వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ కు థియేటర్స్ లో మంచి స్పందన, చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు !!!
నటుడు వరుణ్ సందేశ్ నటించిన చిత్రం “కానిస్టేబుల్” ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఇటీవల థియేటర్స్ లో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
ఈ చిత్రంలో ఉన్న మెయిన్ పాయింట్ కొత్తగా ఉంది..ఈ మధ్య కాలంలో వస్తున్న రొటీన్ మర్డర్ క్రైమ్ థ్రిల్లర్స్ కి కొంచెం భిన్నంగా ట్రై చేశారు. దానికి అనుగుణంగా సాగే కొన్ని సన్నివేశాలు బాగున్నాయి కొత్తగా అనిపిస్తాయి. మర్డర్స్ మిస్టరీ మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్ బాగుంది. అలాగే కొన్ని ట్విస్ట్ లు బాగా పేలాయి
ఇక హీరో వరుణ్ సందేశ్ చాలా కాలం తర్వాత ఓకే రేంజ్ పెర్ఫామెన్స్ ని అందించాడు.. వరుణ్ సందేశ్ అనగానే లవ్ స్టోరీస్ సే గుర్తుకువస్తాయి కానీ.. ఏ క్యారెక్టర్ అయినా చేయగలను అని నిరూపించాడు..యాక్షన్ సీన్స్ లో కూడా నాచురల్ గా చేశాడు...ఇక తనతో పాటుగా హీరోయిన్ మధులిక సినిమాలో బాగుంది...వీరితో పాటుగా సెకండాఫ్ లో యువ నటి భవ్యశ్రీ సాలిడ్ పెర్ఫామెన్స్ ని చూపించింది. తన రోల్ ని షేడ్స్ అన్నిటినీ ఆమె చక్కగా ఎస్టాబ్లిష్ చేసి తన రోల్ కి ప్రాణం పోసింది.
ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి, నిర్మాత బలగం జగదీష్ ఎక్కడా రాజీ పడకుండా ఖర్చుకి వెనకాడకుండా క్వాలిటీ సినిమాని రిచ్ గా తెరకెక్కించారు. సంగీతం సినిమాకు మరో అదనపు ఆకర్షణ
ఇక దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్ కే విషయానికి వస్తే.. తన వర్క్ పూర్తి స్థాయిలో ఆడియన్స్ ను మెప్పించిందని చెప్పాలి, తను తీసుకున్న కథ కథనాలు ప్రేక్షకులను అలరిస్తాయి.
Comments
Post a Comment