"వృశ్చికం" చిత్ర పాటల రికార్డింగ్ ప్రారంభం !!!


  శ్రీరామ్ ఫిలిమ్స్ సమర్పణ లో       మంగపుత్ర, యశ్విక జంటగా నటిస్తున్న సినిమా "వృశ్చికం". ఈ చిత్రాన్ని శ్రీ ఆద్య నిర్మాణం బ్యానర్ పై శివరామ్ నిర్మిస్తున్నారు. మంగపుత్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో "వృశ్చికం" సినిమా ఘనంగా ప్రారంభమైంది. 

ఈ చిత్ర హీరో, దర్శకుడు మంగపుత్ర  15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు, నటుడిగా పవన్ కల్యాణ్ గారి జల్సా, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ మూవీస్ తో పాటు బాహుబలి 1, 2 చిత్రాల్లో నటించారు. రాజమౌళి గారిని చూసి ఆయన దర్శకత్వానికి ఏకలవ్య శిష్యుడిగా మారారు. వృశ్చికం మూవీతో హీరోగా నటిస్తూ దర్శకుడిగా మారారు.

ఈ చిత్ర పాటల రీ రికార్డింగ్ ప్రారంభం అయ్యింది, ప్రమోద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ రచయితలు ఈ సినిమా కోసం సాహిత్యం అందిస్తున్నారు. 

 ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకోబోతోంది. 3 షెడ్యూల్స్ లో 45 రోజుల్లో సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రామచంద్రాపురం, ,మోతు గూడెం,హైదరాబాద్ లో షెడ్యూల్స్ ప్లాన్ చేశారు

మంగపుత్ర, యశ్విక, క్రాంతి బలివాడ, కోర్టు శ్రీనివాస్, మంజు ఆర్య, రవి, కోసూరి సుబ్రహ్మణ్యం, తదితరులు నటించిన ఈ సినిమాకు ఆర్ట్ : సముద్రాల రవిచంద్ర, మేకప్ - రఘు, మాటలు,: T. ఆనంద్ కృష్ణ, కాస్ట్యూమ్స్: తిరుమల, మ్యూజిక్ : ప్రమోద్, డీవోపీ: రాజ్ కె దిలీప్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రమణ కుమార్, స్టిల్స్ : పాలా.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఇ. శ్రీరామ్ గౌడ్, కో ప్రొడ్యూసర్ : తాండ్ర గోపాల్, సమర్పణ - గంగాధర్ రెడ్డి, ప్రొడ్యూసర్ - శివరామ్, రచన దర్శకత్వం: మంగపుత్ర

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!