Posts

రామ్ భజరంగ్ ఫస్ట్ లుక్ విడుదల !!!

Image
సన్ రైజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత స్వాతిసుధీర్ నిర్మిస్తున్న సినిమా రామ్ భజరంగ్. రాజ్ తరుణ్ , సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న రామ్ భజరంగ్ సినిమాకు సి.హెచ్.సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు.  మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి అయ్యింది, దసరా సందర్భంగా రామ్ భజరంగ్ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా మాసీగా ఉందని, ఇద్దరు హీరోలు రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ చాలా డిఫరెంట్ లుక్స్ , గెటప్స్ లో ఉన్నారని పాజిటీవ్ కామెంట్స్ వస్తున్నాయి.  గదర్ 2 హీరోయిన్ సిమ్రత్ కౌర్, బిచ్చగాడు ఫేమ్ సట్న టీటస్, ఛాయా దేవి, మనసా రాధాకృష్ణన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, రవి శంకర్, షఫీ, శివరామరాజు వెంకట్, సత్యం రాజేష్, ధనరాజ్, రచ్చ రవి, ఐశ్వర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ చాలా డిఫరెంట్ లుక్స్ లో ఈ మూవీలో కనిపించబోతున్నారు. 1980 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఫ్యామ...

వినూత్న తరహాలో లగ్గం సినిమా ట్రైలర్ లాంచ్

Image
 సినిమా ప్రమోషన్స్ కొత్తగా చెయ్యాలి,  బజ్ క్రియేట్ చెయ్యాలి,  ప్రేక్షకుల్లోకి సినిమా తీసుకెళ్లాలి అని ఉద్దేశంతో డిఫరెంట్ ఐడియాలతో ముందుకొస్తున్నారు "లగ్గం" టీమ్. రెగ్యులర్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్, లేక టాప్ ప్రొడ్యూసర్తో టీజర్ , ట్రైలర్స్ లాంచ్ చేపించడం అనేది మనం చూస్తున్నదే. కానీ వీటన్నింటినీ దాటి ఇప్పటివరకు ఎవ్వరు చెయ్యని విధంగా తమ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టింది. లగ్గం సినిమా టీమ్. సినిమా మొదలుకొని పాటలు, పోస్టర్స్, టీజర్ అంటూ వరుసగా రోజు ప్రేక్షకులను పలకరిస్తూ "రీల్ పెట్టు - చీరపట్టు" అనే డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ప్రమోషన్స్ మొదలు పెట్టి దూసుకుపోతుంది. ఒక వైపు లగ్గం ట్రావెలర్ ఊరూరా తిరుగుతూ లగ్గం గిఫ్ట్స్ అందిస్తూ అందరికీ చేరువ అవుతుంది. అదే తరహాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం మరో కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది టీమ్.  లగ్గం సినిమా ట్రైలర్ ని ఒరిజినల్ గా లగ్గం చేసుకుంటున్న నూతన వధూవరులతో లాంచ్ చేపించింది. ఇంజాపూర్ SPR శ్రీరస్తు కన్వెన్షన్ లో జరిగిన ఒక వివాహ వేడుకలో లగ్గం సినిమా టీమ్ అంతా పాల్గొని వధూవరులు మండపంలోనే గోవర్ధన్ అనూషల చేత లగ్గం స...

అక్టోబర్ 11న రాబోతోన్న మా చిత్రాన్ని చూసి సక్సెస్ చేయండి.. ‘జిగ్రా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ ఆలియా

Image
ఆలియా భ‌ట్, వేదాంగ్ రైనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ‘జిగ్రా’ చిత్రం అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోంది. ‘జిగ్రా’ చిత్రాన్ని తెలుగులో ఏషియ‌న్ సురేష్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ద్వారా రానా విడుద‌ల చేస్తున్నారు. పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లు విడుద‌ల చేసిన జిగ్రా తెలుగు ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. మంగళవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, రానా దగ్గుబాటి, సమంతలు ముఖ్య అథితులుగా విచ్చేశారు. త్రివిక్రమ్, సమంత చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో.. ఆలియా భట్ మాట్లాడుతూ.. ‘నేను మెసెజ్ చేసిన వెంటనే వచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. మీరు మాట్లాడిన ప్రతీ మాట గుండెల్ని తాకింది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో సమంత రియల్ హీరో. సమంత తన నటనతో సినిమా పరిశ్రమలో నిలబడ్డారు. సమంతకు, నాకు సరిపోయే కథను త్రివిక్రమ్ రాస్తే బాగుంటుందనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఈ చిత్రంతో వస్తున్నాను. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత తెలుగు ప్రేక్షకులతో కనెక్షన్ ఏర్పడింది. నాటు నాటు పాటను నా కూతురు రా...

"లవ్ రెడ్డి" సినిమా నుంచి కైలాష్ ఖేర్ పాడిన ఎమోషనల్ సాంగ్ 'ప్రాణం కన్నా..' రిలీజ్, ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ

Image
గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్  బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "లవ్ రెడ్డి" . అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి,  మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి "లవ్ రెడ్డి" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా "లవ్ రెడ్డి" సినిమా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. "లవ్ రెడ్డి" సినిమా నుంచి ఈ రోజు సెకండ్ సింగిల్ 'ప్రాణం కన్నా..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ పాడిన ఈ హార్ట్ బ్రేకింగ్ ఎమోషనల్ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. ప్రిన్స్ హెన్రీ కంపోజ్ చేసిన ఈ పాటకు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. ' ప్రాణం కన్నా ప్రేమి...

హీరోయిన్ సంయుక్త లీడ్ రోల్ లో వస్తున్న రియలిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్

Image
సక్సెస్ మారుపేరుగా హీరోయిన్ సంయుక్తను చెబుతుంటారు. ఆమె టాలీవుడ్ లో అపజయం ఎరుగని నాయికగా క్రేజ్ తెచ్చుకుంది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో  నటించిన ఈ టాలెంటెడ్ హీరోయిన్ ఇప్పుడు లీడ్ రోల్ లో  యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఈ రియలిస్టిక్ మూవీకి యోగేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంయుక్త ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. హాస్య మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఇంతమంది సెలబ్రిటీలు గెస్ట్ లుగా వచ్చిన ఈవెంట్ ఇదే అనుకోవచ్చు. సంయుక్త యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓపెనింగ్ కార్యక్రమంలో నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, హీరో రానా, దర్శకులు వశిష్ట, వెంకీ కుడుముల, రామ్ అబ్బరాజు, రచయిత కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సంయుక్త కెరీర్ లో ఈ సినిమా ఎంతో స్పెషల్ కానుంది.

కార్తికేయ2 చిత్ర యూనిట్‌కు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అభినందనలు

Image
70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా జరిగింది. మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలను అందజేసి, అభినందనలు తెలియజేశారు.  2022 సంవత్సరానికి గానూ వివిధ విభాగాల్లో ఈ అవార్డులను అందజేశారు. తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచిన ‘కార్తికేయ 2’ సినిమాకు గాను,  దర్శకుడు చందు మొండేటి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ రాష్ట్రపతి నుంచి అవార్డును స్వీకరించారు.  ఈ సందర్భంగా ‘కార్తికేయ2’ చిత్ర యూనిట్‌కు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ తరపున అధ్యక్షులు సునీల్ నారంగ్, గౌరవ కార్యదర్శి కె అనుపమ్ రెడ్డి  అభినందనలు తెలియజేశారు. క్రిందటేడాది ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి గాను, ఈ ఏడాది ‘కార్తికేయ2’ చిత్రానికి గాను  నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ వరుసగా రెండు నేషనల్ అవార్డ్స్ అందుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వ కారణంగా ఉందని  అన్నారు. అలాగే ‘కార్తికేయ2’  చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యులైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్లకు అభినందనలు తెలియజేశా...

రేపు వర్సటైల్ యాక్టర్ రానా చేతుల మీదుగా వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ ప్రొడక్షన్ నెం.4 సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ లాంఛ్

Image
"డియర్ మేఘ", "భాగ్ సాలే" వంటి డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్. అర్జున్ దాస్యన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం తమ ప్రొడక్షన్ నెం.4 చిత్రాన్ని నిర్మిస్తోంది.  ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను వర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి రేపు మధ్యాహ్నం 1.02 నిమిషాలకు లాంఛ్ చేయబోతున్నారు. ఈ సినిమాను హిలేరియస్ ఫన్ రైడ్ గా దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ వెల్లడించనున్నారు.