23 Telugu movie review and rating !!!

23 (ఇరవై మూడు) మూవీ రివ్యూ & రేటింగ్  !!!


నటీనటులు : తేజ, తన్మయి, ఝాన్సీ, పవన్ రమేష్, తాగుబోతు రమేష్, ప్రణీత్ తదితరులు
దర్శకత్వం : రాజ్ ఆర్
నిర్మాతలు : స్పిరిట్ మీడియా, స్టూడియో 99
సంగీతం : మార్క్ కె రాబిన్
సినిమాటోగ్రఫీ : సన్నీ కుర్రపాటి
ఎడిటర్ : అనిల్ ఆలయం


మల్లేశం, 8 ఏఎం మెట్రో వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు రాజ్ ఆర్, ఇప్పుడు 23 (ఇరవై మూడు) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నేడు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
చిలకలూరిపేట 1993 నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథలో సాగర్ (తేజ) సుశీల(తన్మయి) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకుని జీవితాన్ని సుఖంగా గడపాలని కలలు కంటాడు. త్వరగా డబ్బులు సంపాదించేందుకు అతడు ఓ భయంకరమైన మార్గాన్ని ఎంచుకుంటాడు. ఫలితంగా ఓ ఘోర ప్రమాదం చటు చేసుకుంటుంది. అతను నిప్పటించిన బస్సులో 23 మంది అమాయకులు చనిపోతారు. దీంతో జైలు పాలైన సాగర్, పశ్చాతాప పడతాడు. తనను జైలు నుంచి విడుదల చేయాలని సాగర్ కోరుకుంటాడు. మరి సాగర్ జీవితంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి..? చట్టం అతడికి ఎలాంటి శిక్ష విధిస్తుంది..? అనేది ఈ సినిమా కథ.


విశ్లేషణ:
దర్శకుడు రాజ్ ఆర్ మరోసారి రియలిస్టిక్ కథను ఎంచుకుని ప్రేక్షకులకు ఓ చక్కటి సందేశాన్ని అందించాడు. వాస్తవంగా జరగిని ఘటనలు ఆయన కలిపిన విధానం సరికొత్తగా అనిపిస్తుంది. వేర్వేరు ఘటనల్లో న్యాయం ఎలా జరిగింది.. కులం, హోదా, పవర్ వంటి అంశాలతో న్యాయం ఎలా మారుతుంది.. అనేది చాలా డేరింగ్‌గా చూపెట్టారు.

హీరోయిన్ తన్మయి ఖుషికి ఈ సినిమాలో మంచి పాత్ర దక్కింది. ఆమె నటనపరంగా పర్వాలేదనిపించింది. ఝాన్సీ పాత్ర చిన్నదే అయినా, చాలా ప్రభావం చూపెడుతుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆమె పాత్ర ఆకట్టుకుంటుంది.

హీరో ఫ్రెండ్‌గా పవన్ రమేష్.. జైలర్ పాత్రలో ప్రణీత్ తమ పర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకుంటారు. మిగతావారు తమ పాత్రలమేర అలరించారు.

దర్శకుడు రాజ్ ఆర్ సమాజంలో న్యాయం అందరికీ సమానంగా దక్కదు అనే పాయింట్‌ను చాలా చక్కగా రాసుకున్నారు.  దానిని ఎగ్జిక్యూషన్‌ చెయ్యడంలో ఆయన సక్సెస్ అయ్యారు.  పదునైన రైటింగ్, చక్కటి నటీనటులు  ఈ సినిమాను మరో మెట్టుకు తీసుకొని వెళ్లాయి, ఓ సాలిడ్ చిత్రంగా నిలిచేలా చేసాయి, సన్నీ కుర్రపాటి సినిమాటోగ్రఫీ బాగుంది, మార్క్ కె రాబిన్ బీజీఎం గుడ్. అనిల్ ఆలయం ఎడిటింగ్ వర్క్ బాగుంది. 

ఓవరాల్‌గా, 23 (ఇరవై మూడు) చిత్రం ఓ చక్కటి సందేశాన్ని కలిగి ఉంది, ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ చిత్ర స్క్రీన్ ప్లే, నటీనటుల పర్ఫార్మెన్స్, నెరేషన్ ప్రేక్షకులను అలరిస్తాయి, దర్శకుడు రాజ్ ఆర్ 23 సినిమా ద్వారా  ఓ చక్కటి పాయింట్‌ను తెరకెక్కించారు, క్రైమ్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది, ఫ్యామిలీ అందరూ తప్పకుండా ఈ సినిమాను చూడవచ్చు.

రేటింగ్: 3/5

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!