Posts

Showing posts from April, 2025

'కింగ్‌డమ్' చిత్రం నుండి మొదటి గీతం 'హృదయం లోపల' ప్రోమో విడుదల

Image
'కింగ్‌డమ్' చిత్రం నుండి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి గీతం 'హృదయం లోపల' ప్రోమో విడుదలైంది. విడుదలైన క్షణాల్లోనే అందరి మనసుని దోచేసింది. కథానాయకుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, సంగీత దర్శకుడు అనిరుధ్ త్రయం చేతులు కలిపితే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ప్రోమో ఉంది. ప్రోమోలో విజయ్, భాగ్యశ్రీ బోర్సే జోడీ చూడ ముచ్చటగా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. పూర్తి గీతం మే 2వ తేదీన విడుదల కానుంది. “వారు బ్రతకడానికి ప్రేమను నటిస్తారు, కానీ త్వరలోనే అది నిజమనిపిస్తుంది.” అనే వాక్యాన్ని నిర్మాతలు జోడించారు. దానిని బట్టి చూస్తే.. ప్రధాన పాత్రలు మొదట ప్రేమలో ఉన్నట్లు నటిస్తాయి, కానీ చివరికి నిజంగానే ప్రేమలో పడిపోతాయని అర్థమవుతోంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా పట్ల ఆసక్తిని, అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. జోమోన్ టి. జాన్ మరియు గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం అత్యున్నత స్థాయిలో ఉంది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్ర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మే 2న విడుదల కా...

డిఫరెంట్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ "కిల్లర్" గ్లింప్స్ రిలీజ్

Image
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన హీరోగా పాత్రలో నటిస్తుండటం విశేషం. జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తుండగా...విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది. ఈ రోజు "కిల్లర్" మూవీ గ్లింప్స్ తెలుగుతో పాటు కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో..ఇలాంటి ఎలిమెంట్స్ తో గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. "కిల్లర్" మూవీ గ్లింప్స్ ఎలా ఉందో చూస్తే - ప్రాచీన వైమానిక శాస్త్రంలో ఆశ్చర్యపరిచే మానవ మేథస్సు రహస్యాలు వెల్లడించారు. ఆత్మ కలిగిన యంత్రాలు చూస్తారంటూ వైమానిక శాస్త్రంలో చెప్పిందే నిజం కాబోతోందా అంటూ ఈ గ్లింప్స్...

Glimpse of Actress Kushita Kallapu from Superhit aha OTT Web Series "3 Roses" Season 2 Released

Image
The web series 3 Roses, starring Eesha Rebba, Harsha Chemudu, Prince Cecil, Hema, Satyam Rajesh, and Kushita Kallapu in lead roles, was a super hit on aha OTT. Now, the much-awaited Season 2 is on its way. Produced under the Mass Movie Makers banner by cult producer SKN, the series has director Maruthi serving as the showrunner. The writing is by Ravi Namburi and Sandeep Bolla, while Kiran K. Karavalla has directed the series. Today, a special glimpse featuring actress Kushita Kallapu from 3 Roses Season 2 was released. Her character comes across as bold, fierce, and glamorous, grabbing everyone's attention. Kushita’s role is set to be one of the key attractions of the second season. Producer SKN, known for encouraging Telugu talent, has offered her a significant role in this series.  Kushita enjoys a strong following on social media, and her character in this season is expected to stand out with a unique and youth-appealing portrayal, packed with viral content. Previou...

ఐశ్వర్య రాజేష్ నటించిన గరుడ 2.౦ ఆహా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది

Image
హనుమాన్ మీడియా పతాకంపై గతంలో ఎన్నో విజయవంత చిత్రాలు సూపర్ మాచి, శాకాహారి, కాళరాత్రి, నేనే నా, కాజల్ కార్తీక, టీనెజర్స్, కథ కంచికి మనం ఇంటికి లాంటి చిత్రాలు  తెలుగు లో విడుదల చేసిన సక్సెస్ ఫుల్ నిర్మాత బాలు చరణ్ ఇప్పుడు తమిళం లో అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ గా నిలిచి బ్లాక్ బస్టర్ విజయవంతం అయినా ఆరత్తు సీనం (Aarathu Sinam) చిత్రాన్ని తెలుగు లో గరుడ 2.0 గా మన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.  అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వంలో డిమోంటి కాలనీ హీరో అరుళ్ నీతి తమిళరాజు, సంక్రాంతికి వస్తునాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, ఐశ్వర్య దత్త హీరో హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఆరత్తు సీనం (Aarathu Sinam). అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని మన తెలుగు ప్రేక్షకులకు నిర్మాత బాలు చరణ్ గరుడ 2.0 గా ఆహా ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది.  ఆహా ఓ టి టి వారు గరుడ 2.0 చిత్రాన్ని చూసి సినిమా చాలా అద్భుతంగా ఉంది అని వెంటనే చిత్రాన్ని ఆహా ఓ టి టి లో విడుదల చేశారు. తమిళం లో గొప్ప విజయం సాధించిన చిత్రం మన తెలుగు ప్రేక్షకులకు మేపిస్తుంది అని నిర్మాత బాలు చరణ్ నమ్ముతున్నారు. ...

ధనుష్ "ఇడ్లీ కడై" షూటింగ్ పూర్తి !!!

Image
హీరో ధనుష్ నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'ఇడ్లీ కడై'  ఈ చిత్రంలో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ధనుష్ కు ఇది నటుడిగా యాభై రెండో ఫిలిమ్ అలాగే తను డైరెక్ట్ చేస్తోన్న నాలుగో సినిమా ఇదే అవ్వడం విశేషం. ఇటీవల బ్యాంకాక్ లో ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ ఏడాది అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. శ్రీ  వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు ఈ చిత్ర  తెలుగు థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నారు,  ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు, ఇటీవల నిర్మాత చింతపల్లి రామారావు విజయ్ సేతుపతి నటించిన విడుదల 2 చిత్రాన్ని ఇటీవల తెలుగులో రిలీజ్ చేశారు.  రాయన్ సినిమా తరువాత ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేస్తోన్న సినిమా 'ఇడ్లీ కడై' అందుచేత ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో  రాజ్ కిరణ్, అరుణ్ విజయ్ షాలిని పాండే, కీలక పాత్రలలో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రసన్న జీకె ఎడిటర్ గా వర్క్ చేస్తున్న ఈ సినిమాకు కిరణ్ కౌశిక్ ...

Crime and action thriller "Criminal 123" is ready for release this summer !!!

Image
Sri Kanakadurga Pictures banner is producing K. Haimavati in the presence of Baby. B. Divisha Sri, Master Ashrith, K. Geetha as executive producer, Vamsi Krishna, Riyaz Khan, Dinesh, Kalasi Selvan, Vignesh, Gayatri Rima and others in the film Criminal 123. The successful film Rakadan, which was released in Tamil, is now coming to the audience in Telugu as Criminal 123. The film Criminal 123, which has completed post-production and censor procedures, is going to be released in theaters in the first week of May.  This film is directed by Dinesh Kalai, A. Praveen Kumar has composed the music for this film, Manas Babu has provided the cinematography and Gopikrishna has done the editing.  Kakarlamudi Ravindra Kalyan has written the dialogues for this film. The makers are going to release the songs and trailer of this film soon. KJR Pictures Ramakrishna, Kishore, Jayababu are going to release this film in Telugu. The release date is going to be announced soon.

ఈ వేసవిలో విడుదలకు సిద్దంగా ఉన్న క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ "క్రిమినల్ 123" !!!

Image
శ్రీ కనకదుర్గ పిక్చర్స్ బ్యానర్ పై బేబి. బి.డివిష శ్రీ , మాస్టర్ ఆశ్రీత్ ప్రజెన్స్ లో కె.హైమావతి నిర్మాతగా కె. గీత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వంశీ కృష్ణ, రియాజ్ ఖాన్, దినేష్, కలాసి సెల్వన్, విజ్ఞేష్, గాయత్రి రిమ తదితరులు నటించిన చిత్రం క్రిమినల్ 123. తమిళ్ లో విడుదలై విజయం సాధించిన రాకాదన్ చిత్రం ఇప్పుడు తెలుగులో క్రిమినల్ 123 పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది, పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న క్రిమినల్ 123 చిత్రం మే మొదటి వారంలో విడుదల థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  ఈ సినిమాను దినేష్ కలై డైరెక్ట్ చేశారు, ఏ ప్రవీణ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాకు మానస్ బాబు సినిమాటోగ్రఫీ అందించగా గోపికృష్ణ ఎడిటింగ్ చేశారు. కాకర్లమూడి రవీంద్ర కళ్యాణ్ ఈ చిత్రానికి మాటలు రాశారు. త్వరలో ఈ చిత్ర సాంగ్స్, ట్రైలర్ విడుదల చేయబోతున్నారు మేకర్స్. కె.జే.ఆర్ పిక్చర్స్ రామకృష్ణ, కిషోర్, జయబాబు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించబోతున్నారు.

సమంత నిర్మాణంలో మే 9న రాబోతోన్న ‘శుభం’ మూవీ ట్రైలర్ విడుదల

Image
ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నటి-నిర్మాత సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీని మే 9న విడుదల చేయబోతోన్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఆదివారం (ఏప్రిల్ 27) నాడు శుభం చిత్రం నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. శుభం ట్రైలర్‌ను గమనిస్తే.. ఊర్లోని మహిళలంతా కూడా సీరియల్‌ను చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంటారు. దెయ్యం పట్టినట్టుగా మహిళలు ప్రవర్తిస్తుంటే.. వారి నుంచి తప్పించుకునేందుకు ఊర్లో పురుషులంతా కూడా అష్టకష్టాలు పడుతుంటారు. అలాంటి తరుణంలో మాతాజీగా సమంత స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ట్రైలర్‌ మీద మరింత ఇంట్రెస్ట్ కలిగించేలా చేశారు. శుభం ట్రైలర్‌ను చూస్తే ఈ చిత్రంలో హాస్యం, హర్రర్, ఉత్కంఠ, ఎమోషన్స్ ఇలా అన్ని రకాల అంశాల్ని జోడించినట్టుగా కనిపిస్తోంది. శుభం మే 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.   వివేక్ సాగర్ బీజీఎం స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం ప్రధాన ఆకర్షణ కానుందని తెలుస్తోంది.

'పేషన్' ఇంటెన్స్ ఎమోషన్స్ వున్న ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా అద్భుతంగా వుంది. సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది: ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ లో క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల

Image
యంగ్ ట్యాలెంటెడ్ సుధీస్, అంకిత హీరో హీరోయిన్స్ గా అరవింద్ జాషువా దర్శకత్వంలో రూపొండుతున్న ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టొరీ 'పేషన్'. REDANT క్రియేషన్ బ్యానర్ పై నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు.  ఫస్ట్ లుక్ లాంచ్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. అరవింద్ జాషువా ఆనంద్ సినిమా నుంచి నాకు పరిచయం. అప్పటిలోనే తనలో స్టోరీ టెల్లింగ్ రైటింగ్  క్రియేటర్ ఉన్నాడని అనిపించింది. తను పేషన్ అని ఒక నవల రాశారు. అది నేను చదివాను. చాలా బాగుంది. తను వచ్చిన ఫ్యాషన్ బ్యాక్ గ్రౌండ్ గురించి ఇందులో రాశారు. అందుకే చాలా అథెంటిక్ గా  ఉంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అరవింద్  మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. స్క్రిప్ట్ చాలా బాగుంది. నిర్మాతలు అందరూ కొత్తవాళ్లు. వీళ్లంతా చాలా ప్యాషన్ తో సినిమా తీస్తున్నారు. వాళ్ళందరికీ కంగ్రాట్యులేషన్స్. ఈ పోస్టర్ డిజైన్ చాలా బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్.  కొత్త ఫ్లేవర్ తో వచ్చి...

ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక

Image
'రెట్రో' చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: విజయ్ దేవరకొండ  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య కొత్త చిత్రం ప్రకటన కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రెట్రో'. పూజా హెగ్డే కథానాయిక. సూర్య, జ్యోతిక నేతృత్వంలోని 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం, మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. తెలుగునాట ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తుండటం విశేషం. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథి, ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, "అందరికీ నమస్కారం. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సినిమా గురించి మాట్లాడేముందు.. ముందుగా పహల్గాం బాధితులకు నివాళులు. సూర్య అన్న మూవీ ప్రమోషన్ కోసం నేను ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. నేను గజిని సినిమ...

న‌ట‌కిరిటీ డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ చేతుల మీదుగా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఉద‌య‌గిరి ఫ‌యాజ్ ర‌చించిన ‘ర‌క్త‌క‌న్నీరు’ నాగ‌భూష‌ణం పుస్క‌కావిష్క‌ర‌ణ‌

Image
ఎన్నో పాత్ర‌ల‌కు త‌న న‌ట‌న‌తో ప్రాణం పోసిన విల‌క్ష‌ణ న‌టుడు స్వ‌ర్గీయ నాగ‌భూష‌ణం జీవితంలోని వివిధ విశేషాలు, సినీ ప్ర‌యాణానికి సంబంధించిన విష‌యాల‌ను తెలియ‌జేస్తూ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఉద‌య‌గిరి ఫ‌యాజ్ ‘ర‌క్త‌క‌న్నీరు’ నాగ‌భూష‌ణం అనే పుస్త‌కాన్ని ర‌చించారు. ఈ పుస్త‌కావిష్క‌ర‌ణ వెర్స‌టైల్ యాక్ట‌ర్..న‌ట‌కిరిటీ డా.రాజేంద్ర ప్ర‌సాద్ చేతుల మీదుగా ఆయ‌న స్వ‌గృహంలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో పుస్తక రచయిత ఫయాజ్, నాగభూషణం గారి పెద్ద కుమారుడు రాఘవరావు,   పెద్ద కుమార్తె మల్లీశ్వరి, అల్లుడు అరుణ్ కుమార్, రాహిల్ తాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ... న‌ట‌కిరిటీ డా.రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘నా జీవితంలో ఈరోజు ఎంతో అదృష్ట‌మైన రోజు. ఎందుకంటే, విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క రామారావుగారి ఇంట్లో పుట్టే అదృష్టాన్ని ఆ దేవుడు నాకు ప్ర‌సాదించాడు. ఆయ‌న‌తోపాటు మ‌హామ‌హుల‌ను క‌లుసుకునే అవ‌కాశం క‌లిగింది. అందులో అతి ముఖ్య‌మైన వ్య‌క్తి నాగ‌భూష‌ణంగారు. ‘ర‌క్త‌క‌న్నీరు’ నాగ‌భూష‌ణంగారికి నాకు ద‌గ్గ‌రి పోలిక ఏంటంటే, నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు...

హలో బేబీ మూవీ రివ్యూ & రేటింగ్ !!!

Image
ఇటీవల సోలో క్యారెక్టర్ తో సినిమాలు బాగానే వస్తున్నాయి. సోలో క్యారెక్టర్ తో హలో బేబీ సినిమా ఏప్రిల్ 25న (శుక్రవారం) థియేటర్స్ లో విడుదల అయ్యింది, కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ అనే సినిమా తెరకెక్కింది. ఒక్క క్యారెక్టర్ తో హ్యాకింగ్ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.  రమణ కె సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు సుకుమార్.పి సంగీతం అందించారు. సాయిరాం తాటిపల్లి ఈ సినిమాకు ఎడిటర్. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం. కథ: ఆద్య ( కావ్య కీర్తి ) సాప్ట్ వేర్ జాబ్ చేస్తూ ఉంటుంది బెంగళూరులో ... ఇంట్లో ఒక్కతే ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ చేయడం అమ్మతో ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది... ఇంతలో ఆద్య కాలేజీ ఫ్రెండ్ రాహుల్ కాల్ చేస్తాడు.. అప్పటి నుండి ఆద్య కి ప్రాబ్లెమ్ స్టార్ట్ అవుతాయి... ఇంట్లో ఆద్య ఏం చేస్తుందో ఏ డ్రెస్ లో ఉందో అన్ని చెప్పి ఆద్య నీ భయపెడుతూ ఉంటాడు... జాబ్ ప్రాబ్లెమ్ ఫ్రెండ్ కి ప్రాబ్లమ్స్ ఆద్య మదర్ కి ప్రాబ్లెమ్ వోచేలా చేస్తాడు రాహుల్... అసలు రాహుల్ ఎందుకు చేస్తున్నాడు , ఆద్య ఎలా ప్రాబ్లెమ్ ...

హన్సిక మోత్వానీ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ 'గార్డియన్' ఆహాలో స్ట్రీమింగ్‌

Image
సబరి, గురు సరవణన్ దర్శకత్వం వహించిన హన్సిక మోత్వానీ హారర్ థ్రిల్లర్ గార్డియన్.  ఈ చిత్రం తమిళ్ లో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడీ చిత్రాన్ని  భవాని మీడియా ద్వారా ఆహా ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 2024 మార్చి 8న తమిళంలో విడుదలైన గార్డియన్ ఉలిక్కిపడే కథనంతో, కట్టిపడేసే విజువల్స్‌తో,  ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల్నిమంత్రముగ్ధుల్ని చేసింది.  ఈ చిత్రానికి సామ్ సి.ఎస్. అందించిన హారర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కె.ఏ. సక్తివేల్ సినిమాటోగ్రఫీ, అలాగే ఎం. తియాగరాజన్ ఎడిటింగ్ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. గార్డియన్ తెలుగు వెర్షన్‌ ని ఆహా లో మిస్ అవ్వకండి.

జమ్మూ కశ్మీర్‌ పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడి దేశవ్యాప్తంగా

Image
జమ్మూ కశ్మీర్‌ పహల్గాంలో జరిగిన భీకర ఉగ్రదాడి దేశవ్యాప్తంగా విషాద ఛాయలను నింపింది. ఈ ఘటనలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌పై కృష్ణసాయి ఇంట‌ర్నేష‌న‌ల్ చారిట‌బుల్ ట్ర‌స్టు నిర్వ‌హ‌కులు, టాలీవుడ్ హీరో కృష్ణ‌సాయి చ‌లించిపోయారు. ఈ ఘ‌ట‌న‌పై తీవ్రంగా ఖండించారు. ''అత్యంత క్రూరంగా వెంటాడి చంపారు. ఇండియ‌న్ పార‌మిట‌రీ ఫోర్స్ ఏదో సైలెంట్‌గా ఉంద‌ని ఉగ్ర‌వాదులు అనుకుంటే పొర‌పాటే, భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ గారు చెప్పిన‌ట్టు ప్ర‌పంచం ఆశ్చ‌ర‌పోయేలా భారత్‌ గట్టిబదులిస్తుంది. వారిని వెంటాడి ప్ర‌తీకార చ‌ర్య ఉంటుంది. శాంతి కోరుకునే దేశాన్ని స‌హ‌నం ప‌రీక్షించేలా వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్దు. మున్ముందు ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా దేశ‌మంతా ఒక్క‌టిగా నిల‌వాలి'' అని పిలుపునిచ్చారు. పహల్గామ్‌ మంగళవారం ఒక్కసారిగా రక్తసిక్తంగా మారింది. పర్వతాల మధ్య ప్రశాంతతను చీల్చిన ఉగ్రవాద దాడి దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. ఈ క్రమంలో పర్యాటకం కోసం వెళ్లిన అమాయకుల ప్రాణాలను ఉగ్రదాడి బలితీసుకుంది

ముక్కురాజు మాస్టర్ వేసిన పునాది చాలా గొప్పది: ఆర్ నారాయణమూర్తి

Image
*ముక్కురాజు మాస్టర్ లేకపోతే ఫిల్మ్ ఫెడరేషనే లేదు: తమ్మారెడ్డి భరద్వాజ* *ఘనంగా ముక్కురాజ్ మాస్టర్ విగ్రహావిష్కరణ వేడుక* టీఎఫ్‌టీడీడీఏ ఏర్పాటై 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విగ్రహావిష్కరణతో వ్యవస్థాపక అధ్యక్షుడిని గౌరవించుకున్న సభ్యులు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(టీఎఫ్‌టీడీడీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిరాజు రాజంరాజు  అలియాస్ ముక్కురాజు మాస్టర్ విగ్రహ ఆవిష్కరణ వేడుక బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. టీఎఫ్‌టీడీడీఏ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ముక్కు రాజు మాస్టర్ విగ్రహాన్ని ప్రముఖ దర్శకనిర్మాత ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, వల్లభనేని అనిల్ కుమార్, టీఎఫ్‌టీడీడీ అధ్యక్షుడు జోసెఫ్ ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి దేవర శ్రీనివాస్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డాన్సర్స్ యూనియన్ ఏర్పాటై 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముక్కురాజు మాస్టర్ విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు టీ...

ముక్కురాజు మాస్టర్ వేసిన పునాది చాలా గొప్పది: ఆర్ నారాయణమూర్తి

Image
ముక్కురాజు మాస్టర్ లేకపోతే ఫిల్మ్ ఫెడరేషనే లేదు: తమ్మారెడ్డి భరద్వాజ ఘనంగా ముక్కురాజ్ మాస్టర్ విగ్రహావిష్కరణ వేడుక టీఎఫ్‌టీడీడీఏ ఏర్పాటై 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విగ్రహావిష్కరణతో వ్యవస్థాపక అధ్యక్షుడిని గౌరవించుకున్న సభ్యులు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(టీఎఫ్‌టీడీడీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిరాజు రాజంరాజు  అలియాస్ ముక్కురాజు మాస్టర్ విగ్రహ ఆవిష్కరణ వేడుక బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. టీఎఫ్‌టీడీడీఏ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ముక్కు రాజు మాస్టర్ విగ్రహాన్ని ప్రముఖ దర్శకనిర్మాత ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, వల్లభనేని అనిల్ కుమార్, టీఎఫ్‌టీడీడీ అధ్యక్షుడు జోసెఫ్ ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి దేవర శ్రీనివాస్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డాన్సర్స్ యూనియన్ ఏర్పాటై 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముక్కురాజు మాస్టర్ విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు టీఎఫ్‌...

ఘ‌నంగా 'క‌ర్మ‌ణి' మూవీ ప్రారంభోత్స‌వం

Image
నాగ‌మ‌హేష్, రూపాలక్ష్మి, 'బాహుబ‌లి' ప్ర‌భాక‌ర్, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు ప్రధాన పాత్ర‌ల్లో, ర‌మేష్ అనెగౌని ద‌ర్శ‌క‌త్వంలో, మంజుల చ‌వ‌న్, ర‌మేష్‌గౌడ్ అనెగౌని నిర్మాత‌లుగా, రామారాజ్యం మూవీ మేక‌ర్స్, అనంతల‌క్ష్మి ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ 'క‌ర్మ‌ణి'. ఈ మూవీ తాజాగా ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా దేవుని చిత్ర‌ప‌టాల‌పై సీనియ‌ర్ న‌టుడు నాగమ‌హేష్ క్లాప్ కొట్టారు. నిర్మాత మంజుల చ‌వ‌న్ కెమెరా స్విచాన్ చేశారు. 2022లో డైరెక్ట‌ర్ ర‌మేష్ అనెగౌని తెర‌కెక్కించిన‌ 'మ‌న్నించ‌వా..' మూవీకి అప్ప‌ట్లో ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆధర‌ణ ల‌భించింది. అదే ఉత్సాహంతో, అదే టీమ్‌తో క‌లిసి చేస్తున్న తాజా క్రేజీ ప్రాజెక్ట్ 'క‌ర్మ‌ణి'. ఈ సినిమా ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ద‌ర్శ‌కుడు ర‌మేష్ అనెగౌని మాట్లాడుతూ.. ''ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో ప్రొరంభోత్స‌వం జ‌రిగే సినిమాలు సూప‌ర్ హిట్ కొడ‌తాయి. ఈ సెంటిమెంట్ మా  'క‌ర్మ‌ణి' సినిమాకు కూడా క‌లుగుతుంద‌ని విశ్వాసం ఉంది. మే ...

"Hello Baby" Releasing in Theaters on April 25

Image
Recently, films with solo characters have been gaining popularity. One such film, Hello Baby, featuring a solo character, is set to release in theaters on April 25. Produced by Kandregula Adinarayana and directed by Ram Gopal Ratnam, the movie stars Kavya Keerthi in the lead and only role. Based on a hacking-themed storyline, Hello Baby is a unique attempt featuring a single-character narrative. Cinematography for the film is handled by Ramana K, while music is composed by Sukumar P. Sai Ram Tatipalli is the editor. With its fresh concept, Hello Baby is all set for a worldwide release on April 25. The film's motion poster, songs, and trailer, which were released recently, received a good response. The film unit is confident that the movie will entertain the audience. Recently, at the Puraskar Nandi Awards ceremony held in Hyderabad, Kavya Keerthi won the Puraskar Nandi Award for her performance in Hello Baby. She received the award from Film Chamber of Commerce Chairman...

ఏప్రిల్ 25న "శివ శంభో" చిత్రం విడుద‌ల‌

Image
▪ ఘ‌నంగా "శివ శంభో" ప్రీరిలీజ్ ఈవెంట్  హైద‌రాబాద్:  తెలుగు వెండితెర‌పై మ‌రో భ‌క్తిర‌స చిత్రం క‌నువిందు చేయ‌బోతోంది. అనంత ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కృష్ణ ఇస్లావత్, సాయి చక్రవర్తి, కేశవర్థిని బేబీ రిషిత ప్ర‌ధాన పాత్ర‌ల్లో, నర్సింగ్ రావు ద‌ర్శ‌క‌త్వంలో బొజ్జ రాజ గోపాల్, దోరవేటి సుగుణ నిర్మించిన చిత్రం "శివ శంభో". తనికెళ్ళ భరణి, సుమన్ ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రం ఈనెల (ఏప్రిల్) 25న థియేట‌ర్‌ల‌లో విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించింది.  ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డా. గోరటి వెంకన్న, బీజేపీ నేత, జంతు ప్రేమికుడు చీకోటి ప్ర‌వీణ్, ప్ర‌ముఖ న‌టుడు, ర‌చ‌యిత‌ డా. త‌నికెళ్ల భ‌ర‌ణి, బర్దీపుర పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వర గిరి స్వామీజీ, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, త‌దిత‌రులు పాల్గొని చిత్ర‌యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ న‌టుడు, ర‌చ‌యిత‌ త‌నికెళ్ల భ‌ర‌ణి మాట్లాడుతూ.. చిత్ర‌యూనిట్ స‌భ్యులంద‌రికి పేరుపేరున‌ శుభాకాంక్ష‌లు, అభినంద‌న...

ARM & అన్వెషిప్పిన్ కండెతుమ్ చిత్రానికి గాను టోవినో థామస్ 48వ ఉత్తమ నటుడు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నాడు

Image
గోల్డెన్ హార్స్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్, తైవాన్‌లో టోవినో థామస్ ARM & 2018 సినిమా ప్రదర్శనకు సంచలనాత్మక స్పందన తన బహుముఖ ప్రజ్ఞ మరియు ఆకర్షణీయమైన స్క్రీన్ చిత్రణలకు ప్రశంసలు పొందిన టోవినో థామస్, భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారారు. ప్రామాణికతతో విభిన్న పాత్రలలో పూర్తిగా మునిగిపోయే సామర్థ్యంతో ప్రసిద్ధి చెందిన టోవినో, వివిధ శైలులలో ప్రేక్షకులను లోతుగా ప్రతిధ్వనించే ప్రదర్శనలను అందించడంలో ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు, టోవినో థామస్ మలయాళ సినిమాను ఇంతకు ముందు ఎన్నడూ చేయని ఎత్తులకు చేరుకునేలా చేస్తున్నాడు. అతని ఇటీవలి బ్లాక్‌బస్టర్‌లు, ARM మరియు 2018 మూవీ, తైవాన్, తైవాన్‌లో జరిగిన గోల్డెన్ హార్స్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పూర్తిగా నిండిన ప్రదర్శనలతో ప్రదర్శించబడ్డాయి. ఈ అద్భుతమైన చిత్రాల శక్తివంతమైన కథనం మరియు టోవినో థామస్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఇటీవల ARM మరియు అన్వెషిప్పిన్ కండెతుమ్ చిత్రాలకు ఉత్తమ నటుడి విభాగంలో కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నారు.  అంతర్జాతీయ వేదికపై మరియు స్వదేశంలో టోవినో థామస్‌కు ఇది ...

ARM & అన్వెషిప్పిన్ కండెతుమ్ చిత్రానికి గాను టోవినో థామస్ 48వ ఉత్తమ నటుడు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నాడు

Image
గోల్డెన్ హార్స్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్, తైవాన్‌లో టోవినో థామస్ ARM & 2018 సినిమా ప్రదర్శనకు సంచలనాత్మక స్పందన తన బహుముఖ ప్రజ్ఞ మరియు ఆకర్షణీయమైన స్క్రీన్ చిత్రణలకు ప్రశంసలు పొందిన టోవినో థామస్, భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారారు. ప్రామాణికతతో విభిన్న పాత్రలలో పూర్తిగా మునిగిపోయే సామర్థ్యంతో ప్రసిద్ధి చెందిన టోవినో, వివిధ శైలులలో ప్రేక్షకులను లోతుగా ప్రతిధ్వనించే ప్రదర్శనలను అందించడంలో ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు, టోవినో థామస్ మలయాళ సినిమాను ఇంతకు ముందు ఎన్నడూ చేయని ఎత్తులకు చేరుకునేలా చేస్తున్నాడు. అతని ఇటీవలి బ్లాక్‌బస్టర్‌లు, ARM మరియు 2018 మూవీ, తైవాన్, తైవాన్‌లో జరిగిన గోల్డెన్ హార్స్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పూర్తిగా నిండిన ప్రదర్శనలతో ప్రదర్శించబడ్డాయి. ఈ అద్భుతమైన చిత్రాల శక్తివంతమైన కథనం మరియు టోవినో థామస్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఇటీవల ARM మరియు అన్వెషిప్పిన్ కండెతుమ్ చిత్రాలకు ఉత్తమ నటుడి విభాగంలో కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నారు.  అంతర్జాతీయ వేదికపై మరియు స్వదేశంలో టోవినో థామస్‌కు ఇది ...

డిఫరెంట్ మూవీ రివ్యూ & రేటింగ్ !!!

Image
వండర్ బ్రదర్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ లో జి. ఎన్.నాష్, అజీజ చీమరువ, ప్రట్టీ జో, సన, రోబర్ట్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం డిఫరెంట్. ఎన్.ఎస్.వి.డి  శంకరరావు నిర్మాతగా డ్రాగన్ (ఉదయ భాస్కర్) దర్శకత్వంలో లియోన్ ఆర్ భాస్కర్ కెమెరామెన్ గా చేస్తున్నా ఈ సినిమాకు నిహల్ సంగీతం అందించారు. ఎస్ కే ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఏప్రిల్ 18 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం. కథ: న్యూజిలాండ్ లో వరుసగా హత్యలు జరుగుతు ఉంటాయి.. చనిపోయినవారు అందరు అమ్మాయిలే.. సిటీ లో ఒక సైకో తిరుగుతున్నాడు జాగ్రత్త ఉండాలి అని న్యూస్ లో చెప్తుంటారు.. పోలీస్ అధికారులు సిటీ మొత్తం తిరుగుతూ ఉంటారు.. ఇంతలో హీరో బాబ్ ( నితిన్ నాష్) ఒక్కడే ఉంటాడు.. అదే ఇంట్లో బాబ్ అమ్మ సన ఒక రూమ్ లో లాక్ చేసుకొని ఉంటుంది.. ఒక ముగ్గురు అమ్మాయిలు బాబ్ ఇంట్లోకి చొరబడి బాబ్ నీ చంపుదాం అని చూస్తారు..  అసలు బాబ్ ఒక్కడే ఎందుకు ఉంటాడు.. వల్ల అమ్మ రూమ్ లో ఎందుకు ఉంటుంది.. ఈ ముగ్గురు అమ్మాయిలు ఎవరు... సిటీ లో హత్యలు చేసేది ఎవరు అనేదే కథ  విశ్లేషణ: హీరో ని...

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ పవర్ఫుల్ విమెన్ సెంట్రిక్ థ్రిల్లర్ శివంగి ఈరోజు నుంచి ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్

Image
ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలలో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వం వహించిన  పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ శివంగి. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు.  ఇటివలే థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా భవానీ మీడియా ద్వారా ఆహా ఓటీటీ లో స్ట్రీమ్ అవుతుంది. ఈరోజు నుంచి తెలుగు వర్షన్ స్ట్రీమ్ అవుతుండగా రేపటి నుంచి తమిళ వెర్షన్ ప్రసారం కానుంది. ఆద్యంతం ఆకట్టుకునే గ్రిప్పింగ్గా సాగే ఈ థ్రిల్లర్లో ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లు అందించారు. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుల్ని కట్టిపడేసే స్క్రీన్ ప్లే తో ఈ చిత్రం ఆహా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయనుంది. ఈ వీకెండ్ లో డోంట్ మిస్ ఇట్.

మధురం”ట్రైలర్ విడుదల చేసిన మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్

Image
*"మధురం”చిత్రం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్ యంగ్ హీరో ఉదయ్ రాజ్,  వైష్ణవి సింగ్ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై   టాలెంటెడ్  డైరెక్టర్   రాజేష్ చికిలే దర్శకత్వంలో  అభిరుచి గల నిర్మాత  యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం మధురం.  ఎ మెమొరబుల్ లవ్ అనేది ట్యాగ్ లైన్. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం.. ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌ను సక్సెస్ ఫుల్ మాస్  డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేశారు. అనంతరం డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ ‘‘ట్రైలర్ చాలా ప్లెజెంట్‌గా ఉంది. మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో బంగార్రాజు  ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మధురం చిత్రం మధురమైన విజయం సాధించి హీరోగా ఉదయ్ రాజ్‌కి, దర్శకుడిగా రాజేష్‌కి,  మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’’ అని చెప్పారు.  ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె, దర్శకులు విజయ్ కుమార్ క...

అంబేద్కర్ జయంతి సందర్భంగా అగ్రహారంలో అంబేద్కర్ ఫస్ట్ లుక్!

Image
మన రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా... "అగ్రహారంలో అంబేద్కర్" సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. తెలంగాణ అధికారపక్ష ఎమ్.ఎల్.సి అద్దంకి దయాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో పురస్కారాలు అందుకున్న ఈ చిత్రాన్ని రామోజీ - లక్షమోజి ఫిల్మ్స్ పతాకంపై మంథా కృష్ణచైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. హీరో కూడా ఆయనే కావడం విశేషం. మెల్లగా మరుగున పడుతున్న అంబేద్కర్ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు పూర్తి సమయ సహకారాలు అందిస్తామని,"మన దేశ రాజ్యాంగ సృష్టికర్త అయిన అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ప్రతి స్కూల్ లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని" ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ పిలుపునిచ్చారు.  ఇంకా ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు చంద్రమహేష్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సంతోషం సురేష్, సీనియర్ హీరో రాంకి, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ చైర్మన్ హరి గోవింద ప్రసాద్, మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ సి.యి.ఓ రాహుల్, రాయల్ రిడ్జ్ ప్రాపర్టీస్ సి.యి.ఓ శ...

DIFFERENT English movie Trailer Released, All set for April 18th Theatrical release !!!

Image
Under the banner of Wonder Brothers International Films Pvt. Ltd., the film Different stars G.N. Nash, Azeez Cheemaruv, Pretty Jo, Sana, and Robert in lead roles. Produced by N.S.V.D. Shankara Rao and directed by Dragon (Uday Bhaskar), the cinematography is handled by Leon R. Bhaskar, and music is composed by Nihal. This film boasts a team of talented technicians and is considered a top-quality production. The makers have now released the trailer of the film. The trailer looks very impressive — a suspense thriller, Different is all set to release in theaters on April 18. With international standards and superb visuals, the trailer hints at a gripping movie experience. Different is a Hollywood film made by Telugu producer N.S.V.D. Shankara Rao. The project was initiated with the intention of delivering quality cinema. The team believes that if the story and content are strong, audiences will always support such films — and Different aims to be just that. The film, releasing ...

మైనే ప్యార్ కియా అధికారిక ఫస్ట్ లుక్ విడుదల: ఈ జూలైలో తెరపైకి రానున్న రొమాంటిక్ కామెడీ-థ్రిల్లర్

Image
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మలయాళ చిత్రం మైనే ప్యార్ కియా తన ఫస్ట్ లుక్‌ను అధికారికంగా ఆవిష్కరించింది, ఇది రొమాన్స్, కామెడీ మరియు సస్పెన్స్‌లను మిళితం చేసే థ్రిల్లింగ్ మరియు నవ్వులతో నిండిన సినిమా ప్రయాణాన్ని చూపిస్తుంది. నూతన దర్శకుడు మరియు రచయిత ఫైజల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్పైర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంజు ఉన్నితన్ నిర్మించారు, ఇది ఇండస్ట్రీ హిట్ మందాకిని తర్వాత కంపెనీ యొక్క నాల్గవ ప్రధాన వెంచర్‌గా గుర్తించబడింది. కంటెంట్-రిచ్ కమర్షియల్ సినిమాను విజేతగా నిలిపినందుకు పేరుగాంచిన స్పైర్, ఈ శైలిని వంచించే ఎంటర్‌టైనర్‌తో తన వారసత్వాన్ని కొనసాగిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ అద్భుతమైనది మరియు కథన సూచనలతో నిండి ఉంది. హృదు హరూన్ మరియు ప్రీతి ముకుందన్ రక్తంతో తడిసిన మరియు గొప్పగా రూపొందించిన ఎరుపు పూల నేపథ్యంలో స్టైలిష్‌గా కనిపిస్తారు.  చిరిగిన ముండు, ఉత్సాహభరితమైన చొక్కాలో బరువైన హృదు, మనుగడకు గుర్తుగా గాయాలను కలిగి ఉండగా, తెల్లటి గౌనులో కప్పబడిన ప్రీతి, చలినిచ్చే ప్రశాంతతతో రక్తంతో తడిసిన కత్తిని పట్టుకుంది. ఈ పోస్టర్ దీనికి విరుద్ధంగా ఒక మాస్టర్ క్లాస్, అమాయకత్వాన్...

హిలేరియస్ ఫన్ రైడ్ మూవీ "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" నుంచి 'ఏదో ఏదో..' లిరికల్ సాంగ్ రిలీజ్

Image
రాహుల్ విజయ్, నేహా పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నసినిమా "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్". ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" సినిమాను హిలేరియస్ ఫన్ రైడ్ గా నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ మూవీ నుంచి 'ఏదో ఏదో..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. 'ఏదో ఏదో..' రిలికల్ సాంగ్ కు పూర్ణాచారి క్యాచీ లిరిక్స్ అందించగా, సురేష్ బొబ్బిలి బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. కార్తీక్, హరిణి మంచి ఫీల్ తో పాడారు. 'ఏదో ఏదో..' సాంగ్ ఎలా ఉందో చూస్తే...'ఏదో ఏదో ఏదో జరిగెనే యెద లోపలా, ఏవో ఏవో కలలు విరిసెనే, నిన్నా మొన్నా లేదే అరే ఏంటిలా, ఉన్నట్టుండి ముంచేశావిలా, మనసే ముసుగులు తీసే, అడుగులు వేసే బయటకు నీతోనే, కలిసే నిమిషం వణికే, పెదవులు పలికే తకధిమి తందానే...' అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట. *నటీనటులు* - రాహుల్ విజయ్, నేహా పాండే, అజయ్ ఘోష్, మురళీధర్ గౌడ్, గెటప్ శ్రీను, రచ్...

సిలికాన్‌లోని పెర్ప్లెక్సిటీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడతో పాటుగా సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

Image
ప్రఖ్యాత నటుడు, నిర్మాత, దర్శకుడు కమల్ హాసన్ ప్రస్తుతం సిలికాన్‌లోని AI-ఆధారిత రీసెర్చ్ సెంటర్ అయిన పెర్ప్లెక్సిటీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిశారు. భారతీయ సినిమా పరిశ్రమలో గత కొన్ని దశాబ్దాలుగా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ, సినీ పరిశ్రమ ఎదుగుదలకు కృషి చేస్తున్న కమల్ హాసన్ ఇలా భవిష్యత్తుని శాసించబోతోన్న ఏఐ రీసెర్చ్ సెంటర్‌ను సందర్శించడంతో మరిన్ని విప్లవాత్మక మార్పుల్ని తీసుకు రాబోతోన్నారు. ఈ సందర్శన తర్వాత కమల్ హాసన్ సోషల్ మీడియాలో.. ‘సినిమా నుండి సిలికాన్ వరకు ప్రతీ ఒక్కటీ నిత్యం అభివృద్ది చెందుతూనే ఉంటాయి. ఎంత కనిపెట్టినా, ఏం చేసినా కూడా ఇంకా ఏదో చేయాలని, కనిపెట్టాలనే ఆ కూతుహలం, ఆ దాహం ఇంకా మనలో ఉంటూనే ఉంటుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని పెర్ప్లెక్సిటీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంతో నాలో ఇంకా కొత్త ఆలోచనలకు ప్రేరణ లభించినట్టు అనిపిస్తుంది. అరవింద్ శ్రీనివాస్‌, అతని బృందం కలిసి భవిష్యత్తును నిర్మించడంలో మన భారతీయ చాతుర్యం ప్రకాశిస్తుంది’ అని అన్నారు. ఈ భేటీపై అరవింద్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘పర్ప్లెక్సిటీ కార్యాలయంల...

వృషభ మూవీ రివ్యూ & రేటింగ్ !!!

Image
వి.కె.మూవీస్‌ పతాకంపై యుజిఓస్‌ ఎంటర్టైన్మెంట్స్‌ సగర్వ సమర్పణలో అశ్విన్‌ కామరాజ్‌ కొప్పల దర్శకత్వంలో ఉమాశంకర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం వృషభ. నిర్మాత ఉమాశంకర్‌రెడ్డి కథను అందించిన ఈ చిత్రంలో జీవన్‌, అలేఖ్య హీరో, హీరోయిన్‌లు.. కృష్ణా అండ్ శ్రీలేఖ ముఖ్యపాత్రలో చేశారు..ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం. కథ: 1960 సంవత్సరంలో, ఒక మర్మమైన వ్యాధి పశువులను సోకింది, ఇది వాటి వేగవంతమైన మరణానికి దారితీసింది మరియు భారతదేశంలో తీవ్రమైన పోషకాహార లోపానికి భయపడి శాస్త్రీయ సమాజానికి పెద్ద సవాలుగా మారింది. శాస్త్రవేత్తలు వారి వారి ప్రయోగశాలలలో పరిశోధన ప్రయత్నాలను ప్రారంభించారు, కానీ ఫలించలేదు. శాస్త్రవేత్త సుశ్రుతానందన్ వంటి ప్రముఖుడు కూడా పరిష్కారం లేకుండా అనేక మార్గాల తర్వాత విఫలమయ్యాడు. అతను హిమాలయాలలో గౌరవనీయమైన రుద్రాక్ష దిగంబర స్వామిని కనుగొనడానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభించాడు, ఈ మర్మమైన వ్యాధికి క్లోమం వలె ప్రకృతి శక్తిని నమ్మాడు. పరీక్షలు మరియు కష్టాలను భరించిన తర్వాత సుశ్రుతానందన్ మరియు అతని సహాయకుడు అడగకుండానే ధ్యానంలో మునిగిపోయిన అఘోర రుద్రకేశ దిగంబర స్వామిని చేరుకున్నారు. స్వా...

నటుడు రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా 'ఏరువాక ఆగే' పాట విడుదల, 'జగమెరిగిన సత్యం' ఏప్రిల్ 18న థియేటర్స్ లో సందడి !!!

Image
అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన చిత్రం జగమెరిగిన సత్యం. అచ్చ విజయ భాస్కర్ నిర్మించిన ఈ చిత్రానికి తిరుపతి పాలే దర్శకత్వం వహించారు. అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని ఏప్రిల్18న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ మూవీ నుండి ఏరువాక ఆగే అనే సాంగ్ ను ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ నేపద్యంలో 1994 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తిరుపతి పాలే. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మాత అచ్చ విజయ భాస్కర్ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. సురేష్ బొబ్బిలి అందించిన ఈ చిత్ర పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.... జగమెరిగిన సత్యం టైటిల్ బాగుంది. నేను విడుదల చేసిన ఏరువాక ఆగే సాంగ్ ఎమోషనల్ గా ఉంది. మంచి కథ కథనాలతో వస్తోన్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సినిమా సక్సెస్ అయ్యి చిత్ర యూనిట్ అందరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను అన్నార...

అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్, అఖిల్ అక్కినేని తదుపరి చిత్రం LENIN; పవర్‌ఫుల్ టైటిల్ గ్లింప్స్ విడుదల

Image
తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప‌రిచ‌యం అక్క‌ర్లేని ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ‌లు అన్న‌పూర్ణ స్టూడియోస్‌, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్. యంగ్ అండ్ డైన‌మిక్ అఖిల్ అక్కినేని తాజా సినిమాను నిర్మిస్తున్నాయి. అఖిల్ 6ని అక్కినేని నాగార్జున‌, నాగ‌వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్కినేని అఖిల్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని అఖిల్ 6వ చిత్రానికి లెనిన్ అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ని ప్ర‌క‌టించారు. ముర‌ళీ కిశోర్ అబ్బూరు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు ముర‌ళీకిశోర్ అబ్బూరు. ఇంట‌న్స్, యాక్ష‌న్ ప్యాక్డ్ ఎక్స్ పీరియ‌న్స్ తో రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో రోమాలు నిక్క‌బొడుచుకునేలా సాగింది లెనిన్ గ్లింప్స్. టైటిల్ గ్లింప్స్ పవర్‌ఫుల్ విజువల్స్‌తో ప్రారంభమయింది.  ఆధ్యాత్మిక అంశాల‌ను చొప్పిస్తూ ఆద్యంతం ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు మేక‌ర్స్. అఖిల్ అక్కినేని... స్ట‌న్నింగ్ లెనిన్ కేర‌క్ట‌ర్‌కి అద్భుతంగా సూట్ అయ్యారు. ఆయ‌న ద‌ట్ట‌మైన మీసం, పొడ‌వాటి జుట్టు, మ్యాచో అవ‌తార్‌కి ప‌క్కాగా సూట్ అయ్యాయి.  స్ట్రైకింగ్ స్క్రీన్ ప్రెజెన...

జగమెరిగిన సత్యం ఏప్రిల్ 18న థియేటర్స్ లో విడుదల, చిత్ర యూనిట్ కు ఆకాష్ జగన్నాధ్ బెస్ట్ విషెస్ !!!

Image
అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన చిత్రం జగమెరిగిన సత్యం. అచ్చ విజయ భాస్కర్ నిర్మించిన ఈ చిత్రానికి తిరుపతి పాలే దర్శకత్వం వహించారు. అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని ఏప్రిల్18న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ నేపద్యంలో 1994 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తిరుపతి పాలే. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మాత అచ్చ విజయ భాస్కర్ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. సురేష్ బొబ్బిలి అందించిన ఈ చిత్ర పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా హీరో ఆకాష్ జగన్నాధ్ మాట్లాడుతూ... జగమెరిగిన సత్యం టైటిల్ బాగుంది. సాంగ్స్ ప్రోమోస్ బాగున్నాయి. మంచి కథ కథనాలతో వస్తోన్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సినిమా సక్సెస్ అయ్యి చిత్ర యూనిట్ అందరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను అన్నారు. ఏప్రిల్ 18న ఈ సినిమాను అందరూ థియేటర్స్ లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నటీనటులు: అవిన...

వైభవంగా రచయిత సత్యదేవ్ జంగా పుట్టినరోజు వేడుకలు !!!

Image
టాలెంటెడ్ రైటర్ సత్యదేవ్ జంగా నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాకు కథను అందించారు. ఏప్రిల్ 6న తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ కార్యక్రమంలో దర్శకుడు మారుతి, నిర్మాత రాధ మోహన్, సినిమాటోగ్రఫర్ కె.కె.సెంథిల్ కుమార్, రచయితలు డార్లింగ్ స్వామి, లక్ష్మీ భూపాల, బివిఎస్ రవి, సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్, ఆర్ ఆర్ ధ్రువన్, సింగర్ శ్రీరామ చంద్ర, నటులు రచ్చ రవి, అశ్విన్ బాబు, సింగర్ కౌసల్య, దర్శకులు వీర శంకర్, రచయిత కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. రచయిత సత్యదేవ్ జంగా నేను ఏ ఫిలిం బై అరవింద్ సినిమా కథ రచయితగా పరిచయం అయ్యారు, ఆ సినిమా తరువాత ఆదిత్య మ్యూజిక్ కంపెనీలో సీనియర్ మేనేజర్ గా 20 ఏళ్ళు వర్క్ చేశారు. టాప్ సింగర్స్ తో 200 ప్రవేట్ ఆల్బమ్స్ చేశారు.  ఆ తరువాత నాని సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగా రాయ్ సినిమాకు కథ అందించారు. ఈ సినిమా ద్వారా సత్యదేవ్ జంగా కు రచయితగా మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ఎంఎల్ఏ , నేనే రాజు నేనే మంత్రి నిర్మాత భరత్ చౌదరి గారి కరణ్ సి ప్రొడక్షన్స్ లో ఆకెళ్ల వంశీ దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ సినిమాకు కథ అందించబోతున్నారు. ఆయన అన్ని రకాల జానర్స్ లో కథల...

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల !!!

Image
 ది ట్రయల్ చిత్రం (2023) లో థియేటర్స్ లో విడుదలై విజయం సాధించిన తర్వాత, నిర్మాతలు ఫ్రాంచైజీలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తదుపరి భాగం కోసం "ది ట్రయల్: షాడో డెట్" అనే కాన్సెప్ట్ పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. దృశ్యపరంగా ఆకర్షణీయం గా కనిపిస్తున్న ఈ పోస్టర్ ది ట్రయల్ కథ అసలు నీడల్లోకి లోతుగా మునిగిపోయే చిల్లింగ్ ప్రీక్వెల్‌ను సూచిస్తుంది. నవంబర్ 26, 2023న థియేటర్లలో విడుదలైన ది ట్రయల్ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. తక్కువ థియేటర్లలో విడుదలైనప్పటికీ, ఈ చిత్రం డిజిటల్ లో లాభాలను సాధించింది. ఇది జనవరి 9, 2024న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయడం ప్రారంభించి, అక్కడ ఇది అద్భుతమైన వీక్షకుల సంఖ్యను సంపాదించి మంచి హిట్‌గా నిలిచింది. బడ్జెట్ రికవరీ మరియు లాభదాయకత పరంగా ఉండటంతో ఈ కథా ప్రపంచాన్ని విస్తరించడానికి నిర్మాతలు ముందడుగు వేశారు.  ఈ ట్రయల్ ప్రపంచంలో మొదటి భాగం ఆరంభం కాకముందే ప్రారంభమయ్యే కథ ది ట్రయల్ : షాడో డెట్. దాని నైతిక సందిగ్ధతలు మరియు పరిశోధనాత్మక లోతుతో ప్రేక్షకులను ఆకర్షించినప్పటికీ, “షాడో డెట్” మొదటి సినిమా కథనానికి దారితీసిన సంఘటనలను అన్వేషిస్తుందని...