హిందీలో "సామ్రాజ్య" టైటిల్ తో ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న విజయ్ దేవరకొండ "కింగ్డమ్" సినిమా
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న "కింగ్డమ్" సినిమా ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూవీ హిందీలో "సామ్రాజ్య" టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మేకర్స్ ఈరోజు కింగ్డమ్ మూవీ హిందీ టైటిల్ అనౌన్స్ చేశారు. సామ్రాజ్య టైటిల్ ఇన్ స్టంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"కింగ్డమ్" చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్నారు. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Comments
Post a Comment