Sahakutumbaanaam telugu movie review and rating
స:కుటుంబానాం మూవీ రివ్యూ & రేటింగ్ !!! హెచ్.ఎన్. జి సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై నిర్మితమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా స:కుటుంబానాం. హీరోగా రామ్ కిరణ్, హీరోయిన్‌గా మేఘ ఆకాష్ నటించారు. రాజేంద్ర ప్రసాద్ , బ్రహ్మానందం , శుభలేఖ సుధాకర్, సత్య , భద్రం , రచ్చ రవి , తాగుబోతు రమేష్ , నిత్య శ్రీ ముఖ్య పాత్రల్లో నటించారు.. ఉదయ్ శర్మ స్టోరీ స్క్రీన్ ప్లే దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 1న థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఈ చిత్రం హెచ్. మహదేవ్ గౌడ్ , హెచ్ నాగరత్న నిర్మాతలు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రోహిత్ కుమార్ పద్మనాభ లైన్ ప్రొడ్యూసర్ ఎస్.అంకిత్ కనై తెరకెక్కింది. సంగీతం మణిశర్మ అందించారు. స:కుటుంబానాం సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం. కథ: కళ్యాణ్ (రామ్ కిరణ్ ) సాప్ట్ వేర్ జాబ్, ఫ్యామిలీ కే తన ఫస్ట్ ఛాయిస్.. ఆఫీస్ అండ్ ఫ్యామిలీ తప్ప తనకి వేరే లోకం లేదు.. తన ఫ్యామిలీ ఒక్క మాట ఎవరైనా అంటే తట్టుకోలేడు... అలాంటి కళ్యాణ్ లైఫ్ లోకి సిరి ( మేఘ ఆకాష్ ) కళ్యాణ్ ఆఫీస్ లో జాయిన్ అవుతుంది.. ఎప్పుడు ఫ్యామిలీ అనే కళ్యాణ్, సిరి తో ప్రేమలో పడతాడు.. తర్వాత ఏం జరిగింది అనేది కథ విశ్లేషణ...