రిచర్డ్ రిషి నటించిన ‘ద్రౌపది 2’ చిత్రీకరణ పూర్తి

జి.ఎం. ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి నేతాజీ ప్రొడక్షన్స్‌ బ్యానర్ మీద చోళ చక్రవర్తి నిర్మిస్తున్న చిత్రం ‘ద్రౌపది 2’. తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌కి మోహన్.జి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రిచర్డ్ రిషి ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన షూటింగ్ నేటి(సెప్టెంబర్ 23)తో ముగిసింది. ఈ మేరకు దర్శక, నిర్మాతలు సినిమా గురించి కొన్ని విశేషాల్ని పంచుకున్నారు.

*దర్శకుడు మోహన్.జి మాట్లాడుతూ* .. ‘దర్శకుడు ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా, చివరికి నిర్మాత సపోర్ట్, మద్దతుతోనే షూటింగ్‌ను పూర్తి చేయగలం. చిత్రీకరణమైన సమయంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా కూడా నిర్మాత చోళ చక్రవర్తి ఇచ్చిన సపోర్ట్‌తోనే చిత్రీకరణను పూర్తి చేయగలిగాను. ఆయనకు ఇది తొలి ప్రాజెక్ట్ అయినప్పటికీ, సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్, ఇష్టం, అనుభవం, కళ, విజన్‌ వల్లే ఇంత గ్రాండ్‌గా చిత్రీకరించగలిగాం. సృజనాత్మక స్వేచ్ఛను ఇవ్వడంతో ఈ మూవీని అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించానని అనుకుంటున్నాను’ అని అన్నారు.

*నిర్మాత చోళ చక్రవర్తి మాట్లాడుతూ* .. “దర్శకుడు మోహన్. జి గారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఆయన సినిమాను తెరకెక్కించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది. షూటింగ్ అనుకున్న దానికంటే ముందే పూర్తయింది. నిర్మాతగా నాకు ఉండే ఎన్నో అనుమానాల్ని ఆయన నివృత్తి చేసిన విధానం నాకు నచ్చింది. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్‌గా నిలిచిన మోహన్ గారికి ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ తరహాలో మరిన్ని చిత్రాలను నిర్మించాలనే నా సంకల్పాన్ని బలోపేతం చేసింది’ అని అన్నారు.

ఈ చిత్రంలో రక్షణ ఇందుసుదన్ కథానాయికగా నటించారు. నట్టి నటరాజ్, వై.జి. మహేంద్రన్, నాడోడిగల్ బరణి, శరవణ సుబ్బయ్య, వేల్ రామమూర్తి, సిరాజ్ జానీ, దినేష్ లాంబా, గణేష్ గౌరంగ్, దివి, దేవయాని శర్మ, అరుణోదయన్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.

ఈ చిత్రానికి మాటల్ని పద్మ చంద్రశేఖర్, మోహన్ జి రాశారు. గిబ్రాన్ వైబోధ సంగీతాన్ని సమకూర్చారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫీ: ఫిలిప్ ఆర్. సుందర్, కొరియోగ్రఫీ: థానికా టోనీ, స్టంట్ కోఆర్డినేషన్: యాక్షన్ సంతోష్, ఎడిటింగ్: దేవరాజ్, ఆర్ట్ డైరెక్షన్: కమల్నాథన్.

‘ద్రౌపది 2’ చిత్రంలో.. ప్రేక్షకులను 14వ శతాబ్దంలోకి తీసుకు వెళ్లి, ఆనాటి దక్షిణ భారతదేశ వైభవాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించబోతోన్నారు. అద్భుతమైన కథ, విజువల్స్, తారాగణంతో కూడిన చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నారు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. డిసెంబర్‌లో నెలలో మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మేకర్లు ప్లాన్ చేస్తున్నారు.

*నటీనటులు :* రిచర్డ్ రిషి, రక్షణ ఇందుసుదన్, నట్టి నటరాజ్, వై.జి. మహేంద్రన్, నాడోడిగల్ బరణి, శరవణ సుబ్బయ్య, వేల్ రామమూర్తి, సిరాజ్ జానీ, దినేష్ లాంబా, గణేష్ గౌరంగ్, దివి, దేవయాని శర్మ, అరుణోదయన్ తదితరులు

*సాంకేతిక బృందం*

బ్యానర్: జి.ఎం. ఫిల్మ్ కార్పొరేషన్‌, నేతాజీ ప్రొడక్షన్స్‌
నిర్మాత: చోళ చక్రవర్తి
దర్శకుడు: మోహన్.జి 
సంగీతం: గిబ్రాన్ వైబోధ
మాటలు: పద్మ చంద్రశేఖర్, మోహన్ జి
సినిమాటోగ్రఫీ: ఫిలిప్ ఆర్. సుందర్ 
కొరియోగ్రఫీ: థానికా టోనీ 
స్టంట్ కోఆర్డినేషన్: యాక్షన్ సంతోష్ 
ఎడిటింగ్: దేవరాజ్ 
ఆర్ట్ డైరెక్షన్: కమల్నాథన్
పి ఆర్ ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

లేత గులాబీ టైటిల్ లాంచ్