ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆరోగ్య డైట్ ఫౌండర్ పూడి మహాలక్ష్మయ్య (లక్ష్మణ్ )
ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆరోగ్య డైట్ ఫౌండర్ పూడి డి మహాలక్ష్మయ్య (లక్ష్మణ్). కరోనా టైమ్ లో ఈ వైరస్ వ్యాప్తి, జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా పాటలు రాసి కంపోజ్ చేసి మంచి గుర్తింపు పొందారు. మహాలక్ష్మయ్య. తాజాగా ఆయన ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. ఈ సంస్థ భారత ప్రతినిధి బింగి నరేందర్ గౌడ్ ప్రెస్ మీట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య డైట్ ఫౌండర్ మహాలక్ష్మయ్య, డాక్టర్ వెంకటకృష్ణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా ప్రతినిధి బింగి నరేందర్ గౌడ్ మాట్లాడుతూ - ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 170 దేశాల్లో ఏటా జనవరిలో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తుంటుంది. 2010లో స్థాపించిన ఈ సంస్థ ద్వారా మన దేశంలో ఎంతోమంది ప్రముఖులకు అవార్డ్స్ అందించాం. మాకు ఇండియాలో 64 బ్రాంచెస్ ఉన్నాయి. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, ఎస్పీ బాలు, దాసరి నారాయణరావు...ఇలా ఎంతోమంది ప్రముఖులకు మా సంస్థ అవార్డ్స్ ఇచ్చాం. ఇప్పుడీ ఘనత మన తెలుగు వారు ఆరోగ్య డైట్ ఫౌండర్ పుడి మహాలక్ష్మయ్య గారికి దక్కడం సంతోషంగా ఉంది. ఆయన దాదాపు 90 వేల 600మందికి ఆరోగ్య డైట్ ద్వారా షుగర్, పీసీఓడీ వంటి వివిధ రకాల అనారోగ్యాల నుంచి ఉపశమనం కలిగించారు. దీన్ని ఒక సేవగా కూడా ఆయన చేశారు. డబ్బులు లేని వారికీ చికిత్స అందించారు. ఇవన్నీ చూశాక ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు కల్పించాం అన్నారు.
ఆరోగ్య డైట్ ఫౌండర్ పూడి డి మహాలక్ష్మయ్య (లక్ష్మణ్) మాట్లాడుతూ -ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కడం గర్వంగా ఉంది. దీన్ని ఒక గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నా. ఈ ఘనతతో ప్రపంచానికి మా ఆరోగ్య డైట్ గురించి, నా గురించి తెలిసే అవకాశం ఏర్పడింది. మా ఆరోగ్య డైట్ ద్వారా లక్షలాది మందిని ఆరోగ్యవంతులను చేశాం. మనం పుట్టాక ఏదో ఒక మంచి పనిచేయాలంటారు. ఆరోగ్య డైట్ ద్వారా ఇక్కడ ఉన్న సాయి కిరణ్ కు పూర్తిగా సోరియాసిస్ తగ్గించాం. అలాగే వంశీ 197 నుంచి 100 కేజీలకు బరువు తగ్గారు. కర్ణాటకకు చెందిన రంజిత్ 158 నుంచి 116 కేజీలకు వచ్చారు. ఆయనకు లివర్ ప్రాబ్లమ్ కూడా తగ్గిపోయింది. వీళ్లే మా ఆరోగ్య డైట్ ను ప్రపంచానికి చాటుతున్నారు. కొత్త పద్ధతుల్లో మేము తయారు చేసే ఆహార పదార్థాలతో రుచినీ ఆస్వాదిస్తూ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నాకు చోటు దక్కేలా సహకారం అందించిన డా. వెంకటకృష్ణా రెడ్డి గారికి, నరేందర్ గౌడ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా అన్నారు.
Comments
Post a Comment