అంజలి ప్రధాన పాత్రలో ZEE 5, ఫిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’ టీజర్ విడుదల
జూలై 19 నుంచి ZEE 5 స్ట్రీమింగ్ కానున్న వెబ్ సిరీస్ యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే.. రేడియోలో చక్కటి పాట వస్తుంటుంది.. ప్రశాంతమైన పల్లెటూరు.. బస్సులో కూర్చున్న అమ్మాయి (అంజలి) ఆ స్వచ్చమైన గాలిని ఆస్వాదిస్తుంటుంది.. ఈ సన్నివేశంతో ప్రారంభమైన టీజర్‌కు ఈ ప్రపంచం లొంగిపోయేది రెండిటికే .. ఒకటి సొమ్ముకి, ఇంకొకటి సోకు అనే డైలాగ్ ఓ అమ్మాయి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకున్న తీరుని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంజలి మరో విలక్షణమైన పాత్రలో మెప్పించే ప్రయత్నం చేసిందని టీజర్‌లో ఆమె నటించిన సన్నివేశాలను చూస్తుంటే అర్థమవుతుంది. ఓ వైపు ప్రేమ కురిపిస్తూనే మరో వైప...