స్టార్ హీరో నాగ చైతన్య చేతుల మీదుగా డిఫరెంట్ థ్రిల్లర్ "ఆరంభం" టీజర్ రిలీజ్
మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఆరంభం". ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వి.టి నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఆరంభం సినిమా టీజర్ ను స్టార్ హీరో నాగ చైతన్య ఇవాళ రిలీజ్ చేశారు. టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉందన్న నాగ చైతన్య మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు. హీరో నాగ చైతన్య మాట్లాడుతూ - థ్రిల్లర్, యాక్షన్ ఎలిమెంట్స్ తో "ఆరంభం" టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కొన్ని క్యారెక్టర్స్ లో గ్రే షేడ్స్ ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కొత్తగా ఉన్నాయి. టీజర్ బ్యాక్ గ్రౌండ్ లో రామాయణ స్టోరీ నెరేట్ చేస్తూ ఇంటర్ కట్స్ లో వేసిన విజువల్స్ తో టీజర్ డిఫరెంట్ గా కట్ చేశారు. "ఆరంభం" మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు. ఇప్పటిదాకా వినని ఒక కథ చెబుతానంటూ ఒక మహిళ చెప్పే కథతో "ఆరంభం" టీజర్ మొదలైంది. శ్రీరాముడు తన అవతారం చాలించి వైకుంఠానికి వెళ్లే సమయం వస్తుంది. హనుమంతుడు తనను వెళ్లనివ్వడని తెలిసి శ్రీర...