Posts

"ఉఫ్ఫ్ యే సియాపా" చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 5న థియేటర్స్ లో విడుదల !!!

Image
దశాబ్దాల తరువాత మరో సంభాషణ రహిత చిత్రం "ఉఫ్ఫ్ యే సియాపా" సెప్టెంబర్ 5న థియేటర్స్ లో విడుదల !!! ఉఫ్ఫ్ యే సియాపా: బాలీవుడ్ కథా కథనాన్ని ఒక కొత్త పంథా తో చెప్పబోతున్న బోల్డ్ సైలెంట్ కామెడీ. 40 సంవత్సరాల తర్వాత తిరిగి కమల్ హాసన్ నటించిన పుష్పక విమానం వలె, డైలాగులేని, నిజం చెప్పాలంటే డైలాగ్ అవసరపడని సినిమా. నాలుగైదు జనరేషన్స్ మిస్సయిన ఒక అద్భుతం. భారతీయ సినిమా ప్రయోగాలకు కొత్తేమీ కాదు, కానీ ప్రధాన స్రవంతి సినిమా కు, సంభాషణలకు ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందే. అలాంటి సినిమా నుండి సంభాషణలు లేకుండా  ధైర్యం చేయడం చాలా అరుదు. జి. అశోక్ దర్శకత్వం వహించి లవ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై లవ్ రంజన్ మరియు అంకుర్ గార్గ్ నిర్మించిన ఉఫ్ఫ్ యే సియాపా నియమాలను తిరిగి రాస్తోంది. సెప్టెంబర్ 5, 2025న విడుదల కానున్న ఈ డార్క్ కామెడీ-థ్రిల్లర్  డైలాగ్‌ లేకుండా ఒక కథని చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. పూర్తిగా  హావభావాలతో, పర్ఫామెన్స్ ని ఆధారంగా తీసుకొని హాస్యంతో కూడుకున్న దృశ్య మాలికకు ఇండియా గర్వకారణమైన ఆస్కార్ విన్నర్ ఎ. ఆర్. రెహమాన్ యొక్క ఉత్తేజకరమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడం ఇంకా విశే...

దుల్కర్ సల్మాన్ 'వేఫేరర్ ఫిలిమ్స్' సాహసోపేతమైన అడుగు.. భారతీయ సినిమాలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన 'కొత్త లోక'

Image
ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన 'కొత్త లోక 1: చంద్ర' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. వేఫేరర్ పతాకంపై నిర్మించిన ఏడవ చిత్రం ఇది. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడిన ఈ మలయాళ చిత్రం కేరళ సరిహద్దులను దాటి విస్తృత ప్రశంసలు అందుకుంటోంది. చిత్రానికి మాత్రమే కాకుండా దుల్కర్ సల్మాన్ మరియు వేఫేరర్ ఫిలిమ్స్ వారి దార్శనికతకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. మలయాళ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా అత్యంత భారీస్థాయిలో, భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రాన్ని, ఇంత సాంకేతిక పరిపూర్ణతతో నిర్మించడం ద్వారా దుల్కర్ సల్మాన్ అసాధారణమైన అడుగు ముందుకు వేశారు. దీనిని ఓ మలయాళ నిర్మాత తీసుకున్న అత్యంత సాహసోపేతమైన మరియు దూరదృష్టితో కూడిన నిర్ణయాలలో ఒకటిగా వర్ణించవచ్చు. దీనితో ఒక కొత్త సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ ప్రారంభమైంది. మలయాళ సినిమా స్థాయిని పెంచడానికి, సరిహద్దులను దాటి విస్తరించేందుకు వేఫేరర్ ఫిలిమ్స్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. గతంలో మలయాళ ప్రేక్షకులకు అద్భుతమైన చిత్రాలను అంద...

ప్రముఖ నటుడు పృద్వి రాజ్ చేతుల మీదుగా క్రైమ్ థ్రిల్లర్ "బ్లడ్ రోజస్" మూవీ మోషన్ పోస్టర్ విడుదల !!!

Image
టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో కె,నాగన్న మరియు కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను ప్రముఖ నటుడు పృద్వి రాజ్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "బ్లడ్ రోజస్ సినిమా లో ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి చక్కగా నటించారు, శ్రీలు, క్రాంతి కిల్లి ఇపాటెన్స్ రోల్స్ లో కలిపించబోతున్నారు. మోషన్ పోస్టర్ చాలా బాగుంది, ఈ సినిమా విజయం సాధించి డైరెక్టర్ ఎంజిఆర్ గారికి అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్ గారికి, కో ప్రొడ్యూసర్ ఎల్లప్ప గారికి నిర్మాత హరీష్ కె గారికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను" అన్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో శ్రీలు, క్రాంతి కిల్లి నటించగా,సుమన్, ఘర్షణ శ్రీనివాస్, టార్జన్, రాజేంద్ర, జూనియర్ రేలంగీ, జగదీశ్వరి, మణి కుమార్ , ధ్రువ, అనిల్, నరేంద్ర , ప్రగ్యా, న...

‘గ్రాండ్ పేరెంట్స్ డే’ని ముందుగానే సెలెబ్రేట్ చేసేందుకు గ్రాండ్ పేరెంట్స్‌‌కి చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్న ‘త్రిబాణధారి బార్బరిక్’ టీం

Image
కొత్త కాన్సెప్ట్, కంటెంటె బేస్డ్ చిత్రాలు వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. చిన్న సినిమానా? పెద్ద సినిమా? స్టార్ హీరోలు ఉన్నారా?అన్నది కాకుండా కంటెంట్ ఉందా? అని చూస్తున్న తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ రోజు ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం వచ్చింది. గత కొన్ని రోజులుగా పెయిడ్ ప్రీమియర్లతో జనాల్లోకి వెళ్లిన ఈ మూవీ ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ సినిమాకు మొదటి ఆట నుంచే మంచి పాజిటివ్ మౌత్ టాక్‌ వచ్చేసింది.  స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల ఈ మూవీని నిర్మించారు. మోహన్ శ్రీ వత్స ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో సత్య రాజ్, ఉదయభాను, వశిష్ట సింహా, క్రాంతి కిరణ్, సత్యం రాజేష్, సాంచీ రాయ్, మేఘన, కార్తికేయ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రంలో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎమోషన్స్ ఉన్నా కూడా ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతోంది. ఆడపిల్ల ఉండే ప్రతీ ఫ్యామిలీ చూడదగ్గ చిత్రమే ‘త్రిబాణధారి బార్బరిక్’.  ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రానికి ఎక్కువగా మహిళా ప్రేక్షకులు, ఫ్యామిలీ ...

కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా విశాల్, సాయి ధన్సికల నిశ్చితార్థo

Image
విశాల్, సాయి ధన్సిక నిశ్చితార్థం ఆగస్ట్ 29న ఘనంగా జరిగింది. విశాల్, ధన్సిక ప్రేమ, పెళ్లి గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. విశాల్, ధన్సిక ఇద్దరూ కూడా స్టేజ్ మీదే తమ ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాల్ని ప్రకటించారు. ముందు చెప్పినట్టుగానే ఆగస్ట్ 29న ఈ ఇద్దరి పెళ్లికి అడుగులు పడ్డాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో విశాల్, సాయి ధన్సికల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ మేరకు ఎంగేజ్మెంట్ ఫోటోల్ని విశాల్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో నేడు మా ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.. అందరి ఆశీర్వాదం మాకు కావాలి అంటూ సోషల్ మీడియాలో విశాల్ తాజాగా వేసిన ట్వీట్, షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. విశాల్ ప్రస్తుతం ‘మకుటం’ అనే మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. విశాల్ కెరీర్‌లో 35వ చిత్రంగా రానున్న ఈ మూవీని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి నిర్మిస్తున్నారు. ‘మకుటం’ మూవీకి రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. సీ బ్యాక్ డ్రాప్, మాఫియా కథతో విశాల్ సరికొత్త యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘మకుటం’ రూపొందుతోందని సమాచారం. ఇక త్వరలోనే పెళ్లికి సంబంధించిన ఇతర వివరాల్ని వ...

విశాల్ ‘మకుటం’ నుంచి అదిరిపోయే పోస్టర్ విడుదల

Image
వెర్సటైల్ హీరో విశాల్ ప్రస్తుతం ‘మకుటం’ అంటూ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. విశాల్ 35వ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ ‘మకుటం’ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. చూస్తుంటే ఈ మూవీని సముద్రం బ్యాక్ డ్రాప్ మాఫియా కథ అని అర్థం అవుతోంది. ఇక ఈ మూవీలో విశాల్‌ సరసన అంజలి, దుషార విజయన్ నటిస్తున్నారు. తాజాగా ‘మకుటం’ నుంచి అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే విశాల్ ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ లుక్స్, షేడ్స్‌లో కనిపించబోతోన్నారని అర్థం అవుతోంది. విశాల్ యంగ్ లుక్, మిడిల్ ఏజ్ లుక్, ఓల్డేజ్ లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నారు.  ‘మకుటం’ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.  ప్రస్తుతం ఈ మూవీ షూటి...

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా డిసెంబర్ 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న "తొలి కిరణం" మూవీ

Image
పీడీ రాజు, అభినయ, సాయి కిరణ్, భానుచందర్, సుమన్,సురేఖా వాణి  కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "తొలి కిరణం". ఈ చిత్రాన్ని ఏవీఎం ఆర్ట్స్ బ్యానర్ పై మేరీ విజయ సమర్పణలో జె. జాన్ బాబు నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. హార్ట్ టచింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో, హై క్వాలిటీ టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కిన  "తొలి కిరణం" మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని  డిసెంబర్ 14న కిస్మస్ పర్వదినం సందర్భంగా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. "తొలి కిరణం" సినిమా ప్రేక్షకులకు ది బెస్ట్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వనుందని రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత జె. జాన్ బాబు తెలిపారు. *దర్శక, నిర్మాత జె. జాన్ బాబు మాట్లాడుతూ -* మా "తొలి కిరణం" సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాను క్రిస్మస్ పర్వదినం సందర్భంగా డిసెంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో అన్ని దేశాల్లో విడుదల చేయబోతున్నాం. హై క్వాలిటీ టెక్నికల్ వ్యాల్యూస్ తో ఈ రోజు వరల్డ్ సినిమాతో పోటీ పడే విధంగా "తొలి కిరణం" చ...