హీరోయిన్ సంయుక్త లీడ్ రోల్ లో వస్తున్న రియలిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్


సక్సెస్ మారుపేరుగా హీరోయిన్ సంయుక్తను చెబుతుంటారు. ఆమె టాలీవుడ్ లో అపజయం ఎరుగని నాయికగా క్రేజ్ తెచ్చుకుంది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో  నటించిన ఈ టాలెంటెడ్ హీరోయిన్ ఇప్పుడు లీడ్ రోల్ లో  యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఈ రియలిస్టిక్ మూవీకి యోగేశ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రానికి సంయుక్త ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. హాస్య మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఇంతమంది సెలబ్రిటీలు గెస్ట్ లుగా వచ్చిన ఈవెంట్ ఇదే అనుకోవచ్చు. సంయుక్త యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓపెనింగ్ కార్యక్రమంలో నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, హీరో రానా, దర్శకులు వశిష్ట, వెంకీ కుడుముల, రామ్ అబ్బరాజు, రచయిత కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సంయుక్త కెరీర్ లో ఈ సినిమా ఎంతో స్పెషల్ కానుంది.

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి త్వరలో రాబోతున్న సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ !!!