సురేఖ కొణిదెల గారు పుట్టిన రోజు సందర్భంగా ‘అత్తమ్మ కిచెన్’ను ప్రారంభించిన ఉపాసన కొణిదెల
అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా నిర్వచిస్తున్నారు. అత్తమ్మ వంటకాలను రుచిని అందరికీ తెలిసేలా ఉపాసన చేస్తున్నారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారు ఉపాసన. సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా వీటిని ప్రారంభించి.. అసలు సిసలైన అత్తా కోడళ్ల బంధాన్ని చాటి చెప్పారు. అత్తాకోడళ్ల మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం, సహకారానికి సరైన నిర్వచనం ఇస్తున్నారు. చిరంజీవి తనుకున్న బిజీ షెడ్యూల్స్‌లోనూ రుచికరమైన భోజనం తినేలా ఎన్నో రకాల వంటకాలను సురేఖ కొణిదెల గారు సిద్ధం చేస్తుండేవారు. కొణిదెల వంటకాలను "అత్తమ్మ కిచెన్" ద్వారా అందరితో పంచుకోవాలని ఉపాసన లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇంటి నుండి దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంటి భోజనం మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వకుండా ఈ ‘అత్తమ్మ కిచెన్’ ప్రొడక్ట్స్‌లు వారి కడుపులను నింపుతుంది. ఉపాసన కొణిదెల తన వ్యవస్థాపక నైపుణ్యాలను ఉపయోగించుకుని, ఈ వెంచర్‌ను రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ వినూత్న వ్యాపార విధానంతో అత్తగారితో ఉపాసనకున్న అనుబంధం, ఆమెతో పంచుకునే లోతైన బంధం, గౌ