లగ్గం సినిమా రివ్యూ & రేటింగ్ !!!
లగ్గం ఇది కేవలం చిత్రం అయితే కాదు
ఎన్నో సంఘర్షణల నిర్ణయం ఒక లగ్గం జరపడం. ప్రతి కంట తడి వెనక కారణం, ఓ కథ ఉంటుంది.ఈ లగ్గం ప్రతి నాన్న తాలూకు బాధ్యత!! ఈ లగ్గం ప్రతి కూతురి ప్రేమ లగ్గం.
మర్చిపోని, చెరగని ముద్రగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే చిత్రం లగ్గం.
సదానందం (రాజేంద్రప్రసాద్) తన కూతురు మానస ( ప్రగ్యా నగ్రా ) కి పెళ్లి చేయాలి అని తన సొంత చెల్లెలు సుగుణ( రోహిణి) కొడుకు ( సాయి రోనక్) ని చూడడానికి సిటీకి వస్తాడు. తన అల్లుడి ఖరీదైన జీవితం,జీతం,సాఫ్ట్వేర్ లైఫ్ చూసి తన కూతుర్ని ఎలాగైనా సాఫ్ట్ ఇంజనీర్కే ఇచ్చి పెళ్లి చేయాలి అని డిసైడ్ అయి తన చెల్లెలితో మాట్లాడి లగ్గం ఫిక్స్ చేసుకుంటారు.
ఇక్కడే తెలంగాణ నేపథ్యంలో లగ్గం చుట్టూ ఉండే సంప్రదాయాల్ని , పద్ధతుల్ని ఆచారాల్ని, చూపిస్తూ పెళ్లి సంబరం మొదలవుతుంది. ఇంత సంబరంగా మొదలైన పెళ్లి జరిగిందా లేదా!! పెళ్లి చేయాలంటే ఇరు కుటుంబాలు ఎలా ఆలోచించాలి ఏం చేయాలి. పెళ్లి కుదిరినంత మాత్రాన పెళ్లికూతురు అవుతుందా!! అసలు లగ్గం చేయాలంటే ఏం కావాలి!! వంటి అనేక విషయాన్ని డిస్కస్ చేసుకుంటూ ట్రెడిషన్ మిస్ చేయకుండా దర్శకుడు తన మార్క్ మేకింగ్, అర్థవంతమైన సంభాషణలతో. చక్కటి బాక్గ్రౌండ్ స్కోర్ తో, లగ్గం చుట్టూ ఉండే సరదా సరదా సన్నివేశాలతో , బంధువుల పాత్రలతో అందరినీ ఒక దగ్గరికి తీసుకొస్తాడు దర్శకుడు.
ఈ లగ్గం లో ప్రేక్షకుల్ని కూడా రచయిత దర్శకుడు అయినా రమేశ్ చెప్పాల ఇన్వాల్వ్మెంట్ చేసి పెళ్లికొచ్చిన బంధువులుగా మార్చాడు.
ఇంటర్వెల్ కి అస్సలు ఏం జరిగుంతుంది అని బ్యాంగ్ ఇచ్చి ఆలోచనలో పడేశాడు. మొదటి భాగం క్యారెక్టర్స్, వాళ్ల క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ ట్రెడిషన్ చెప్పాడు. సెకండ్ హాఫ్ మెల్లిగా టర్న్ తీసుకుని ఒక ఎమోషనల్ రైడ్ లోకి తీసుకెళ్లిపోతుంది. ద్వితీయభాగం మొదలైన కాసేపటికే ట్విస్టులు , ఎమోషనల్ సీన్స్ తో సగటు ప్రేక్షకుడిని దర్శకుడు కట్టిపేడేసాడు. ఒక లగ్గం చుట్టూ ఇన్ని సందర్భాలు , ఇన్ని కుతంత్రాలు , ఒక లగ్గం జరగాలి అంటే ఏం కావాలి అనేలా ప్రతీ సన్నివేశాన్ని చాలా బలంగా నిర్మించాడు అని చెప్పచ్చు. ఒక సాఫ్ట్వేర్ లైఫ్ స్టయిల్ , ఒక తండ్రి కూతురి జీవితం , ఎక్కడో కుటుంబానికి దూరంగా బతికే వారి కష్టాలు... ఇలా ఎన్నో సున్నితమైన విషయాలను చాలా చక్కగా అల్లుకున్నారు రచయిత-దర్శకుడు రమేష్ చెప్పాల. రచయితగా,దర్శకుడిగా రమేష్ చెప్పాల తన పనితనం చూపించాడని చెప్పాలి.
ఎన్నో మలుపులు తిరిగిన లగ్గం క్లైమాక్స్ చూసి తీరాల్సిందే!!
లగ్గంలో ముఖ్యఘట్టం అయిన అప్పగింతలు సాంగ్ తో సినిమా ముగుస్తుంది. కూతురికి పెళ్లి చేసి మెట్టినింటికీ పంపించే సందర్భాన్ని ఒక పాట రూపంలో ఎంతో ఎమోషనల్గా ప్రెసెంట్ చేశారు దర్శకుడు రమేష్ చెప్పాల. సినిమా చివరి నిమిషం బరువెక్కిన గుండెతో చేమార్చిన కళ్ళతో ప్రతీ ప్రేక్షకుడు బయటకి వచ్చేలా ఉంటుంది.
నటుల విషయానికి వస్తే రాజేంద్రప్రసాద్ గారు , రోహిణి గార్ల పాత్రలు ఈ సినిమాకి ప్రాణం అని చెప్పుచు. ఇద్దరు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు మొదటిసారి తెలంగాణ యాసలో సినిమా చేసిన ఎక్కడా మిస్టేక్స్ జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.రఘుబాబు , LB శ్రీరామ్, సప్తగిరి , రచ్చ రవి,చమ్మక్ చంద్ర , వడ్లమాని శ్రీనివాస్ , కిరీటి , అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రతీ ఒక్కరి పాత్ర ముఖ్యమైనదే..
ఈ చిత్రానికి మరో బలం సినిమాటోగ్రఫీ బాలరెడ్డి (బేబీ ఫేమ్) అలాగే మణిశర్మ గారు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. మణిశర్మ గారి మార్క్ BGM ని లగ్గంలో చూడచ్చు. ప్రతీ ఎమోషనల్ సన్నివేశాన్నీ తన BGM తో మరో మెట్టు ఎక్కించారు. చరణ్ అర్జున్ పాటలు బాగున్నాయి. మిగిలిన నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
చాలా రోజుల తరువాత థియేటర్లో ఒక చక్కని ఫామిలీ ఎంటర్టైనర్ చూసిన ఫీలింగ్ కలిగింది. కామెడీ , చక్కటి డ్రామా , బలమైన ఎమోషనల్ సీన్స్ ,ఆకట్టుకున్నాయి. దర్శకుడు కేవలం లగ్గం చుట్టూ మాత్రమే కథ రాసుకోకుండా లగ్గంతో పాటు కొన్ని కరెంట్ ఎఫైర్స్ ని టచ్ చేసి వాటి చుట్టూ కథను నడిపి , లగ్గంతో లింక్ వేసి ఎక్కడ బోర్ కొట్టకుండా కథను నడిపించాడు. ఫామిలీ ఎంటర్టైనమెంట్స్ కోసం చూసే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ చిత్రం లగ్గం. ఇంటిళ్ల పాది కలిసి చూడాల్సిన సినిమా లగ్గం.
రేటింగ్ : 3.5 / 5
Comments
Post a Comment