3 రోజుల్లో రూ.17.5 కోట్ల గ్రాస్ వసూళ్లతో బ్రేక్ ఈవెన్ సాధించిన దీపావళి విన్నర్ కిరణ్ అబ్బవరం "K-ర్యాంప్" మూవీ

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన "K-ర్యాంప్" మూవీ హౌస్ ఫుల్ షోస్ తో, పెరుగుతున్న కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ విజయం దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా రిలీజైన 3 రోజుల్లోనే 17.5 కోట్ల రూపాయల వసూళ్లను అందుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది. రిలీజైన 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అందుకోవడం ఈ సినిమా సక్సెస్ ను ప్రూవ్ చేస్తోంది. దీపావళి బాక్సాఫీస్ కాంపిటేషన్ లో అతి తక్కువ టైమ్ లో బ్రేక్ ఈవెన్ గా నిలిచి ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోందీ మూవీ. మంచి కంటెంట్ ను సపోర్ట్ చేస్తామని "K-ర్యాంప్" చిత్రానికి విజయాన్ని అందించి ప్రేక్షకులు నిరూపించారు.

ఈ చిత్రానికి పాజిటివ్ మౌత్ టాక్ తో రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. సిటీస్ తో పాటు బీ, సీ సెంటర్స్ లోనూ థియేటర్స్ హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు "K-ర్యాంప్" సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. "K-ర్యాంప్" సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్  బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా  నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది.

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

లేత గులాబీ టైటిల్ లాంచ్