‘బద్మాషులు’ చిత్రాన్ని థియేటర్స్ లో చూసి నవ్వులతో ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు !!!
‘బద్మాషులు’.. తెలంగాణ ప్రాంతంలో సరదాగా తిట్టుకునే పదం అది. అదే టైటిల్‌లో ఓ సినిమా తెరకెక్కింది. మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి ఇద్దరూ హీరోలుగా నటించిన చిత్రమిది, ఈ చిత్రానికి శంకర్ చేగూరి దర్శకత్వం వహించారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ చిన్న చిత్రంపై అందరి దృష్టి పడింది. మంచి అంచనాల నడుమ (జూన్ 6) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కామెడీ తో పాటు మంచి ఎమోషన్ ఉన్న మంచి సినిమాగా పాజిటీవ్ టాక్ తో దూసుకెళుతోంది.
బద్మాషులు చిత్రంలో విద్యా సాగర్, మహేశ్ ఇద్దరు తెరపై సహజ నటన జనాలను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ముత్యాలు భార్యగా దీక్ష కోటేశ్వర్, తిరుపతి భార్యగా కవిత ఇద్దరూ నవ్వులు పూయించారు. తేజ కూనూరు సాంగ్స్, నేపథ్య సంగీతం బాగుంది. వినీత్ పబ్బతి సినిమాటోగ్రఫీ, గజ్జల రక్షిత్ కుమార్ ఎడిటింగ్ ఇలా అన్ని ఈ సినిమాకు కలిసొచ్చాయి. థియేటర్స్ లో ఉన్న బద్మాషులు సినిమాను స్నేహితులతో మరియు ఫ్యామిలీ తో సరదాగా చూసి ఎంజాయ్ చేయొచ్చు.
Comments
Post a Comment