UK Pawan Kalyan Birthday Celebration

యునైటెడ్ కింగ్‌డమ్‌లో UK జనసేన SAVVE ఆధ్వర్యంలో London, Birmingham Midlands Janasena మరియు Manchester Teams, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు UK లోని ప్రధాన నగరాలైన London, Birmingham, Manchester నగరాలలో ఘనంగా, ఉత్సాహభరితంగా, లక్షలాది క‌ళ్యాణ్ గారి అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ వేడుకలలో భాగంగా Naa Sena Kosam Naa Vanthu కార్యక్రమంలో భాగంగా, OG Shirts, T-Shirts, OG Hand Kerchief (Merchandise) విక్రయం ద్వారా Janasena Party కోసం నిధులు సేకరించబడ్డాయి. ఈ సేకరించిన మొత్తాన్ని మా బృందం త్వరలోనే “నా సేన కోసం నా వంతు” కార్యక్రమానికి అందజేయనున్నది.

ఈ వేడుకలకు హాజరైన జనసైనికులు, వీరమహిళలు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజాకేంద్రీకృత పరిపాలన విధానాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన క్షణక్షణం కష్టపడే అంకితభావాన్ని హృదయపూర్వకంగా ప్రశంసించారు.

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా, UK Mega Power Fans Team ఆధ్వర్యంలో London‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా NHS Blood & Plasma Drive కూడా నిర్వహించబడగా, అనేక మంది స్ఫూర్తిదాయకంగా ముందుకు వచ్చి రక్తదానం కోసం నమోదు చేసుకున్నారు.

వేడుకల ప్రత్యేక ఆకర్షణగా, Cultural Activities తో పాటు హరితహారం – మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని Midlands Janasena Team నిర్వహించింది. దీని ద్వారా పచ్చదనం ప్రాధాన్యతను అందరికీ చాటి చెప్పబడింది.

చిన్నారుల అద్భుత నృత్యాలు, మధుర గానాలు, పెద్దల ఉత్సాహభరిత నృత్యాలు ఈ వేడుకలకు మరింత వైభవాన్ని చేర్చాయి. కుటుంబ సమేతంగా పాల్గొన్న జనసైనికులు ఈ వేడుకలకు విశేష అందాన్ని తెచ్చారు.

పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమాలు వినోదంతో పాటు సేవా కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే సంకల్పాలను కలగలిపిన అద్భుత వేదికగా నిలిచాయి.

– UK జనసేన SAVVE Team

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

లేత గులాబీ టైటిల్ లాంచ్