హైదరాబాద్‌లో యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్–2025 ప్రారంభం
▪️ డిసెంబర్ 5 నుంచి 14 వరకు మూడు వేదికల్లో ప్రదర్శనలు హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత యూరోపియన్ సినీ సంస్కృతిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తూ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (EUFF)–2025 హైదరాబాద్‌లో శుక్రవారం అద్భుతంగా ప్రారంభమైంది. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు, సాంస్కృతికవేత్తలు, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరై వేడుకకు ప్రత్యేక శోభను చేకూర్చారు. “యూరోపియన్ సినిమాను భారత ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఈ ఫెస్టివల్ 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో ఈ స్థాయి ఫెస్టివల్‌ను నిరంతరం నిర్వహించడంలో సారథి స్టూడియోస్ మద్దతు ఎంతో కీలకం,” అని నిర్వాహకులు వెల్లడించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సారథి స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ MSRV ప్రసాద్, EU ప్రతినిధి బృందం, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ అధ్యక్షుడు K.V. రావు, ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, Alliance Française డైరెక్టర్ మౌద్ మీక్వావు, ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ కె. శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. EU డెలిగేషన్ సెకండ్ సెక్రటరీ లోరెంజో పర్రుల్లి మాట్లాడుతూ: ...