sunNXT OTTలో అక్టోబర్ 11న వరలక్ష్మీ శరత్ కుమార్‌ 'శబరి' 5 భాషల్లో విడుదల...

విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'శబరి'. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రూపొందింది. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. మహర్షి కూండ్ల చిత్ర సమర్పకులు. అనిల్ కాట్జ్ ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయం అయ్యారు. అక్టోబర్ 11న సినిమా sunNXT OTTలో 5 భాషల్లో విడుదల కాబోతున్నట్లు నిర్మాత తెలిపారు. 

చిత్ర నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ ''కుటుంబం అంతా కలిసి కూర్చుని చూడదగ్గ సినిమా 'శబరి'. కథ, కథనాలు ఇన్నోవేటివ్‌గా ఉంటాయి. స్ట్రాంగ్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రమిది. వరలక్ష్మీ శరత్ కుమార్ గారితో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు ఆమె నటించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుందీ సినిమా. ముఖ్యంగా ఆమె నటన 'వావ్' అనేలా ఉంటుంది. 'శబరి' చిత్రం 300 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా మే 3న విడుదలయి  ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకుంది. అక్టోబర్ 11న అన్ని భాషల్లో sunNXT OTTలో విడుదల చేయబోతున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది'' అని చెప్పారు.

నటీనటులు:
వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి, వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని, బేబీ నివేక్ష, బేబీ కృతిక.

సాంకేతిక బృందం:
పాటలు: రహమాన్, మిట్టపల్లి సురేందర్
కాస్ట్యూమ్ డిజైనర్: మానస నున్న 
స్టిల్స్: ఈశ్వర్
ఫైట్స్: నందు - నూర్
కొరియోగ్రాఫర్స్: సుచిత్ర చంద్రబోస్, రాజ్ కృష్ణ
ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ పూలాల
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి
సంగీతం: గోపి సుందర్
సమర్పణ: మహర్షి కూండ్ల
దర్శకత్వం: అనిల్ కాట్జ్
నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి త్వరలో రాబోతున్న సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ !!!