బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ' ఓ భామ అయ్యో రామ' నుంచి రామచంద్రుడే.. లిరికల్‌ సాంగ్‌ విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న  నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో  కథానాయికగా పరిచయమవుతోంది.  రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి  స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. వేసవిలో ఈ చిత్రం థియేటర్‌లో సందడి చేయనుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు, పాటలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి 'రామచంద్రుడే' అంటూ కొనసాగే ఓ బ్యూటిఫుల్‌ పెళ్లి సాంగ్‌ను విడుదల  చేశారు మేకర్స్‌. హీరో, హీరోయిన్‌పై అందమైన విజువల్స్‌తో మోస్ట్ బ్యూటిఫుల్‌గా చిత్రీకరించిన ఈ పెళ్లి సాంగ్‌కు శ్రీ హర్ష ఈమని, పార్థు సన్నిధిరాజు సాహిత్యం అందించగా, టిప్పు అండ్‌ హరిణి టిప్పు ఈ సాంగ్‌ను పాడారు. రథన్‌ ఈ పాటకు ఎంతో ప్లెజెంట్‌ సంగీతాన్నిఅందించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ '' ఈ పెళ్లి పాట తప్పకుండా అందరి హృదయాలకు హత్తుకుంటుంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో వచ్చిన ఉత్తమమైన పెళ్లి పాటల్లో తప్పకుండా మా రామచంద్రుడే సాంగ్‌ కూడా ముందు వరుసలో ఉంటుంది..రథన్‌ ఈ లవ్‌స్టోరీకి చాలా మంచి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో ఉన్న ఆరుపాటలు వేటికవే అనే విధంగా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ముఖ్యంగా ఈ పెళ్లి పాట అందరికి ఎంతగానో నచ్చుతుంది అన్నారు. నిర్మాత హరీష్‌ మాట్లాడుతూ '' ఈ సినిమా చేసిన నా టెక్నిషియన్స్‌, ఆర్టిస్ట్‌లు ఎంతో సపోర్ట్‌ చేసి మంచి ప్రొడక్ట్‌ను తీసుకొచ్చారు. బెస్ట్‌ క్వాలిటీ సినిమా ఇవ్వబోతున్నాం. పూర్తి ఎంటర్‌టైనింగ్‌గా రాబోతున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మీ హృదయాలను దోచుకుంటుంది. తప్పకుండా నిర్మాతగా ఓ మంచి సినిమాను ఇవ్వబోతున్నాం అనే నమ్మకం ఉంది. త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తాం' అన్నారు. 
ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్  అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. మణికందన్‌ సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ చిత్రానికి రథన్‌ సంగీతాన్నిసమాకూరుస్తున్నాడు. బ్రహ్మా కడలి ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. సుహాస్‌, మాళవిక మనోజ్‌, అనిత హస్సానందిని,  అలీ, రవీందర్‌, విజయ్‌ , బబ్లూ, పృథ్వీరాజ్‌, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్‌: భవిన్‌.ఎమ్‌.షా

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!