Posts

‘త్రిబాణధారి బార్బరిక్’ సెన్సార్ పూర్తి.. ఆగస్ట్ 29న గ్రాండ్ రిలీజ్

Image
సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన ఈ ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఆగస్ట్ 29న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అందరిలోనూ అంచనాలు పెంచేశాయి.  ఇప్పటికే ‘త్రిబాణధారి బార్బరిక్’ ప్రివ్యూల్ని వరంగల్, విజయవాడ వంటి చోట ప్రదర్శించగా మంచి స్పందన వచ్చింది. ఈ స్పెషల్ షో తరువాత చిత్రంపై మరింత హైప్ ఏర్పడింది. ఈ మూవీ రిలీజ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు తాజాగా జరిగాయి. ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. కంటెంట్‌తో పాటుగా, మంచి సందేశాన్ని ఇచ్చేలా ‘త్రిబాణధారి బార్బరిక్’ మూవీని తెరకెక్కించారని టీంపై ప్రశంసలు కురిపించారు. డిఫరెంట్ ప్రమోషన్స్‌ చేస్తూ ఇప్పటికే ఆడియెన్స్‌లో బజ్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే....

కర్మణ్యే వాధికారస్తే చిత్రం సెప్టెంబర్ 19 న విడుదల

Image
ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై బ్రహ్మాజీ, శత్రు, 'మాస్టర్' మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కర్మణ్యే వాధికారస్తే. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, మరియు శ్రీ సుధా ముఖ్య పాత్రల్లో నటించారు. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఇటీవలే మధుర ఆడియో ద్వారా విడుదల అయినా చిత్ర ట్రైలర్ సోషల్ మీడియా లో ట్రేండింగ్ అయింది. ఇప్పుడు ఈ చిత్రం  సెప్టెంబర్ 19 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ "'కర్మణ్యే వాధికారస్తే' అనేది భగవద్గీత లోని ఒక పదం. దాని అర్థం "పని చేసే హక్కు నీకుంది, ఫలితాల మీద కాదు". టైటిల్ కి అనుగుణంగా కథ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. కథ కి సరి సాటిగా బ్రహ్మాజీ, శత్రు మరియు  'మాస్టర్' మహేంద్రన్ వారి నటన తో చిత్రానికి మరింత ప్రాణం పోశారు.  ఇది ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్,  స్టూడెంట్ హత్యలు, మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ ఇలా మనం ప్రతిరోజూ టీవిలో పేపర్స్ లో చూసే సంఘటనల ఆధారంగా నిర్మించాం. ఇటీవలే ట్రైలర్ విడుదలై సోషల్ మీడియా లో ట్...

వినాయక చవితి సందర్భంగా విశాల్ ‘మకుటం’ నుంచి అదిరిపోయే పోస్టర్ విడుదల

Image
వెర్సటైల్ హీరో విశాల్ ప్రస్తుతం ‘మకుటం’ అంటూ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. విశాల్ 35వ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ ‘మకుటం’ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. చూస్తుంటే ఈ మూవీని సముద్రం బ్యాక్ డ్రాప్ మాఫియా కథ అని అర్థం అవుతోంది. ఇక ఈ మూవీలో విశాల్‌ సరసన అంజలి, దుషార విజయన్ నటిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ‘మకుటం’ నుంచి అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే విశాల్ ఈ చిత్రంలో మూడు డిఫరెంట్ లుక్స్, షేడ్స్‌లో కనిపించబోతోన్నారని అర్థం అవుతోంది. విశాల్ యంగ్ లుక్, మిడిల్ ఏజ్ లుక్, ఓల్డేజ్ లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నారు.  ‘మకుటం’ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.  ప్రస్...

వినాయక చవితి సందర్భంగా ‘సుమతీ శతకం’ నుంచి స్పెషల్ పోస్టర్

Image
అమర్ దీప్ చౌదరి, సయాలీ జంటగా విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘సుమతీ శతకం’. ఈ మూవీకి ఎం. ఎం. నాయుడు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్ ప్రత్యేక పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్‌తో ‘సుమతీ శతకం’ ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. హీరో హీరోయిన్ కారెక్టర్స్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వినాయక చవితి సందర్భంగా మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో హీరో హీరోయిన్లను చూస్తుంటే ఏదో ఫన్నీ, క్యూట్, ఫ్యామిలీ, లవ్ స్టోరీగా ఈ చిత్రం రాబోతోందని అర్థం అవుతోంది. ‘సుమతీ శతకం’ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నారు. నహిద్ ముహమ్మద్ ఎడిటర్‌గా, హాలేష్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి కథను బండారు నాయుడు అందించారు.

సూరి హీరోగా న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మామ‌న్‌’.. ఆగ‌స్ట్ 27 నుంచి జీ5 తెలుగు, క‌న్న‌డ‌ల్లో స్ట్రీమింగ్‌

Image
- ఆగ‌స్ట్ 8న త‌మిళంలో స్ట్రీమింగ్.. 27 నుంచి తెలుగు, క‌న్న‌డ‌ల్లో స్ట్రీమింగ్ భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT ప్లాట్‌ఫారమ్ అయిన ZEE 5 2025లో మరో సూపర్‌హిట్ ప్రీమియర్‌తో ఆడియెన్స్‌ని ఎప్ప‌టిక‌ప్పుడు అల‌రిస్తూనే ఉంది. తాజాగా మ‌రో విజ‌య‌వంత‌మైన చిత్రం ‘మామ‌న్‌’ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తోంది. ఆగ‌స్ట్ 8న త‌మిళంలో ZEE 5 ప్రేక్ష‌కుల‌కు అందిస్తోంది. ఇప్పుడీ చిత్రం తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఆగ‌స్ట్ 27 నుంచి ZEE 5లో స్ట్రీమింగ్ కానుంది. భావోద్వేగాలు క‌ల‌గ‌లిసిన కుటుంబ క‌థా చిత్రంగా ప్రేక్ష‌కులను అల‌రించిన ఈ చిత్రం ఇప్పుడు ZEE 5లో స్ట్రీమింగ్ కానుండ‌టంతో మ‌రింత మంది ప్రేక్ష‌కుల‌కు రీచ్ అవుతుంది.  ▶️https://zee5.onelink.me/RlQq/57z8ki1i ఇన్‌బా(సూరి) చెల్లెలు గిరిజ (శ్వాసిక‌)క‌కు పెళ్లై ప‌దేళ్లైనా పిల్ల‌లు పుట్టారు. గిరిజ మొక్క‌ని దేవుడు లేడు. చివ‌ర‌కు ఆమె ఓ బాబుకి జ‌న్మ‌నిస్తుంది. లేక లేక పుట్టిన మేన‌ల్లుడు నిల‌న్ (ప్ర‌గీత్ శివ‌న్‌) అంటే ఇన్‌బాకు అమిత‌మైన ప్రేమ‌. త‌న‌ను ప్రేమ‌గా ల‌డ్డు అని పిలుచుకుంటుంటాడు. ఇన్‌బా, రేఖ‌ను పెళ్లి చేసుకుంటాడు. ల‌డ్డుకి మామ అంటే ఉండే ప్రేమ‌తో అత‌నితోన...

Blood - Valour - History: Here’s The Roaring First Look Poster of Tamil-Telugu Historical Action Drama, “Draupathi 2”

Image
Following the super success of the 2020 Tamil film *“Draupathi”*, popular actor Richard Rishi is returning with the sequel, *“Draupathi 2”*. This much-anticipated historical action drama is currently in production, mounted on a grand scale by Netaji Productions, in association with Chola Chakravarthy, and produced by G. M Film Corporation. The film is directed by Mohan G., known for films such as Pazhaya Vannarapettai, Draupathi, Rudra Thandavam, and Bagasuran. On the auspicious occasion of Sri Vinayaka Chavithi, the makers have unveiled the first look poster today, raising expectations for the film’s grand theatrical release later this year in both Tamil and Telugu. Set in the 14th century, the film explores the blood-stained history of Hoysala emperor Veera Vallalar III, who ruled South India with Thiruvannamalai as his capital, along with the bravery of the Kadavarayas of Sendhamangalam. The story unfolds against the backdrop of the Mughal invasion of Tamil Nadu. Around ...

వినాయక చవితి శుభపర్వదినం సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తిస్తున్న “ధర్మవరం” సినిమా పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి గారు ఘనంగా ఆవిష్కరించారు.

Image
ఈ చిత్రంలో రాజ్ వేంకటాచ్ఛ హీరోగా నటించడంతో పాటు కథ, చిత్రకథ, దర్శకత్వం వహించి, ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కథానాయకుడిగా తన అద్భుతమైన నటనతో పాటు దర్శకుడిగా తన ప్రత్యేకమైన ముద్రను వేసేందుకు రాజ్ వేంకటాచ్ఛ ప్రయత్నిస్తున్నారు. ప్రధాన పాత్రల్లో అజయ్, నవీన్ రెడ్డి, సంయోగీత, ఏశాన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. గ్రామీణ సాంప్రదాయాలు, సాంస్కృతిక విలువలు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో నిండిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను అలరించనుందనే నమ్మకాన్ని యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ వేంకటాచ్ఛ మాట్లాడుతూ – “ధర్మవరం సినిమా నాకు ఎంతో ప్రాణమైన ప్రాజెక్ట్‌. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకునేలా ఉండేలా కష్టపడ్డాం. వినాయక చవితి పర్వదినం సందర్భంగా పోస్టర్ విడుదల కావడం మాకు ఒక శుభసూచకం. ప్రేక్షకుల ఆశీర్వాదాలు మాకుంటే ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది” అని తెలిపారు. అనిల్ రావిపూడి గారు మాట్లాడుతూ – “ధర్మవరం పోస్టర్ చాలా బాగుంది. కొత్త ప్రయత్నం కనబడుతోంది. రాజ్ వేంకటాచ్ఛ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని న...