"ఉఫ్ఫ్ యే సియాపా" చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 5న థియేటర్స్ లో విడుదల !!!
దశాబ్దాల తరువాత మరో సంభాషణ రహిత చిత్రం "ఉఫ్ఫ్ యే సియాపా" సెప్టెంబర్ 5న థియేటర్స్ లో విడుదల !!! ఉఫ్ఫ్ యే సియాపా: బాలీవుడ్ కథా కథనాన్ని ఒక కొత్త పంథా తో చెప్పబోతున్న బోల్డ్ సైలెంట్ కామెడీ. 40 సంవత్సరాల తర్వాత తిరిగి కమల్ హాసన్ నటించిన పుష్పక విమానం వలె, డైలాగులేని, నిజం చెప్పాలంటే డైలాగ్ అవసరపడని సినిమా. నాలుగైదు జనరేషన్స్ మిస్సయిన ఒక అద్భుతం. భారతీయ సినిమా ప్రయోగాలకు కొత్తేమీ కాదు, కానీ ప్రధాన స్రవంతి సినిమా కు, సంభాషణలకు ఉన్న అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందే. అలాంటి సినిమా నుండి సంభాషణలు లేకుండా ధైర్యం చేయడం చాలా అరుదు. జి. అశోక్ దర్శకత్వం వహించి లవ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై లవ్ రంజన్ మరియు అంకుర్ గార్గ్ నిర్మించిన ఉఫ్ఫ్ యే సియాపా నియమాలను తిరిగి రాస్తోంది. సెప్టెంబర్ 5, 2025న విడుదల కానున్న ఈ డార్క్ కామెడీ-థ్రిల్లర్ డైలాగ్ లేకుండా ఒక కథని చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. పూర్తిగా హావభావాలతో, పర్ఫామెన్స్ ని ఆధారంగా తీసుకొని హాస్యంతో కూడుకున్న దృశ్య మాలికకు ఇండియా గర్వకారణమైన ఆస్కార్ విన్నర్ ఎ. ఆర్. రెహమాన్ యొక్క ఉత్తేజకరమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడం ఇంకా విశే...