Posts

స్టూడియో గ్రీన్ ఫిలింస్ నిర్మాణంలో దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్న చియాన్ విక్రమ్ "తంగలాన్" సినిమా ట్రైలర్ ఈ నెల 10న రిలీజ్

Image
చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ "తంగలాన్". ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. "తంగలాన్" సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. "తంగలాన్" సినిమా త్వరలోనే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "తంగలాన్" సినిమా ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ నెల 10వ తేదీన "తంగలాన్" ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్  వచ్చింది. "తంగలాన్" సినిమా కోసం విక్రమ్ మారిపోయిన తీరు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. "తంగలాన్" ట్రైలర్ పై కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.

త్రిష టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ‘బృంద’ క్రైమ్‌ థ్రిల్లర్‌ సీరీస్‌ టీజర్‌ విడుదల చేసిన సోనీ లివ్‌

Image
అంతా ముగిసిపోయిందనుకున్న సమయంలో, వెలుగు రేఖలా కనిపించింది ఆమె ఉనికి. అదెలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే, చెడు మీద మంచి సాధించిన విజయాన్ని ఆస్వాదించాలంటే మీరు సిద్ధం కావాల్సిందే. సోనీ లివ్‌లో ఆగస్టు 2న బృంద వెబ్‌సీరీస్‌ విడుదల కానుంది. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీలో ఈ సీరీస్‌ విడుదల కానుంది.  సీరీస్‌ రచయిత, దర్శకుడు సూర్య మనోజ్‌ వంగాల మాట్లాడుతూ ‘సోనీ లివ్‌’ ద్వారా ప్యాన్‌ ఇండియా ఆడియన్స్‌ని బృంద సీరీస్‌తో పలకరించడానికి నాకు థ్రిల్‌గా ఉంది. బృంద ఆద్యంతం సస్పెన్స్ తో సాగుతుంది. అనూహ్యమైన మలుపులు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. బృంద సీరీస్‌ చూస్తున్నంత సేపు ఆసక్తిగా, ఉత్కంఠ రేకెత్తించేలా ఉండటమే కాదు, తాము అప్పటిదాకా నమ్ముతున్న నమ్మకాల మీద కూడా ఫోకస్‌ పెరుగుతుంది. అత్యద్భుతమైన, శక్తిమంతమైన, ఫీమేల్‌ లీడ్‌ నెరేటివ్‌ స్టోరీతో తెరకెక్కింది బృంద. ఈ సీరీస్‌ని డైరక్ట్ చేయడం ఆనందదాయకం.  కథానుగుణంగా బృంద పాత్రలో అత్యద్భుతమైన లేయర్స్ ని జనాలు విట్‌నెస్‌ చేస్తారు. త్రిషగారితో పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పటిదాకా ఈ జోనర్‌లో వచ్చిన సినిమాలకు సరికొత్త నిర్వచనం చెప్పేలా ఉ

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

Image
అజయ్, రవిప్రకాశ్, హర్షిణి, మాండవియా సెజల్, చమ్మక్‌ చంద్ర, చిత్రం శ్రీను ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘కేస్‌ నం. 15’. బీజీ వెంచర్స్‌ పతాకంపై స్వీయదర్శకత్వంలో తడకల వంకర్‌ రాజేశ్‌ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా తడకల వంకర్‌ రాజేశ్‌ మాట్లాడుతూ – ‘‘సస్ప సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందించిన చిత్రం ఇది. బలమైన కథాశంతో తెరకెక్కించిన ఈ చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి. అజయ్‌కి మంచి పేరు వస్తుంది. రవిక్రాశ్‌ ఓ డిఫరెంట్‌ పోలీసాఫీసర్‌ పాత్ర చేశారు. ఈ చిత్రానికి జాన్‌ మంచి సంగీతం ఇచ్చారు. సినిమాలో ఉన్న ఒకే ఒక్క పాటకు మంచి స్పందన లభించింది. ఆనం వెంకట్‌గారు అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఇచ్చారు. ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చే విధంగా ఉంటుంది. నా అభివృద్ధికి అండగా నిలబడిన సి. కల్యాణ్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు.  ఈ చిత్రానికి రచన–దర్శకత్వం: రాజేశ్‌ తడకల, సంగీతం: జాన్, పాటలు: బాలకృష్ణ, కెమెరా: ఆనం వెంకట్, ఎడిటింగ్‌: ఆర్‌కె స్వామి, ఆర్ట్‌: మధు రెబ్బా

Ismart Girl Nabha Ventures into something new

Image
The trailer for the mad max marriage entertainer 'Darling' was launched yesterday at a grand event. Everyone at the event praised Nabha Natesh for her commitment. Nabha Natesh is making her comeback with 'Darling' after her horrible accident in 2022. Praising her resilience, Vishwak Sen said, 'A lot of people would feel low when something like this happens in life, but Nabha came back strong with dedication and commitment. She is an inspiration to millions.' Director Ashwin Raam also lauded her attitude in taking up every challenge. He mentioned, 'I've narrated this script to many heroines, and they feared to do a Split Personality character because Kamal Haasan garu and Vikram garu did it perfectly. Then I met Nabha. When I narrated the story, she said "Inthena," and that's her attitude. She blindly believed in the story and participated in workshops.' Nabha Natesh also revealed that the story of 'Darling' came to h

పవర్‌ఫుల్‌ పోస్టర్‌తో ఉత్కంఠ కలిగిస్తున్న డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ ష‌ణుఖ్మ‌!

Image
  మంచి కథాంశంతో.. ఆసక్తిని కలిగించే నేపథ్యంతో రూపొందే డివోషనల్‌ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి ఆదరణ వుంటుంది. ఆ నమ్మకంతోనే  రూపొందుతున్న పాన్‌ ఇండియా డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రం ష‌ణ్ముఖ. ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ క‌థానాయ‌కుడు. అవికాగోర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కుడు. శాస‌న‌స‌భ అనే పాన్ ఇండియా చిత్రంతో అంద‌రికి సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని  నిర్మిస్తుంది. సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో  తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని, ర‌మేష్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మణానంతర పనులను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌ ఈ పోస్టర్‌ అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది. ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా ఆది నటిస్తున్న విషయం తెలిసిందే. పోలీస్‌డ్రెస్‌తో ఆది పవర్‌ఫుల్‌గా కనిపిస్తుండగా, ఆయన వెనకాల షణ్ముఖ సుబ్రహ్మాణ స్వామి కనిపించడం, పోస్టర్‌ చూసిన అందరిలోనూ పాజిటివ్‌ వ

హ్యాపీ బర్త్ డే టు కల్ట్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ (ఎస్ కేెన్)

Image
టాలీవుడ్ లో యంగ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ గా అతి తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకున్నారు శ్రీనివాస్ కుమార్. ఎస్ కేఎన్ గా అందరికీ పరిచితుడు అయిన ఆయన ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఎస్ కేఎన్ చిత్ర పరిశ్రమలో స్ఫూర్తివంతమైన  జర్నీ కొనసాగిస్తున్నారు. జర్నలిస్టుగా వెబ్ సైట్ లో పనిచేస్తూ తన ప్రస్థానం ప్రారంభించారు ఎస్ కేఎన్. ఆ తర్వాత టీవీ 9లో జర్నలిస్ట్ గా పనిచేశారు. ఆ తర్వాత పీఆర్ఓగా మారి మహానుభావుడు, ప్రతిరోజు పండగే వంటి అనేక సక్సెస్ ఫుల్ సినిమాలకు పనిచేశారు ఎస్ కేఎన్. ఆ సినిమాలకు మంచి ప్రచారం కల్పించి ప్రేక్షకుల దగ్గరకు మూవీస్ బాగా రీచ్ అయ్యేలా చేశారు.  తన మిత్రుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతితో కలిసి గుడ్ సినిమా గ్రూప్ స్థాపించారు ఎస్ కేఎన్. విజయ్ దేవరకొండ హీరోగా టాక్సీవాలా సినిమా నిర్మించి ప్రొడ్యూసర్ గా తన ప్రయాణం మొదలుపెట్టారు. టాక్సీవాలా బ్లాక్ బస్టర్ హిట్ కావడం నిర్మాతగా ఎస్ కేఎన్ కు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత మారుతి, గీతా ఆర్ట్స్, యూవీ సంస్థలతో నిర్మాణ భాగస్వామిగా ఎస్ కేెన్ పలు చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా సాయిరాజేశ్ దర

ఈ నెల 9వ తేదీన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ అనౌన్స్ చేయనున్న యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం

Image
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ఈ రోజు చేశారు. పోస్ట్ కార్డ్ పై లెటర్ రాస్తున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అభినయ వాసుదేవ్, సబ్ ఇన్స్ పెక్టర్ దీపాల పద్మనాభంకు రాస్తున్న లేఖను చూపించారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 11.01 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమాను వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కిరణ్ అబ్బవరం సొంత నిర్మాణ సంస్థ కేఏ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ రూపొందిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. కిరణ్ అబ్బవరం కొత్త సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో విడుదల చేయబోతున్నారు. కిరణ్ అబ్బవరం కొంత విరామం తర్వాత చేస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ నుంచే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.