క్యాన్సర్‌తో బాధపడుతున్న డిస్ట్రిబ్యూటర్‌కు‘ఇద్దరికీ కొత్తేగా’ హీరో హేమచంద్రారెడ్డి ఆర్థిక సాయం


కె. హేమ చంద్రారెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ కృష్ణ క్రియేషన్స్‌ పతాకంపై ‘వకాలత్‌ నామా’ చిత్ర హీరో కుల్లపరెడ్డి సురేష్‌బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఇద్దరికీ కొత్తేగా’. బుధవారం ఫిలింనగర్‌ దైవ సన్నిధానంలో ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం రథసప్తమిని పురస్కరించుకుని ఫిలించాంబర్‌లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర హీరో హేమచంద్రారెడ్డి క్యాన్సర్‌తో బాధపడుతున్న నెల్లూరుకు చెందిన సినీ డిస్ట్రిబ్యూటర్‌, ఛాంబర్‌లో డిస్ట్రిబ్యూటర్స్‌ వింగ్‌ సభ్యుడు అయిన దిలీప్‌సింగ్‌కు 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ చెక్‌ను రిసీవ్‌ చేసుకోవటానికి వచ్చిన దిలీప్‌సింగ్‌ అనుకోకుండా తిరిగి అనారోగ్యానికి గురి కావడంతో ఆయన్ను హాస్పటల్‌కు తీసుకు వెళ్లారు. ఆయనకు బదులుగా నెల్లూరుకు చెందిన నయీం కు అందజేశారు.

ఈ సందర్భంగా ఎఫ్‌ఎన్‌సీసీ కమిటీ మెంబర్‌ కాజ సూర్యనారాయణ మాట్లాడుతూ...
ముందుగా కొల్లపురెడ్డి సురేష్‌బాబును అభినందించాలి. ఆయన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ దర్శకత్వం వహించడమే కాకుండా కొడుకును పదిమందికి సాయం చేసే దిశగా ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది. సరేష్‌బాబు కుటుంబం ఇలా పదిమందికి సాయం చేయటానికి పూనుకోవడం ఆనందించదగ్గ విషయం. ‘ఇద్దరికీ కొత్తేగా’ అంటూ మంచి టైటిల్‌తో వస్తున్నారు. వారికి నా ఆల్‌ది బెస్ట్‌ అన్నారు.

నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ...
దర్శకుడు సురేష్‌బాబు ఛాంబర్‌లో ఎగ్జిబిటర్‌, డిస్ట్రిబ్యూటర్‌, ప్రొడ్యూసర్‌, స్టూడియో సెక్టార్స్‌లో మెంబర్‌. ఆయనలోని మంచి అగ్రెసివ్‌నెస్‌ను గమనించి లాయర్‌గా వెళితే బాగుంటుంది అని చెప్పాను. దాంతో ఆయన హైకోర్టులో మంచి పేరున్న లాయర్‌గా మారారు. ఆయన భార్య కూడా లాయర్‌ కావడం సంతోషించదగ్గ విషయం. వారి కుమారుడు హేమచంద్రారెడ్డి హీరోగా సక్సెస్‌ సాధించాలని కోరుకుంటున్నా. చిన్న వయస్సులోనే దానధర్మాలకు పూనుకున్న హేమచంద్రారెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అన్నారు.

దర్శకుడు సురేష్‌బాబు మాట్లాడుతూ...
2009లో ఇక్కడే నా కెరీర్‌ స్టార్ట్‌ చేశాను. మా అబ్బాయిని నా దర్శకత్వంలో హీరోగా పరిచయం చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారి సమక్షంలో గ్రాండ్‌గా మా ‘ఇద్దరికీ కొత్తేగా’ లాంఛ్‌ కావడం వాడి అదృష్టం. సినిమా గురించి ఇప్పుడు ఏమీ చెప్పను. దిలీప్‌సింగ్‌ గారి ఆరోగ్యం మెరుగుపడాలని మేం అందరం దేవుణ్ణి కోరుకుంటున్నాం. ప్రసన్నగారికి, కె.యస్‌. రామారావు గారికి ప్రసన్నగారికి నా కృతజ్ఞతలు. సినిమా పరిశ్రమలో నిలబడటం అంటే అంత ఈజీ కాదు. నా కొడుకు నిర్మాత, దర్శకుల హీరో కావాలని కోరుకుంటున్నా అన్నారు. 

హీరో హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ...
ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మా డాడీ దర్శకత్వంలో హీరో అవడం ఇంకా హ్యాపీ. మానాన్నే నా బలం. ఇంతకన్నా ఎక్కువ నేను మాట్లాడను. మా సినిమానే మాట్లాడుతుంది అన్నారు. 

ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ, పోలీస్‌, న్యాయవాద రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై హేమచంద్రారెడ్డికి, సురేష్‌బాబుకు అభినందనలు తెలియజేశారు.

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

"ది ఇండియన్ స్టోరి" రివ్యూ - మంచి సందేశం, వినోదం కలిపిన సినిమా

టోని కిక్, సునీత మారస్యార్ హీరో హీరోయిన్లుగా A3 లేబుల్స్ బ్యానర్‌పై బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో లాంఛనంగా ప్రారంభమైన చిత్రం