"లిటిల్ హార్ట్స్" సినిమాతో డీవోపీగా మంచి గుర్తింపు దక్కడం హ్యాపీగా ఉంది - సూర్య బాలాజీ

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాకు వస్తున్న అప్రిషియేషన్స్ లో డీవోపీ వర్క్, బ్యూటిఫుల్ విజువల్స్ గురించి మాట్లాడుతున్నారు. సూర్య బాలాజీ ఈ చిత్రంతో సినిమాటోగ్రాఫర్ గా పరిచయమయ్యారు. తన తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్ని కెమెరా పనితనంతో ఆకట్టుకున్నారు.

డీవోపీ పనితనం మీదే సినిమా బడ్జెట్ ఆధారపడి ఉంటుంది. లిటిల్ హార్ట్స్ చిత్రాన్ని కాంపాక్ట్ బడ్జెట్ లో రిచ్ లుక్ లో తెరకెక్కేలా చేయడంలో సూర్య బాలాజీ ప్రతిభ చూపించారు. 2.5 కోట్ల రూపాయల బడ్జెట్ లో చేసిన లిటిల్ హార్స్ట్ సినిమా తెరపై చూస్తే ఓ పది కోట్ల రూపాయల బడ్జెట్ మూవీలా అనిపిస్తుంది. అలాంటి రిచ్ లుక్ తన కెమెరా పనితనంతో తీసుకొచ్చారు సూర్య బాలాజీ. హైదరాబాద్, బెంగళూరులో ఈ సినిమాను గెరిల్లా పద్ధతిలో షూట్ చేశారు. లొకేషన్స్ ను కాకుండా కేవలం నటీనటుల క్లోజప్స్ తోనే ఎలివేట్ చేశారు. ప్రతి సీన్ సహజంగా ఉండేలా క్యాప్చర్ చేశారు. లిటిల్ హార్ట్స్ మూవీని చాలా రియలెస్టిక్ గా తన కెమెరా లెన్స్ లో చూపించారు సూర్య బాలాజీ. 

లిటిల్ హార్ట్స్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందని, బీ, సీ సెంటర్స్ లో కూడా థియేటర్స్ హౌస్ ఫుల్స్ కావడం నమ్మలేకపోతున్నామని సూర్య బాలాజీ అంటున్నారు.  ఈ చిత్రానికి తనకు ఆశించిన దానికంటే ఎక్కువ గుర్తింపు రావడం హ్యాపీగా ఉందన్నారు. కంప్లీట్ కమర్షియల్ గా కాకుండా, కంప్లీట్ రియలెస్టిక్ గా కాకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఒక డైలాగ్ బేస్డ్ హోస్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించినట్లు సూర్య బాలాజీ చెప్పారు.

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

లేత గులాబీ టైటిల్ లాంచ్