంకట్ బాలగోని సంగీతాన్ని అందిస్తున్నారు. నిర్మాతలు పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని మీడియాకు చెప్పారు.

పెంచల్ రెడ్డి జీవిత కథతో రూపొందిన "ఆపద్భాంధవుడు" చిత్రం సమాజంలో చైతన్యం తీసుకొస్తుంది - డైరెక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్

Image
శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్స్ పై పలు బాలల చిత్రాలు రూపొందించి ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రతిష్టాత్మక అవార్డ్ లు దక్కించుకున్నారు దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్. ఆయన రచనా, దర్శకత్వంలో తెరకెక్కించిన  చిత్రం "ఆపద్భాంధవుడు" శ్రీ పెంచల్ రెడ్డి. డి. లీలావతి నిర్మించారు. ఈ చిత్రంలో పెంచల్ రెడ్డి, సుధాకర్ గౌడ్, ఝాన్సీ, ప్రతిమ, నాగేశ్వరరావు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రెస్ మీట్ ను ఈ రోజు హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో నిర్వహించారు . ఈ కార్యక్రమంలో  *దర్శకుడు భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ* - వ్యాపారం, కుటుంబం, సమాజ సేవ.. ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ సేవా రత్నగా గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి శ్రీ పెంచల్ రెడ్డి గారు. ఆయన నాకు ఎంతో కాలంగా తెలుసు. దర్శకులుగా మనం సమాజం నుంచి, మన చుట్టూ ఉన్న వాళ్ల దగ్గర నుంచే స్ఫర్తి పొందుతాం. అలా మీ జీవితం ఆధారంగా లఘు చిత్రం రూపొందించాలని ఉంది అని అడిగినప్పుడు ఆయన నాకంటే గొప్పవాళ్లు ఎంతోమంది ఉన్నారు, నాకంటే ఎక్కువగా సేవ చేసిన వాళ్లున్నారు అని తిరస్కరించేవారు. చివరిసారి ప్రయత్నం చేసినప్పుడు మాత్రం మౌ...

చిత్రపురిలో 300 కోట్ల స్కాంఅధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ను అరెస్ట్ చేయాలంటూ FDC వద్ద సినీ కార్మికుల మహాధర్నా

Image
హైదరాబాద్: చిత్రపురి హౌసింగ్ సొసైటీలో సుమారు ₹300 కోట్ల రూపాయల మేర భారీ కుంభకోణం జరిగిందని, సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అవినీతి పెరిగిపోతోందని ఆరోపిస్తూ పలువురు సినీ కార్మికులు, నాయకులు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) కార్యాలయం ముందు బుధవారం మహాధర్నా చేపట్టారు. నిజమైన సినిమా కార్మికులకు ఇళ్లు దక్కకుండా అన్యాయం చేస్తున్నారని, ఫ్లాట్లను బ్లాక్ మార్కెట్‌లో కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ, వల్లభనేని అనిల్ కుమార్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చిత్రపురి పోరాట సమితి, సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ, కార్మికుల కోసం కేటాయించిన స్థలంలో వారిని మోసం చేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. "చిత్రపురిలో మిగిలిన 2.5 ఎకరాలలో, కార్మికులు అడుగుతున్న సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కాదని, 1200 నుండి 4400 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ నిర్మాణాలు చేపట్టి, వాటిని బయటి వ్యక్తులకు అమ్ముకోవడానికి కమిటీ ప్లాన్ చేసింది. ఇందుకు HMDA, CMO కార్యాలయ అధికారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు," అని వారు ఆరోపించారు. *కోర్టు ఆదేశ...

2,00,000+ Viewers in 3 Days: “Mothevari Love Story” Emerges As a Smashing Hit on ZEE5

Image
To promote authentic, rooted storytelling from the heartlands of Telangana and Andhra Pradesh, ZEE5 Telugu has begun curating original stories that showcase the essence of these regions. As part of this initiative, ZEE5 has recently premiered its latest rural Telangana dramedy, "Mothevari Love Story", starring Anil Geela and Varshini in lead roles. Premiered on August 8, the series has received a sensational response, attracting over 2,00,000 viewers within just three days of release. Written and directed by Shiva Krishna Burra, the series features Muralidhar, Sadanna, Vijaya Laxmi, Sujatha, and others in pivotal roles. Mothevari Love Story is produced by Madhura Sreedhar and Sriram Srikanth under the banners of Madhura Entertainment and My Village Show. Set in the rural backdrop of Telangana, Mothevari Love Story showcases the tale of Parshi (Anil Geela), a young man from Arepalli village, who falls in love with Anitha (Varshini), the daughter of Sattaiah (Murali...

ఆర్ నారాయణమూర్తి యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా నాకు బాగా నచ్చింది అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా …స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్

Image
*మనం పిల్లల మీద ఎంత ఒత్తిడి పెడుతున్నామో యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమాలో ఆర్ నారాయణ మూర్తి చూపించారు …స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్* *ఆగస్టు  22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న  పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి యూనివర్సిటీ పేపర్ లీక్-* స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో  ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ (పేపర్ లీక్). ఈ చిత్రం ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా వీక్షించిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీడియా తో మాట్లాడారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ: ఒకమాట మనం ఖచ్చితంగా మాట్లాడాలి ఆ మాట వినపడాలి. అంటే నొక్కబడే గొంతుల గురించి మాట్లాడడానికి ఒక గొంతు ఉంది. ఆ గొంతుఅందరికీ వినపడాలి. అది మనకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. దానితో ఏకీభవించొచ్చు ఏకీభవించకపోవచ్చు. కానీ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం వుంది. అది మనం వినాల్సిన అవసరం వుంది. లేకపోతే ఏమీ జరుగుతుంది అంటే ప్రపంచంలో ఏక పక్ష ధోరణి రావడం వలన రాబోయే జనరేషన్స్ చాలా సంకుచితంగా తయారైపోతారు. అందుకని విభిన్నమైన గొ...