Posts

నటుడిగా గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న రమణా రెడ్డి !!!

Image
పురెల్లి రమణా రెడ్డి ఇప్పటివరకు దాదాపు 150 చిత్రాల్లో నటించారు, అందులో ముఖ్యంగా అఖండ, ఖైదీ నెంబర్ 150, గబ్బర్ సింగ్, క్రాక్, రూలర్,  సైర నరసింహ రెడ్డి, గద్దలకొండ గణేష్, ది వారియర్, సీత, గరుడవేగా, ధ్రువ, కిక్ 2, నేనేరాజు నేనే మంత్రి, వీరసింహ రెడ్డి ఇంకా మరెన్నో చిత్రాలలో నటించారు. నాటకాలు గడి, మదర్ థెరిసా చేశారు అలాగే టీవీ షోస్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ చేశారు. ఆమెజాన్ లో గ్యాంగ్ స్టార్స్, జీ 5 లో లుజర్ , ఏటీఎం వెబ్ సీరీస్ లో నటించారు. 2015 - 16 నంది నాటకోత్సవాల్లో గడి నాటగానికి గాను బెస్ట్ నంది అవార్డ్ రావడం విశేషం. ప్రస్తుతం ఆంధ్ర కింగ్ తాలుకా సినిమాలో అలాగే రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలో మంచి రోల్స్ లో రమణా రెడ్డి నటించి మెప్పించారు. బాలయ్య అఖండ 2 తో పాటు తరుణ్ భాస్కర్ నూతన చిత్రంలో అలాగే పూరి సేతుపతి, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటించారు త్వరలో ఈ మూవీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

స్వర్ణోత్సవానికి సిద్ధమవుతున్న 'సోగ్గాడు'

Image
నటభూషణ శోభన్ బాబు నటించిన 'సోగ్గాడు' చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ కలెక్షన్లను హోరెత్తించి...అనేక రికార్డులను సొంతం చేసుకుంది. పల్లెటూరు నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం తర్వాత 'సోగ్గాడు' శోభన్ బాబు అని పిలవడం మొదలు పెట్టారు. శోభన్ బాబు, జయచిత్ర, జయసుధ నాయకానాయికలుగా కె.బాపయ్య దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం నాటి ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుని అజరామరంగా నిలిచింది. 1975 డిసెంబర్ 19న విడుదలైన ఈ చిత్రం సరిగ్గా ఈ ఏడాది డిసెంబర్ 19 నాటికి 50 ఏళ్లు పూర్తిచేసుకుని స్వర్ణోత్సవం జరుపుకోనున్నది. ఈ నేపథ్యంలో   సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి సంయుక్తంగా శ్రేయాస్ మీడియా సౌజన్యంతో  డిసెంబర్ 19 తేదీన హైదరాబాద్ లో స్వర్ణోత్సవాల సంబరాలను ఘనంగా నిర్వహించనున్నాయి.  ఈ సందర్భంగా స్వర్ణోత్సవ పోస్టర్ ను హైదరాబాద్, రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో విడుదలచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు విచ్చేశారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, శోభన్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో ఆయనతో తాము...

"ప్రేమిస్తున్నా" చిత్రం ఇప్పుడు ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ !!!

Image
వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు.  ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదలై మంచి మౌత్ టాక్ ను సొంతం చేసుకుంది.  ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వచ్ఛమైన ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు. దర్శకుడు భాను ప్రేమిస్తున్నా సినిమాను న్యూ ఏజెడ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కు చూపించారు. "అన్ కండీషనల్ లవ్ తో తెరకెక్కిన సినిమా ప్రేమిస్తున్నా. ఇప్పటివరకు తెలుగులో అంత అన్ కండీషనల్ లవ్ తో ఏ సినిమా రాలేదు, అద్భుతమైన పాటలు, పర్ఫార్మెన్స్ తో ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల అయ్యింది. చాలా కాలం తరువాత వచ్చిన బ్యూటిఫుల్ లవ్ స్టొరీ ఈ సినిమా. థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ ఈ సినిమాను ఆహా ఓటిటి లో చూడవచ్చు. ఇదొక మ్యూజికల్ లవ్ స్టొరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పేరు సంపాదించుకుంది,  భాస్కర్ శ్యామల ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు, అనిల్ కుమార్ అచ...

Sitaare Gold & Diamonds 2nd premium Jewellery Retail Store Grand at Kompally by Heroine Nidhhi Agerwal

Image
హీరోయిన్ నిధి అగర్వాల్ చేత సీతారే గోల్డ్ & డైమండ్స్ న్యూ షో రూమ్ కొంపల్లి లో ప్రారంభం  !!! సీతారే గోల్డ్ & డైమండ్స్ తమ రెండో ప్రీమియమ్ జ్యూవెలరీ రిటైల్ షో రూమ్ ను సుచిత్ర, కొంపల్లి లో (మెట్రో క్యాష్ అండ్ క్యారీ ) పక్కన గ్రాండ్ ఓపెనింగ్ ద్వారా ప్రకటించింది. 8000 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త షో రూమ్ వినియోగదారులకు విలాసవంతమైన, విశాలమైన మరియు వరల్డ్ క్లాస్ జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడింది. ఈ షో రూమ్ ను ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ కె. పి.వివేకానంద గౌడ్ గారు (ఎంఎల్ఏ కుత్బుల్లాపూర్ ) ప్రారంభించారు. ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు.  అదనంగా బిజెపి మేడ్చెల్ అర్బన్ జిల్లా కార్యదర్శి శ్రీ భారత్ సింహ రెడ్డి గారు హాజరై ఈ ప్రారంభోత్సవాన్ని మరింత విశేషంగా మార్చారు. కొంపల్లి సీతారే షో రూమ్ లో గోల్డ్ , డైమండ్, అన్కట్, పోల్కి మరియు జమ్ స్టోన్ జ్యువెలరీల విస్తృత శ్రేణిని అందిస్తున్నారు. సంప్రదాయ నైపుణ్యాన్ని అధినిక డిజైన్ తో మిళితం చేస్తూ రూపొందించిన ఈ షో రూమ్ లో ప్రీమియం ఇంటీరియస్ శ్రేష్టమైన అంబియ్సన్స్ మ...

Paanch Minar movie review and rating !!!

Image
టైటిల్‌: పాంచ్‌ మినార్‌ నటీనటులు: రాజ్ తరుణ్, రాశి సింగ్,అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ, సుదర్శన్, కృష్ణ తేజ, నంద గోపాల్, ఎడ్విన్ లక్ష్మణ్ మీసాల, జీవా, అజీజ్ తదితరలు నిర్మాణ సంస్థ: కనెక్ట్ మూవీస్ LLP సమర్పణ: గోవింద రాజు రచన & దర్శకత్వం: రామ్ కడుముల నిర్మాతలు: మాధవి, MSM రెడ్డి సంగీతం: శేఖర్ చంద్ర డీవోపీ: ఆదిత్య జవ్వాది విడుదల తేది: నవంబర్‌ 21, 2025 యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి  మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రివ్యూ వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం కథేంటంటే..  కృష్ణచైతన్య అలియాస్‌ కిట్టు(రాజ్‌ తరుణ్‌) ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. ప్రియురాలు ఖ్యాతి(రాశి సింగ్‌) ఒత్తిడి చేయడంతో సాఫ్ట్‌వ...

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్

Image
డాక్టర్ శివ రాజ్ కుమార్ & ధనంజయ ముఖ్య పాత్రలుగా హేమంత్ ఎం. రావు దర్శకత్వంలో వస్తోన్న సినిమా 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్, ఈ చిత్ర యూనిట్ ప్రియాంక మోహన్‌ను ఆన్-బోర్డింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె ఇప్పుడు లెజెండరీ సూపర్ స్టార్ డాక్టర్ శివ రాజ్ కుమార్ మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి ధనంజయ నేతృత్వంలోని 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ యొక్క నక్షత్ర తారాగణంలో చేరింది.  ప్రియాంక మోహన్ తమిళం, తెలుగు మరియు కన్నడ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఆమె సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాని, ధనుష్ మరియు శివ కార్తికేయన్‌లతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఓజి, సరిపోద శనివారం, కెప్టెన్ మిల్లర్, డాక్టర్ మరియు పరిశ్రమలలోని అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలలో ప్రశంసలు పొందిన పాత్రలతో ప్రియాంక ఇప్పుడు హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించిన బాండ్-ఎస్క్యూ స్పై డ్రామాలో చేరింది 80ల నేపథ్యంలో. ‘నేను డాక్టర్ శివ రాజ్ కుమార్ సర్ సినిమాలు చూస్తూ పెరిగాను.  ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’లో భాగం కావడం నా కల నిజమైంది. అద్భుతమైన ప్రతిభావంతులైన ధనంజయతో కలిసి పనిచేయడం మరియు అలాంటి సమిష్టి తారాగణంలో భాగ...

ఇనికా ప్రొడక్షన్స్ బ్యానర్ లో హృదయాన్ని హత్తుకునే ఇండియన్ అనిమేషన్ సినిమా “కికీ & కోకో”

Image
ఇటీవల అనిమేషన్ చిత్రాలు  ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఆపాదిస్తున్నాయి.   ప్రత్యేకంగా బాలల చిత్రాలు నిర్మించడానికి ఎవరు ముందుకు రావడంలేదు. కాని వారికి అర్ధమయ్యేలా వినోదాత్మకంగా చిత్రాలు అందిస్తే తప్పక ఆదరిస్తారు.   ఇండియన్ స్క్రీన్ పై లయన్ కింగ్, అలాద్దిన్, వంటి కొన్ని అనిమేషన్ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందుతూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి. అంతఎందుకు  జూలై లో విడుదల అయిన 'మహా అవతార్ నరసింహ' అనిమేషన్ చిత్రం, పిల్లలని, పెద్దలని విశేషంగా ఆకట్టుకుని రికార్డు స్తాయి వసూల్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే! ప్రస్తుతం  ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకునే ఓ  ఇండియన్ అనిమేషన్ సినిమా “కికీ & కోకో” త్వరలో విడుదల కాబోతుంది.  ప్రపంచవ్యప్తంగా ఎల్లలు దాటి, పలు భాషల్లో ఈ చిత్రం  విడుదల కాబోతుంది.  పూర్తిగా భారత సినీ ఇండస్ట్రీ నుండి ఇక్కడి సాంకేతిక నిపుణులతో విభిన్న తరహాలో  తొలి సారిగా  పీ. నారాయణన్ దర్శకత్వంలో రూపొందించిన   అనిమేషన్ చిత్రం కికీ & కోకో. ఈ సందర్భాగా దర్శకుడు పీ. నారాయణన్ మ...