క్రిస్మస్ పర్వదినం సందర్భంగా డిసెంబర్ 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న "తొలి కిరణం" మూవీ
పీడీ రాజు, అభినయ, సాయి కిరణ్, భానుచందర్, సుమన్,సురేఖా వాణి కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "తొలి కిరణం". ఈ చిత్రాన్ని ఏవీఎం ఆర్ట్స్ బ్యానర్ పై మేరీ విజయ సమర్పణలో జె. జాన్ బాబు నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. హార్ట్ టచింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో, హై క్వాలిటీ టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కిన "తొలి కిరణం" మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 14న కిస్మస్ పర్వదినం సందర్భంగా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. "తొలి కిరణం" సినిమా ప్రేక్షకులకు ది బెస్ట్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వనుందని రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత జె. జాన్ బాబు తెలిపారు.
*దర్శక, నిర్మాత జె. జాన్ బాబు మాట్లాడుతూ -* మా "తొలి కిరణం" సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాను క్రిస్మస్ పర్వదినం సందర్భంగా డిసెంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో అన్ని దేశాల్లో విడుదల చేయబోతున్నాం. హై క్వాలిటీ టెక్నికల్ వ్యాల్యూస్ తో ఈ రోజు వరల్డ్ సినిమాతో పోటీ పడే విధంగా "తొలి కిరణం" చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాం. సీజీ, గ్రాఫిక్స్ హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఉంటాయి. పీడీ రాజు, అభినయ, సుమన్, భానుచందర్ తమ నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తారు. పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆద్యంతం ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది. చంద్రబోస్ సాహిత్యంతో ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందించిన పాటలు ఇప్పటికే లక్షలాది సీడీలు అమ్ముడయ్యాయి. మ్యూజిక్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన "తొలి కిరణం" సినిమా థియేటర్స్ లోనూ అంతే స్థాయి ఘన విజయాన్ని దక్కించుకుంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.
*నటీనటులు -భాను చందర్, సుమన్, సాయి కిరణ్, పీ.డీ రాజు, అభినయ, సురేఖ వాణి, ప్రభావతి,రాఘవ తదితరులు
*టెక్నికల్ టీమ్*
కెమెరా -:మురళీ కృష్ణ
కథ : రెవరెండ్ టి. ఏ . ప్రభు కిరణ్
మాటలు :ప్రవీణ్
పాటలు : చంద్రబోస్
సంగీతం :ఆర్పీ పట్నాయక్
పీఆర్ఓ: లక్ష్మీ నివాస్
స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం: జె. జాన్ బాబు
Comments
Post a Comment