రూమ్ నంబర్ 111 మూవీ రివ్యూ & రేటింగ్ !!!
రచన & దర్శకత్వం: భూమి రెడ్డి చంద్రమౌళి రెడ్డి సంగీతం: శివు జామకండి నేపధ్య సంగీతం: మహావీర్ హీరో: ధర్మ కీర్తిరాజ్ హీరోయిన్: అపూర్వ ప్రేమ మెహతా గరిమా సింగ్ జర్నలిస్ట్: బింబికా హోటల్ మేనేజర్: గిరి ఇన్స్పెక్టర్: మిమిక్రీ గోపి కథ: కార్తిక్ (ధర్మ కీర్తి రాజు) దివ్య (అపూర్వ) ప్రేమించి వివాహం చేసుకుంటారు. వీరికి ఒక పాప పుడుతుంది. పాపకు మాటలు రావు, అందుచేత హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రికి వస్తారు పాప మరియు కార్తిక్. ఒక సందర్భంలో పాప కార్తిక్ మిస్ అవుతారు. తరువాత ఏం జరిగింది ? దివ్య చివరికి ఏం చేసింది ? పాప మరియు కార్తిక్ ఏమయ్యారు తెలుసుకోవాలంటే రూమ్ నెంబర్ 111 సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: ఈ సినిమా పూర్తి స్క్రీన్ ప్లే ఆధారిత సినిమా. ఇది కుటుంబ భావోద్వేగాలు, డ్రామా మరియు మిస్టరీల మిశ్రమం. ఫస్ట్ హాఫ్: ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఫీల్ ఇస్తుంది. సస్పెన్స్ కొనసాగించబడుతుంది మరియు ఉత్సుకతను పెంచుతుంది. సెకండ్ హాఫ్: అన్ని పాత్రలు బయటపడతాయి మరియు ఊహించని మలుపులు చూపబడతాయి. మొత్తం సినిమా ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ ను కలిగిస్తుంది, ఇది ప్రేక్షకులకు బలమైన థ్రిల్, భావోద్వేగ లోతు మరియు సినిమాటిక్...