హ్యాపీ బర్త్ డే టు కల్ట్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ (ఎస్ కేెన్)


టాలీవుడ్ లో యంగ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ గా అతి తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకున్నారు శ్రీనివాస్ కుమార్. ఎస్ కేఎన్ గా అందరికీ పరిచితుడు అయిన ఆయన ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఎస్ కేఎన్ చిత్ర పరిశ్రమలో స్ఫూర్తివంతమైన  జర్నీ కొనసాగిస్తున్నారు. జర్నలిస్టుగా వెబ్ సైట్ లో పనిచేస్తూ తన ప్రస్థానం ప్రారంభించారు ఎస్ కేఎన్. ఆ తర్వాత టీవీ 9లో జర్నలిస్ట్ గా పనిచేశారు. ఆ తర్వాత పీఆర్ఓగా మారి మహానుభావుడు, ప్రతిరోజు పండగే వంటి అనేక సక్సెస్ ఫుల్ సినిమాలకు పనిచేశారు ఎస్ కేఎన్. ఆ సినిమాలకు మంచి ప్రచారం కల్పించి ప్రేక్షకుల దగ్గరకు మూవీస్ బాగా రీచ్ అయ్యేలా చేశారు. 

తన మిత్రుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతితో కలిసి గుడ్ సినిమా గ్రూప్ స్థాపించారు ఎస్ కేఎన్. విజయ్ దేవరకొండ హీరోగా టాక్సీవాలా సినిమా నిర్మించి ప్రొడ్యూసర్ గా తన ప్రయాణం మొదలుపెట్టారు. టాక్సీవాలా బ్లాక్ బస్టర్ హిట్ కావడం నిర్మాతగా ఎస్ కేఎన్ కు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత మారుతి, గీతా ఆర్ట్స్, యూవీ సంస్థలతో నిర్మాణ భాగస్వామిగా ఎస్ కేెన్ పలు చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు.

ఆనంద్ దేవరకొండ హీరోగా సాయిరాజేశ్ దర్శకత్వంలో మాస్ మూవీ మేకర్స్ పై నిర్మించిన బేబి సినిమా ఎస్ కేఎన్ కు నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి పేరును, గౌరవాన్నీ తీసుకొచ్చింది. టాలీవుడ్ లో వంద కోట్ల రూపాయల గ్రాసర్ గా నిలిచిన బేబి కల్ట్ మూవీగా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది. ఈ సినిమా సక్సెస్ తో ఎస్ కేెఎన్ కల్ట్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు.

ఎస్ కేఎన్ బర్త్ డే సందర్భంగా ఆయన మిత్రుడు, టాలెంటెడ్ డైరెక్టర్ సాయి రాజేశ్ ఇన్ స్టా ద్వారా బర్త్ డే విశెస్ తెలియజేశారు. ఆయన పోస్ట్ లో -  ఎవరు నమ్మక ముందు నమ్మాడు, అడిగింది ఏ రోజు కాదనలేదు, కావాలన్నది ఏ రోజు వద్దనలేదు, ఈ రోజు నేను సాధించిన ఏ కొద్దిగైన ఉందంటే …చాలా భాగం అతని నమ్మకమే …, బాధల్లో పక్కనున్నాడు , సంతోషంలో భాగమయ్యాడు …నన్ను నమ్మాడు, నాతో ఉన్నాడు…అందుకే బేబీ దర్శకుడి కంటే నిర్మాతకి క్రేజ్ ఎక్కువ …అంటూ స్పందించాడు.

నిర్మాతగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకున్నారు ఎస్ కేఎన్. బేబి సినిమాను కల్ట్ బొమ్మ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. అలాగే కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్ తో ఓ సినిమా, సాయి రాజేశ్ తో మరో మూవీ చేస్తున్నారు. వీటితో పాటు రశ్మిక మందన్న లీడ్ రోల్ చేస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు ఎస్ కేఎన్. అలాగే రెబెల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు ఎస్ కేఎన్. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ టాలీవుడ్ లో ఎస్ కేఎన్ సక్సెస్ ఫుల్ జర్నీని మరో స్థాయికి తీసుకెళ్లాలని ఆశిద్దాం.

Comments

Popular posts from this blog

Surya Purimetla's character first look from 'Ari' was released on the occasion of the inauguration of Ayodhya Ram Mandir

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"