(IMY )ఐఎంవై తెలుగు టైటిల్ ఛాలెంజ్: టైటిల్ చెప్పండి, లక్ష పట్టుకెళ్లండి..!

 సినిమా ప్రమోషన్లలో కొత్త ట్రెండ్ మొదలైంది. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న 'ఐఎంవై' (IMY) చిత్రం తమ టైటిల్ కోసం ప్రేక్షకులకు ఓ భారీ ఛాలెంజ్ విసిరింది. 'ఐఎంవై' (IMY) అంటే ఏంటో తెలుగులో టైటిల్ చెప్పగలిగితే, ఏకంగా లక్ష రూపాయల బహుమతి గెలుచుకోవచ్చని ప్రకటించింది.

ఆర్‌.పి. పట్నాయక్ రీ-ఎంట్రీతో జోష్.. 
 
చాలా కాలంగా సంగీతానికి దూరంగా ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌.పి. పట్నాయక్ ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇవ్వడం విశేషం. దర్శకుడు త్రినాథ్ కఠారి చెప్పిన కథ నచ్చడంతోనే ఆయన ఈ చిత్రానికి సంగీతం అందించడానికి అంగీకరించారు. ఇప్పటికే విడుదలైన 'గం గణపతయే నమహా' పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాట విన్న చాలామంది ఆర్‌.పి. పట్నాయక్ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చారని ప్రశంసిస్తున్నారు. ఆర్‌.పి. పట్నాయక్ మరియు అనురాగ్ కులకర్ణి కలసి ఒక సూపర్ హిట్ సాంగ్ చేయాలని  ఎప్పడి నుండో అనుకున్నారు గానీ ఎందుకో కుదరలేదు... ఆ కల ఈ పాట రూపంలో నెరవేరడంతోపాటు హిట్ కొట్టడం ఖాయం అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.   

ఛాలెంజ్ ఏమిటంటే..?   

'ఐఎంవై'( IMY) అనే అక్షరాలకు సరిపోయే తెలుగు టైటిల్‌ను ఊహించి, దాన్ని వాట్సాప్ నెంబర్ 7569933855కు పంపించాలి. ఈ మెగా ఛాలెంజ్‌లో సరైన టైటిల్‌ను చెప్పిన విజేతకు లక్ష రూపాయల నగదు బహుమతి లభిస్తుంది. అంతేకాకుండా, క్రియేటివ్‌గా ఆలోచించి టైటిల్ పంపిన 10 మందికి కూడా రూ. 5వేల చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. మీరు పంపే టైటిల్స్ సెప్టెంబర్ 9, 2025 కన్నా ముందే చేరాలి.

చిత్ర బృందం..   

నిర్మాత: కె. శంకర్

రచన & దర్శకత్వం: త్రినాథ్ కఠారి

సంగీతం: ఆర్‌.పి. పట్నాయక్

సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి

ఎడిటర్: SB ఉద్దవ్

PRO: SNR

హీరోగా త్రినాథ్ కఠారి నటిస్తూ, సాహితి అవాంచ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, దేవి ప్రసాద్, గోపరాజు రమణ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

లేత గులాబీ టైటిల్ లాంచ్