సూరి హీరోగా న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మామ‌న్‌’.. ఆగ‌స్ట్ 27 నుంచి జీ5 తెలుగు, క‌న్న‌డ‌ల్లో స్ట్రీమింగ్‌

- ఆగ‌స్ట్ 8న త‌మిళంలో స్ట్రీమింగ్.. 27 నుంచి తెలుగు, క‌న్న‌డ‌ల్లో స్ట్రీమింగ్

భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT ప్లాట్‌ఫారమ్ అయిన ZEE 5 2025లో మరో సూపర్‌హిట్ ప్రీమియర్‌తో ఆడియెన్స్‌ని ఎప్ప‌టిక‌ప్పుడు అల‌రిస్తూనే ఉంది. తాజాగా మ‌రో విజ‌య‌వంత‌మైన చిత్రం ‘మామ‌న్‌’ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తోంది. ఆగ‌స్ట్ 8న త‌మిళంలో ZEE 5 ప్రేక్ష‌కుల‌కు అందిస్తోంది. ఇప్పుడీ చిత్రం తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఆగ‌స్ట్ 27 నుంచి ZEE 5లో స్ట్రీమింగ్ కానుంది. భావోద్వేగాలు క‌ల‌గ‌లిసిన కుటుంబ క‌థా చిత్రంగా ప్రేక్ష‌కులను అల‌రించిన ఈ చిత్రం ఇప్పుడు ZEE 5లో స్ట్రీమింగ్ కానుండ‌టంతో మ‌రింత మంది ప్రేక్ష‌కుల‌కు రీచ్ అవుతుంది. 

▶️https://zee5.onelink.me/RlQq/57z8ki1i

ఇన్‌బా(సూరి) చెల్లెలు గిరిజ (శ్వాసిక‌)క‌కు పెళ్లై ప‌దేళ్లైనా పిల్ల‌లు పుట్టారు. గిరిజ మొక్క‌ని దేవుడు లేడు. చివ‌ర‌కు ఆమె ఓ బాబుకి జ‌న్మ‌నిస్తుంది. లేక లేక పుట్టిన మేన‌ల్లుడు నిల‌న్ (ప్ర‌గీత్ శివ‌న్‌) అంటే ఇన్‌బాకు అమిత‌మైన ప్రేమ‌. త‌న‌ను ప్రేమ‌గా ల‌డ్డు అని పిలుచుకుంటుంటాడు. ఇన్‌బా, రేఖ‌ను పెళ్లి చేసుకుంటాడు. ల‌డ్డుకి మామ అంటే ఉండే ప్రేమ‌తో అత‌నితోనే ఉంటాడు. ఇది రేఖ‌కు న‌చ్చ‌దు. దీంతో ఆమె ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంది. చివ‌ర‌కు ల‌డ్డు వ‌ల్ల ఇన్‌బా, రేఖ విడిపోతారా? ఇన్‌బాపై నిల‌న్‌కు ఉన్న ప్రేమ‌ను రేఖ అర్థం చేసుకుంటుందా? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే మాత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘మామ‌న్‌’ సినిమాను చూడాల్సిందే. 

ZEE5 గురించి...

జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

లేత గులాబీ టైటిల్ లాంచ్