ధనుష్ "ఇడ్లీ కడై" షూటింగ్ పూర్తి !!!


హీరో ధనుష్ నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'ఇడ్లీ కడై'  ఈ చిత్రంలో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ధనుష్ కు ఇది నటుడిగా యాభై రెండో ఫిలిమ్ అలాగే తను డైరెక్ట్ చేస్తోన్న నాలుగో సినిమా ఇదే అవ్వడం విశేషం. ఇటీవల బ్యాంకాక్ లో ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ ఏడాది అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది.

శ్రీ  వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు ఈ చిత్ర  తెలుగు థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నారు,  ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు, ఇటీవల నిర్మాత చింతపల్లి రామారావు విజయ్ సేతుపతి నటించిన విడుదల 2 చిత్రాన్ని ఇటీవల తెలుగులో రిలీజ్ చేశారు. 

రాయన్ సినిమా తరువాత ధనుష్ నటిస్తూ డైరెక్ట్ చేస్తోన్న సినిమా 'ఇడ్లీ కడై' అందుచేత ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో  రాజ్ కిరణ్, అరుణ్ విజయ్ షాలిని పాండే, కీలక పాత్రలలో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రసన్న జీకె ఎడిటర్ గా వర్క్ చేస్తున్న ఈ సినిమాకు కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వండర్ బార్ ఫిలిమ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్ పై ధనుష్, ఆకాష్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

శ్రీ  వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ రాజావారు త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి త్వరలో రాబోతున్న సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ !!!