స్వర్ణోత్సవానికి సిద్ధమవుతున్న 'సోగ్గాడు'
నటభూషణ శోభన్ బాబు నటించిన 'సోగ్గాడు' చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ కలెక్షన్లను హోరెత్తించి...అనేక రికార్డులను సొంతం చేసుకుంది. పల్లెటూరు నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం తర్వాత 'సోగ్గాడు' శోభన్ బాబు అని పిలవడం మొదలు పెట్టారు. శోభన్ బాబు, జయచిత్ర, జయసుధ నాయకానాయికలుగా కె.బాపయ్య దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం నాటి ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుని అజరామరంగా నిలిచింది. 1975 డిసెంబర్ 19న విడుదలైన ఈ చిత్రం సరిగ్గా ఈ ఏడాది డిసెంబర్ 19 నాటికి 50 ఏళ్లు పూర్తిచేసుకుని స్వర్ణోత్సవం జరుపుకోనున్నది. ఈ నేపథ్యంలో సురేష్ ప్రొడక్షన్స్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి సంయుక్తంగా శ్రేయాస్ మీడియా సౌజన్యంతో డిసెంబర్ 19 తేదీన హైదరాబాద్ లో స్వర్ణోత్సవాల సంబరాలను ఘనంగా నిర్వహించనున్నాయి. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ పోస్టర్ ను హైదరాబాద్, రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో విడుదలచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు విచ్చేశారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, శోభన్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో ఆయనతో తాము...