Sahakutumbaanaam telugu movie review and rating
స:కుటుంబానాం మూవీ రివ్యూ & రేటింగ్ !!!
హెచ్.ఎన్. జి సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై నిర్మితమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా స:కుటుంబానాం. హీరోగా రామ్ కిరణ్, హీరోయిన్‌గా మేఘ ఆకాష్ నటించారు. రాజేంద్ర ప్రసాద్ , బ్రహ్మానందం , శుభలేఖ సుధాకర్, సత్య , భద్రం , రచ్చ రవి , తాగుబోతు రమేష్ , నిత్య శ్రీ ముఖ్య పాత్రల్లో నటించారు.. ఉదయ్ శర్మ స్టోరీ స్క్రీన్ ప్లే దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 1న థియేటర్స్ లో విడుదల అయ్యింది.
ఈ చిత్రం హెచ్. మహదేవ్ గౌడ్ , హెచ్ నాగరత్న నిర్మాతలు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రోహిత్ కుమార్ పద్మనాభ లైన్ ప్రొడ్యూసర్ ఎస్.అంకిత్ కనై తెరకెక్కింది. సంగీతం మణిశర్మ అందించారు. స:కుటుంబానాం సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.
కథ:
కళ్యాణ్ (రామ్ కిరణ్ ) సాప్ట్ వేర్ జాబ్, ఫ్యామిలీ కే తన ఫస్ట్ ఛాయిస్.. ఆఫీస్ అండ్ ఫ్యామిలీ తప్ప తనకి వేరే లోకం లేదు.. తన ఫ్యామిలీ ఒక్క మాట ఎవరైనా అంటే తట్టుకోలేడు... అలాంటి కళ్యాణ్ లైఫ్ లోకి సిరి ( మేఘ ఆకాష్ ) కళ్యాణ్ ఆఫీస్ లో జాయిన్ అవుతుంది.. ఎప్పుడు ఫ్యామిలీ అనే కళ్యాణ్, సిరి తో ప్రేమలో పడతాడు.. తర్వాత ఏం జరిగింది అనేది కథ
విశ్లేషణ:
ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ సీన్స్, ఆఫీస్ లో బ్రహ్మానందం సత్య మరియు భద్రం కామెడీ సూపర్.. కళ్యాణ్, సిరి లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. ఫాదర్ రాజేంద్ర ప్రసాద్ తో సీన్స్ ఆకట్టుకుంటాయి..
ఊహించని ఇంటర్వెల్ హైలైట్.. సెకండ్ హాఫ్, ఫుల్ ఎంటర్టైనర్ విత్ ఎమోషన్.. సెకండ్ హాఫ్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్ బాగా ఎంగేజ్ గా ఉంటుంది.. చూడాల్సిందే
డైరెక్టర్ ఉదయ్ శర్మ తీసుకున్న లైన్ ను చాలా ఇంట్రెస్ట్ గా చెప్పారు.. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ సెకండ్ హాఫ్,రాసుకున్న కథ, కథనాలు బాగున్నాయి. సినిమాను గ్రిప్పింగ్ గా తెరకెక్కించారు.. హీరో క్యారెక్టర్ బాగా రాసుకున్నాడు..
హీరో రామ్ కిరణ్ కొత్త వాడైన చాలా ఎనర్జీ పెర్ఫామేస్ ఇచ్చాడు... చాలా హుషారుగా చేశాడు .. ఒక రెండు మూడు సినిమాలు చేసిన హీరోల పెర్ఫామేస్ ఇచ్చాడు.. ఫైట్స్ లో కూడా బాగా చేశాడు.. హీరోయిన్ మేఘ ఆకాష్ గురించి కొత్తగా చెప్పేదీ ఏముంది, చాలా అందంగా ఉంది తన క్యారెక్టర్ కి పెర్ఫెక్ట్ సెట్
మణిశర్మ మ్యూజిక్ బాగుంది అన్ని సాంగ్స్ బాగున్నాయి . ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ చాలా బాగా ఇచ్చాడు... శశాంక్ మలి, శివ శర్వాణి ఎడిటింగ్ సినిమా కు బాగా హెల్ప్ అయ్యింది. ఎక్కడా ల్యాగ్ లేకుండా క్రిస్పీగా కట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.. రీచ్ గా ఉంది మూవీ. నిర్మాతలు రాజీపడకుండా ఖర్చు పెట్టారు. సినిమా విజువల్ పరంగా కూడా గ్రాండ్ గా ఉంది. మధు దాసరి కెమరా వర్క్ బాగుంది
అనంత శ్రీరామ్, ఉమ వంగూరి రాసిన పాటలు, బాగున్నాయి, చిన్ని ప్రకాష్, భాను, విజయ్ పోలాకి, కోరియోగ్రాఫర్స్ గా చేసిన సాంగ్స్ సూపర్ , కార్తీక్, వింగ్ చన్ అంజి ఫైట్స్ బాగున్నాయి, పెద్ద సినిమాలా బాగా చేశారు, ఆర్ట్ డైరెక్టర్ పి.ఎస్ వర్మ వర్క్ బాగుంది సెట్ లు బాగున్నాయి.
ఒక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన స:కుటుంబానాం సినిమాను ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. రెండు గంటల్లో ఒక మంచి సినిమా చూశాం అనే ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ నుండి బయటికి వస్తారు. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్, మ్యూజిక్, డైరెక్షన్ ఇలా అన్నీ ఈ సినిమాకు చక్కగా కుదిరాయి. కొత్త సంవత్సరం లో ఫ్యామిలీ తో చూసే సినిమా.
ఎక్కడా కూడా బోరింగ్ లేకుండా డైరెక్టర్ ఉదయ్ శర్మ సినిమాను నడిపించిన విధానం బాగుంది, మణిశర్మ సంగీతం, మధు దాసరి కెమెరా వర్క్ బాగుంది ఇలా అన్నీ సినిమాకు చక్కగా కుదిరాయి. ప్రొడక్షన్ వాల్యూస్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. హీరో రామ్ కిరణ్ కు స:కుటుంబానాం ఫస్ట్ సినిమా మంచి లాంచ్ అని చెప్పవచ్చు, నిర్మాతలు హెచ్ మహాదేవ్ గౌడ్, హెచ్ నాగరత్న ఎక్కడా రాజీ పడకుండా సినిమాను చాలా గ్రాండ్ గా నిర్మించారు. తప్పకుండా కుటుంభం మొత్తం కలిసి చూడదగ్గ సినిమా స:కుటుంబానాం.
రేటింగ్: 3/5
Comments
Post a Comment